"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

01 April, 2011

ఆత్మహాత్యల కొనసాగింపే విగ్రహ విధ్వంసం -దివికుమార్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసాహితి

 
From: divi kumar <divikumar1949@gmail.com>
Date: Fri, Apr 1, 2011 at 4:15 PM
Subject: Dear Daarla gaaru--Please forward my article in full text form to our literary friends.Please incorporate the same in your BLOG for many viewers. Yours Divikumar
To: vrdarla@gmail.com


(విగ్రహాలు.....వైఖరులు.....విధ్వంసాలు....! ఆంధ్రజ్యోతి శీర్షిక)

    సామ్రాజ్యవాద యుగంలో, ప్రపంచీకరణ థలో తెలుగుజాతిని ఆత్మహాత్యల సంస్కృతి పెనుభూతమై వెన్నాడుతోంది. వేలాది రైతుల, చేతివృత్తుల వారి ఆత్మహాత్యలు మనకు తెలుసు. 'మహాÑ నాయకులు (వై.యస్‌.రాజశేఖరరెడ్డి)  మరణవార్తలనో, (చంద్రబాబు) అరెస్టు వార్తలనో విని తట్టుకోలేక కూడా ఆత్మహాత్యలు జరిగాయి. ప్రత్యేక తెలంగాణా సాధన కోసం అమాయక విద్యార్ధులు వందలాదిమంది ఆత్మహాత్యలు చేసుకున్నారు. ఇలా ఆత్మహాత్యలనేది ఒక సంస్కృతిగా మారిపోవటం తెలుగుజాతినే తీవ్రంగా కలచివేస్తోంది. ఆధునిక చరిత్ర నుండి ఎన్నో పోరాటానుభవాలను పొందిన జాతి, స్వాతంత్రోద్యమం-వీర తెలంగాణా విప్లవ పోరాటం, శ్రీకాకుళోద్యమం, సిరిసిల్లా జగిత్యాల జైత్రయాత్రలు తదితర అనేక ఉద్యమాల అనుభవాలతో తలపండిన జాతి.....ఆత్మహాత్యా సంస్కృతిలో  చిక్కుపోవటం నిజంగా చారిత్రక విషాదం. ఈ విషాదం వెనుక వ్యక్తిగత-సామాజిక రాజకీయ-సాంస్కృతిక పరిణామాల వికృతపర్యవసానాలున్నాయి.
    అవి అలా వుండగా ఒక జాతి స్వయంగా తన భాషా, సాహిాత్య, సాంస్కృతిక ప్రతీకలుగా నిలిచిన వైతాళికుల విగ్రహాలపై దాడి చేసుకోవటం, విరగగొట్టుకోవటం, విధ్వంసం గావించుకోవటం, విసిరి నీళల్లోకి పడదోసేయటం కూడా ఆత్మహాత్యా సదృశమైనదే. నిజవేు! కొందరు దుందుడుకువాదులు, విధ్వంస స్వభావులు, విద్వేషం  తలకెక్కించుకున్న వారు, క్షణికోద్రేకపరులే ఆ దుశ్చర్యకు పాల్పడి వుండొచ్చు గాక! అయితే అది పదŠకం ప్రకారం, వ్యూహాత్మకంగా, కుట్రపూరితంగా జరిగిందనేది ఎవరం విస్మరించలేం. తనస్వార్ధ అధికార ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం, స్పష్టంగా తెలిసి కూడా ఉద్దేశ్యపూర్వకమైన నిర్లక్ష్యాన్నీ, ప్రేక్షక పాత్రనూ పోషించింది. జాతి వికాసానికి నిర్మాణాత్మకమైన ప్రగతిశీల రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలనందించలేని అభివృద్ధి నిరోధక ప్రభుత్వం విధ్వంసాత్మక చర్యల నడ్డుపెట్టుకొని తన ప్రాణం నిలుపుకోవాలని యత్నించటం కూడా రాజకీయాలలో వ్యక్తమవుతున్న ఒకానొక పతన సాంస్కృతిక విలువగానే చూడాల్సి వుంటుంది.
    ఆత్మహాత్యల కారణాలను గ్రహిాంచటానికి వివరణలూ, విశ్లేషణలూ చేసుకోవటం వేరు, వాటికి సాంఘిక ఆమోదాన్ని (సోషల్‌ జస్టిఫికేషన్‌) కల్పించటానికి ప్రయత్నించటం వేరు. ఆత్మహాత్యలను ఖండించని వారెవరుంటారు? వాటిని వీరోచిత చర్యలుగా అభివర్ణించటం అభూతకల్పనల అనుభూతి కవిత్వాలను అల్లటం, వాటిని అడ్డుపెట్టుకొని విద్వేష భావజాలాలలను వ్యాప్తి చేయటం మాత్రం ఖచ్చితంగా ఆత్మహాత్యల సంస్కృతికే దోహాదపడుతుంది.
    మార్చి 10వ తేదీన హౖదరాబాదులో టాంక్‌ బండ్‌పై జరిగిన విగ్రహాల విధ్వంసం తెలుగు జాతి తనను తాను సాంస్కృతిక ఆత్మహాత్య గావించుకోవటం తప్ప మరేమీ కాదు.
    ఇదొక సామూహిాక ఆత్మహాత్య. ఒక ప్రాంతం వారిపైనే ఉద్దేశించినట్టుగా ఇది స్పష్టమవుతోంది. గానీ పదిహాేను కోట్ల జనులున్న ఒక విశిష్ట మానవ జాతి తన స్వంత చేతులతో తన గుండెను తాను పొడుచుకోవటం లేక తన మెడను తాను ఖండించుకోవటం.....ఆత్మహాత్య కాక ఇంకేమిటి?
    ''తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు.....రాసిన వేమన, మానవ సమాజాన్ని ఉద్దేశించి మనదైన భాషలో ఒక జీవితసత్యాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటాడు. తెలుగువాడు  ప్రపంచంలో తలెత్తుకు చెప్పుకోగలిగిన సాంస్కృతిక విలువలను వేమన మనకందిస్తే ఇప్పుడు మనం ప్రపంచం ముందు తలదించుకోవాల్సిన దురవస్థలో చిక్కుకున్నాం. వేమన పద్యం రానివాడూ, శ్రీశ్రీ కవితావాక్కుని ఎరగనివాడూ తెలుగునాట ఎవరైనా వున్నారా? ''సుకవి జీవించు ప్రజలనాల్కలందు అని గుర్రం జాషువా చెప్పింది ప్రపంచ కవులందరకూ వర్తించదా? విశ్వనరుడే సుకవి కాగలుగుతాడు. హ్రాస్వ దృష్టి గలవాడు బావిలో కప్పలా మిగులుతాడు.
    జాతి ''ఆత్మహాత్యలను నిర్దుష్టంగా ఖండించలేకపోవటం కూడా ఆ జాతికి ఆత్మహాత్యాసదృశమైనదే! జాతి జీవితంలో అదొక ద్రౌపదీ మానభంగంలా, కురువంశానికొచ్చిన కళంకంలా చారిత్రక విషాదంగా మిగిలిపోతుంది. సాహిాత్యకారులై వుండి భాష, సాహిాత్యం, సంస్కృతుల జాతీయ ప్రతీకలపై దాడి జరిగితే కొందరు దుర్మోధనులై విర్రవీగటమూ, ఇంకొందరు కర్ణులై (ఉద్యమ)-స్నేహా బంధానికి కట్టుబడి పోవటమూ, ఇతరులు భీష్మపితామహులై తలను వాల్చుకోవటమూ జరుగుతోందంటే ''దకక్షులెవ్వారలుపేక్షసేతురొ, వారల చేటగుగాకÑÑ (తిక్కన-ఉద్యోగపర్వం) అనక తప్పటం లేదు.
    విధ్వంసాన్ని ''విధ్వంసం అనటంలోనే కుట్రదాగుందిఅనటమంటే...నోరెత్తి మాట్లాడటాన్నే నిషేధించటం కాదా యిది! 'వివిధ (13.3.2011) స్పందనలలో నన్ను అత్యంత నిరాశపరిచింది వరవరరావు మాటలు. ఆయనతో నాకు 42 ఏళ పరిచయం. ఆయన డాక్టరేట్‌ పట్టా కోసం పరిశోధించి ప్రచురించిన ''తెలంగాణా విమోచనోద్యమం-తెలుగు నవల. సమాజ సాహిాత్య సంబంధాల విశ్లేషణఒక రిఫరెన్స్‌ బుక్‌లా నా పుస్తకాల అరల్లో చేతికందుబాటులో వుండే గ్రందŠం. ఆయన విమర్శ-ఆత్మవిమర్శ గురించి, తప్పులు సరిదిద్దుకోవటంలో ఆ ప్రక్రియ విశిష్టతను గురించీ ఎక్కువగా రాస్తారు.  విమర్శ-ఆత్మవిమర్శే కాదు. ఆత్మఖండన అనేది కూడా ఒకటుంటుంది. జలగం వెంగళరావు ప్రభుత్వంలో ఆస్థానకవి పదవిని అలంకరించిన దాశరధిని ''నిజాముకు వ్యతిరేకే గాని రాచరికానికి కాదనిÑÑ తాత్పర్యం చెప్పిన వరవరరావు (సృజన సంపాదకీయం-సెప్టెంబరు 77) దాశరధికి అన్యాయం ఎవరో చేశారన్నట్టు రాయటం ఏం సబబు? పైన పేర్కొన్న పరిశోధన గ్రంధంలో తెలంగాణా చరిత్రను తడిమిన ఆయన కొమరం భీం పేరు ప్రస్తావించనే లేదు. తాను స్మరించని పేరుని ఎవరో విస్మరించారనటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? జీవితపు అట్టడుగు పొరల నుండి ప్రజాఉద్యమ నాయకునిగా ఎదిగిన కోరాపుట్‌ చాషీమూలియా ఆదివాసీ సంఘం నాయకుడు కేండ్రుక అర్జున్‌ హాత్యను ఖండించలేని వరవరరావు కొమరం భీం విగ్రహాం గురించి పదే పదే ప్రస్తావించటమొక వైరుధ్యం కాదా?
    ''తెలంగాణా విమోచనోద్యమం......లో ఆయన రాసిన ఈ వాక్యాలు చూడండి. ''ఆరంభకాలంలో ఈనాటి ఆంధ్రదేశమంతా తెలంగాణవేు... తెలంగాణమంటే తెలుగువారుండే దేశమని అర్ధం. ఇది ప్రాచీన శబ్దం....రెండో నిజాం అయిన నిజామాలీఖాన్‌ 1766లో కోస్తా జిల్లాలను, 1800ల్లో రాయలసీమను ఇంగ్లీషు వారికి దత్తం చేశాడు. విశాలమైన తెలంగాణం ఈ విధంగా రెండు భాగాలుగా చీలిపోయింది (పేజీ 25) తెలంగాణా విమోచనోద్యమం-ఫ్యూడల్‌ భూస్వామ్య సంబంధాల నుంచి విముక్తి అనే అర్ధంలో ఇంకా అసంపూర్ణంగానే మిగిలిపోయింది. (పేజీ 42-తెలుగు నవల-పరిశోధనా గ్రంధం నుండి)
    ఆంధ్ర-తెలంగాణా అనే భావన విషయంలో వీర తెలంగాణా పోరాట నవలలు ఆరింటిని వరవరరావు పరిశోధించి నిగ్గు తేల్చిన సారాన్ని తానే నిరాకరించే విధంగా ప్రయాణించటం నాలాంటి వాడికది విషాదం. ఆయన ''ఆత్మ ఖండనకు (స్వవచన వ్యాఘాతం అనొచ్చునేమో) పాల్పడుతుంటే తనను తాను పల్చన చేసుకొంటున్నాడనేదే నా బాధ.
    ఆయన పరిశీలించిన 6వ నవల 'సింహాగర్జన (రచన. పమిడిముక్కల లక్ష్మీకాంతమోహాన్‌) అది సాయుధ పోరాటం రెండవ థ ముగియక ముందే రాసిన నవల. వరవరరావు మాటల్లోనే ముల్కీ-నాన్‌ముల్కీ (తెలంగాణ-ఆంధ్ర) అన్న భావనతో ఆంధ్ర నుండి వచ్చిన కావ్రేుడ్‌ పట్ల ''విముఖత-వ్యతిరేకత-ఈర్ష్య కలిగి వుండటం ''సంకుచితమైనదిÑÑ. ''నేరంÑÑ చేయటంతో సమానమైనది. అంతేకాదు కమ్యూనిస్టు పార్టీకి హానిని కలిగించే ''నీచపు ఆలోచనÑÑ ఇవన్నీ వరవరరావు రాసినవే. పాఠకులు స్పష్టంగా అర్ధం చేసుకోగలందుకు కొద్ది పేరాలు యదŠాతధంగా యిస్తున్నాను.
    ''నిజాయితీ, త్యాగం, సేవాభావం, కృషి విషయంలో రామిరెడ్డిలో వేలెత్తి చూపడానికి ఏ లోపమూ లేదు. కాని అతనికి తెలియకుండానే అతని మనసులో ముల్కీ-నాన్‌ముల్కీ (తెలంగాణ ఆంధ్ర) అనే ఒక భావన ఏర్పడి తాలూకా ఆర్గనైజరుగా ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ పంపించిన గుంటూరుజిల్లా నివాసి శ్యాంసుందర్‌రావు పట్ల విముఖత, వ్యతిరేకత, ఈర్ష్యాభావాలు ఏర్పడినాయి. శ్యాంసుందర్‌రావు శత్రువుచేతిలో చిక్కి శత్రువు ప్రాణాలు తోడేస్తున్నప్పుడు కూడా రామిరెడ్డి జాడ చెప్పకపోయినప్పుడు గానీ తాను ఎంత సంకుచితంగా ఒక వుత్తమమైన కావ్రేుడ్‌ గురించి ఆలోచించాడో రామిరెడ్డి గ్రహిాంచుకోలేదు. అతనిలోని ఈ బలహీానతను ఒక సామాన్య కార్యకర్త కూడా ఎత్తి చూపాడు.
    ఆసఫ్‌జాహిా పరిపాలన వలన రెండు వందల సంవత్సరాల పాటు మూడుకోట్ల తెలుగు ప్రజలు వేర్పడి జీవించవలసి వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలోని రెండుకోట్ల ప్రజలు ఒక రాజకీయ ఆర్ధిక వ్యవస్థలోనూ తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు మరొక రాజకీయ ఆర్ధిక వ్యవస్థలోనూ జీవించవలసి రావడం వల్ల ఆర్ధిక రాజకీయ రంగాల్లోనే కాకుండా సాంఘిక రంగంలో కూడా మానసిక అవగాహానలో కూడా అంతర్వులు, అవగాహానా సమస్య ఏర్పడినవి. ఈ ఆర్ధిక రాజకీయ వ్యత్యాసాలకు కారణమైన పాలకవర్గాలే ఈ అవగాహానా సమస్యలను పరిష్కరించే కృషికి బదులు అవి అపోహాలుగా, పరస్పర అవిశ్వాసాలుగా పెరిగే స్థితికి తీసుకుపోయినవి. ఈ స్థితిని తొలగించవలసిన కమ్యూనిస్టు పార్టీ కూడా ఈ స్థితి వల్ల వచ్చిన సమస్యలు ఎదుర్కోక తప్పలేదు.
    తాను నేరం చేస్తున్నానని తన హాృదయాంతరాళంలో రామిరెడ్డి నమ్మాడు. అలాంటి నీచపు ఆలోచన పార్టీకి హానికరమని కూడా అతడు నమ్మాడు. కాని తన బలహీానతను మాత్రం అతడు వదిలించుకోలేకపోయాడు.
    శ్యాంసుందర్‌రావును యూనియన్‌ పోలీసులు చంపారన్న వార్త విన్నప్పుడు ఆవేదనతో రామిరెడ్డి హాృదయం వ్రయ్యలయ్యింది. రామిరెడ్డి పశ్చాత్తాపంతో తపించిపోయి తోటి కావ్రేుడ్స్‌ వద్ద తన సంకుచితమైన ఆలోచనలు చెప్పుకుని క్షమాపణ కోరుకున్నాడు.
    తెలంగాణ రైతాంగ పోరాటం నిర్వహిాంచిన కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల్లో కూడ చుట్టూవున్న భూస్వామ్య సంస్కృతి ప్రభావం వల్ల ప్రాంతీయ, మత, కులతత్త్వాలు పూర్తిగా లేకుండాపోలేదు. ఈ కార్యకర్తలు కూడా యీ వ్యవస్థ నుంచి వచ్చినవాళే. ఆకాశంలోనుంచి వూడిపడినవాళు కాదు. కనుక కొత్త ఆలోచనలు వాళను కొత్తగా మలచాల్సిందే తప్ప పాత అలవాట్లు లేకుండానే, పాత భావాలు లేకుండానే వాటితో ఘర్షణ పడకుండానే వాళు కొత్త సమాజ నిర్మాణానికి పూనుకున్నారనుకోవడం అసహాజమైన విషయం. ఈ అంశాన్ని సూచనప్రాయంగా చూపించడానికే రచయిత రామిరెడ్డి పాత్రలో ఈ బలహీానతను చిత్రించాడని అర్ధం చేసుకోవచ్చు. ఈ నవలా రచయిత ఉద్యమాన్ని దూరంనుంచి చూసినవాడు కాకుండా ఉద్యమంలో తలమునకలుగా వున్నవాడుగా కనిపిస్తాడు. ఈ బలహీానతలు వుండడం కాని వున్నాయని చిత్రించడంగాని లోపం కాదు. ఈ బలహీానతలున్నా కార్యకర్తలు అవి దాచుకుని నటించలేదు. వ్యక్తం చేసి సరిదిద్దుకున్నారు. ఆచరణలో సరిదిద్దుకున్నారు. విమర్శ ఆత్మవిమర్శ అనే మార్క్సిస్టు అవగాహానతో తమ ఆచరణను మెరుగుపర్చుకున్నారు. పోరాటం మందగించినపుడు ఈ ఆత్మవిమర్శ, విమర్శ, లోపించి ఈ బలహీానతలే ప్రబలంగా పైకి వచ్చాయి.ÑÑ (తెలంగాణా విమోచనోద్యమం-తెలుగు నవల పేజీ 419-420)
    ఆనాడు (1980) వరవరరావుగారి అవగాహాన ప్రకారం ''కుల-మత-ప్రాంతీయ తత్త్వాలకుకారణం భూస్వామ్య సంస్కృతీ ప్రభావం. ఉద్యమ కార్యకర్తలు ఈ బలహీానతల్ని విమర్శ-ఆత్మవిమర్శ అనే మార్క్పిస్టు అవగాహానతో తమను తాము సరిదిద్దుకున్నారు. ఆచరణను మెరుగుపరచుకున్నారు. ''పోరాటం (ఫ్యూడల్‌ వ్యతిరేక) మందగించినపుడు ఈ ఆత్మవిమర్శ, విమర్శ లోపించి ఈ బలహీానతలే ప్రబలంగా పైకి వచ్చాయి.ÑÑ అని కూడా ఆయనే రాశారు. తెలంగాణాలో ఇంకా 'పచ్చ(పాములా)గా వున్న భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కొనసాగాల్సిన పోరాటాన్ని కమ్యూనిస్టు ఉద్యమం నీరుగార్చుకున్న ఫలితంగానే యిలా జరుగుతోందని నాబోటివాని ఆవేదనా పూర్వక ఆరోపణ. పోరాటం ఉధృతంగా సాగిన కాలంలో తెలంగాణా-ఆంధ్ర సాధారణ ప్రజల నడుమ ఐకమత్యం వుండింది. పాలకుల నడుమ కూడా (కోస్తాజిల్లాల్లో క్రూరంగా పోలీసు నిర్బంధాలూ-బూటకపు ఎన్‌కౌంటర్లూ...1948-51లో చాలా జరిగాయి) ఐక్యత వుంది. ప్రజల నడుమ అనైక్యతను పెంచుతున్నది భూస్వామ్య-బూర్జువా పాలకులేనని వరవరరావుగారు కూడా 30 ఏళ క్రితం చెప్పారు. ఇప్పుడు తన మాటలనే తాను ఖండించుకుంటూ...ఆత్మఖండన గావించుకోవటం....టాంక్‌బండ్‌పైన విధ్వంసాన్ని ఖండించకుండా 'ప్రజలపేరుతో పరోక్ష సమర్ధింపుకు పూనుకోవటం ఆయన స్థాయికి తగదు. సింహావలోకనం నవల 60సం||ల క్రితపుది. వరవరరావు పరిశోధన 30 ఏళ నాటిది. ఆయన చేసుకుంటున్నది ఆత్మఖండన కాకుండా 'విమర్శ-ఆత్మవిమర్శల పరికరంతో గతితార్కిక అభివృద్ధి క్రమంలో తాను సాగుతున్నానని ఆయన భావిస్తుంటే.....మొత్తంగా వామపక్ష ఉద్యమంలోనే అది చర్చనీయంశమవుతుంది. అపుడు సాహిాత్యకారులు ప్రాంతాలుగా కాక దృక్పదŠం ప్రాతిపదికగా మరోసారి విభజనకు గురికావాల్సి వుంటుంది.

-దివికుమార్‌
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసాహితి

No comments: