రవీంద్రభారతిలో నేడు ( 24-8-2011) జరిగిన ‘‘జాషువ సాహిత్యరాసామాజిక దృక్పథం’’ అనే అంశంపై జరిగిన సాహిత్య సదస్సు ఐఆర్‌టిసి అధికారి కిషోర్ బాబు మాట్లాడుతూ త్వరలో కోటిరూపాయల నిధులతో రాష్ట్రప్రభుత్వం ‘‘జాషువ సాహిత్య అకాడమీ’’ని రాష్ట్రంలోని రెండు విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేస్తుందని, త్వరలోనే విధివిధానాల్ని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు ప్రకటిస్తారని వెల్లడిరచారు
.నేను ‘‘ పిరదౌసి’’ కావ్యం గురించి మాట్లాడుతూచారిత్రక కావ్యవస్తువుని తీసుకొని, దాని ఆధారంగా తన ఆవేదనను కూడా కవి వ్యక్తీకరించారని, భారతీయ ఆలంకారిక దృక్పథం, సామాజిక దృక్పథాలతో ఈ కావ్యాన్ని పరిశీలించాల్సి ఉందని వివరించాను. ( త్వరలోనే నా ప్రసంగం పూర్తి పాఠాన్ని అందిస్తాను) డా॥ కాకాని సుధాకర్ శ్రీశ్రీ సాహిత్యంకంటే జాషువ సాహిత్యంలోని దళిత, బహుజన దృక్పథం ఉంద వివరించారు. గోగుశ్యామల జాషువ స్త్రీ వాద దృక్పథాన్ని విశ్లేషించారు. సభలో ఆచార్య ఎండ్లూరి సుధాకర్ పిరదౌసి కావ్యరచనా నేపథ్యాన్ని వివరించారు. ఒక కృతి భర్త వెయ్యి నూటపదహార్లు ఇస్తానని, నూటపదహార్లనే ఇవ్వడంతో జాషువ పిరదౌసి కావ్యాన్ని రాశారని వివరించారు. సభలో ప్రముఖ రచయిత డా॥బోయి జంగయ్య, పులుగుజ్జు సురేష్, జూపాక సుభద్ర తదితరులు పాల్గన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి