"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

01 October, 2010

అన్నాబావు సాఠే


భారతీయ గోర్కీ అన్నాబావు సాఠే !

- అట్టడుగునుంచి అత్యున్నత స్థాయికి
- ప్రజాకళకు, సాహిత్యానికి మార్గదర్శి
- తెలంగాణ సాయుధ పోరాటంపై ఒగ్గుకథ
- సామాజిక న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం

Anna_Bhau_Satheగ్రామీణ ప్రాథమిక విద్యాభ్యాసం అరకొరగా సాగించి, ఏ వంశ పారంపర్య సాహిత్య సాంస్కృతిక వాతావరణ మద్దతు లేకుండా, ఖూనీకోరుగా పోలీస్‌ రికార్డుల్లో బ్రిటిష్‌ సర్కార్‌ చిత్రించిన సంచార జాతికి చెందిన ఒక నిమ్న కుల వర్గీయుడు భారత దేశ సాహిత్య అకాడమీ అవార్డు పొంది, సోవియట్‌ యూనియన్‌ గుర్తింపు స్థాయికి ఎదిగి, భారతదేశ మ్యాక్సిం గోర్కీగా పేరు సంపాదించడం ఊహించలేని అంశం. మరాఠీ సాహిత్యం ద్వారా ప్రగతిశీల, దళిత, బహుజన వర్గాల కు ఎంతో అభిమాన పాత్రుడు, చిరస్మరణీయుడు, అగ్రశ్రేణి సాహితీకారుడు అన్నాబావు సాఠే. ఆయన జన్మదినం 1920 ఆగస్టు1న. అతి తక్కువ వ్యవధిలో అమూల్యమైన సాహిత్యాన్ని సృష్టించి 50 ఏళ్ళ వయసులోపునే 1969 జులై 18న అస్తమించిన రేపటి వెలుగు చుక్క.

మహారాష్టల్రోని సాంగీ జిల్లా వాఠేగావ్‌లో బావూ- వాలూబాయి దంపతులకు అన్నాబవు జన్మించాడు. అతి శూద్ర కుల వర్గానికి చెందిన మాంగ్‌ (మాతం గ్‌) అనే నిమ్నజాతిలో పుట్టినందున వారికి నిర్దిష్ట వృత్తి పని కూడా లేదు. బావూ నానా కష్టపడి విధిలేక ముంబాయికి ఒక్కడే వెళ్ళి గ్రామంలో వదలి వెళ్ళిన తన కు టుంబాన్ని ఏదో ఒక రూపంలో పోషిం చాడు. బావూకు ఐదుగురు సంతానం. వారిలో ఒకరు చిన్ననాడే మరణించా డు. మొదటి సంతానం కుమార్తె. పేరు బాగూబాయి. తర్వాత అన్నాబావు, శం కర్‌, జారుూబాయి జన్మించారు. బాల్యంలో అన్నాబావును తుకారాం అని పిలిచేవారు. కాని తర్వాత అందరూ ప్రేమతో అన్నా అనే పేరుతో పిలవడం వలన అదే పేరు స్థిరపడింది.

ఫకీరా అనే వ్యక్తి అన్నాబావు మామ- బ్రిటిష్‌ వారికిపై తిరుగుబాటు చేపట్టాడు. ఆయన ప్రభా వం చిన్న వయసులో అన్నా బావుపై పడింది. అన్నా విద్యాభ్యాసం రెండవ తరగతి వరకు జరిగిందని కొందరు, లేదు ఏడవ తరగతి వరకు కొనసాగిందని మరికొందరు పరిశోధకులు వాదించారు. కాని నేటికీ వాటికి సరియైన ఆధారాలు లభించడం లేదు.బాల్యంలో అన్నా ఊరిలో, ఊరవతల జరిగే జాతరలలో పాల్గొని అక్కడి సాహిత్య, సాంస్కృతిక, క్రీడా రంగాలలో ఎక్కువ శ్రద్ధ చూపేవాడు. దానితో ఆయనకు ప్రజా గేయాలు, ఒగ్గు కథలు, జానపద, పురాణ, వీరగాథలు, వేట కథలు, సాహస కృత్యాలపై మక్కువ పెరిగింది.

దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన క్రాంతి వీరుడు నానాపాటిల్‌ ఉద్వేగ ఉపన్యాసం ఆయనపై బలంగా ప్రభావం చూపింది. దీంతో వారితో కలిసి అజ్ఞాతవాస కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అన్నా బావు తల్లి ఈ పరిస్థితిని గమనించి వెంటనే తమ కుటుంబాన్ని ముంబాయికి రప్పించుకొమ్మని వినతి చేసింది. దానితో బావూ కుటుంబం మొత్తం నానా కష్టాలు పడి (సతారా నుంచి నడుస్తూ) ముంబాయికి చేరు కుంది. అక్కడ స్థిరమైన నివాసం లభించకున్నా బావూ తన చాలీ చాలనీ జీతంతో ఒక పూరి గుడిసెలో కా లం వెళ్ళబుచ్చి కుటుంబాన్ని పోషించుకున్నా డు. అన్నాబావు ముంబా యిలో తండ్రికి ఆర్థిక సహకారం నిమిత్తం నానా రకాల పనులు చేశాడు.

చివరికి బట్టల మిల్లులోనూ చేరా డు. అప్పుడే బట్టల మిల్లు కార్మికుల కోసం సంఘాలు స్థాపిస్తూ కమ్యునిస్టు పార్టీ బలమై న ఉద్యమాన్ని నిర్మించసాగింది. అన్నాబావు కు కమ్యునిస్టు భావాలు గల వ్యక్తులు పరిచయమయ్యారు. ఆయనలోని సాహిత్య కళను గుర్తించి వెలికి తీయడానికి సహకా రం అందించారు. బాల్యం నుంచే నాటకాలు, గేయాలు, జానప ద సాంస్కృతిక ప్రదర్శనలలో విశేష ఆసక్తి ఉన్నందున అన్నాబా వు సాహిత్య, సాంస్కృతిక రంగాలను ఎంచుకుని తొలి రచనకు ఉపక్రమించాడు.ఆ కాలంలో ముంబాయిలో కమ్యునిస్టుల నేతృత్వంలో సభలు, సమావేశాలు, సమ్మెలు, ధర్నాలు సాగేవి.గోడలపై రాతలు మొదలు నినాదాలు చేసే వరకూ అన్నింటిలో అన్నాబావు పాల్గొన్నాడు.మార్క్సిజం ప్రభావంతో పూర్తికాలం ఉద్యమ కార్యకర్తగా పని చేయడం ప్రారంభించాడు. ఉద్యమం లో తన ఆలోచనా ధోరణి విస్తరించి సాహిత్య సాంస్కృతిక రంగాలలో అగ్రశ్రేణికి చేరాడు.

‘జగ్‌ బదల్‌ ఘాలునీ సాంగూన్‌ గేలే మలాభీమ్‌రావ్‌’ గీతం అన్నాబావు రాసిన అన్ని గేయాలలో ప్రసిద్ధి చెందింది. దీని అర్థం ‘ప్రపంచాన్ని మార్చివేయమని నాకు నా భీమ్‌రావ్‌ (డా అం బేడ్కర్‌)చెప్పి వెళ్ళాడు’. క్రియాశీల కమ్యునిస్టు కార్యకర్త గా ఉన్న బావూ దళితుల పట్ల, వెనుకబడిన బలహీనవర్గాల పట్ల, కుల వివక్ష పట్ల ఝుళిపించిన కలం అగ్రకుల వర్గాల దోపిడీ గుండెల్లో అల్లకల్లోలం సృష్టించింది.అన్నాబావును ఒక రాజ కీయ కార్యకర్తగా కంటెగొప్ప సాహిత్యకారుడిగా మరాఠీ ప్రజ లంతా గుండెల కద్దుకుంటారు. భారత దేశ సాహిత్యంలో ఇంతవరకు ఏ ఒక్కరూ- కవి, రచయిత, నాట కకర్త, వాగ్గే యకారుడు, విమర్శకుడు వంటి అనేక విభిన్న రూపాను సమగ్రంగా అందుకొని ఎదగలేక పోయారు.కానీ అన్నా వారికి విరుద్ధంగా అద్భుత కళా సాహిత్యాన్ని సృష్టించ గలిగాడు.

అన్నాబావు రాసినవి 32 నవలలు. వాటిలో ప్రతి ఒక్కటి ఆణి ముత్యమే. వాటిలో దాదాపు 7 నవలల ఆధారంగా మరాఠీలో సినిమాలు విడుదలయ్యాయి. అవన్నీ బాక్సాఫీసులో హిట్టయ్యా యి. అందులో ‘ఫకీరా’ నవల కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకోవడమే కాకుండా మరాఠీ సాహితీ పాఠకలోకాన్ని ఊర్రు తలూగించిన కథ. అందులో హీరో దోపిడీ దొంగ. గ్రామాల్లో పేదలపై జరిగే అన్యాయాలను సహించలేక సాయుధుడై పీడకు లను గజగజ వణకిస్తూ అడవిలో మకాం చేస్తాడు.

సరిగ్గా ‘రాబిన్‌ హుడ్‌’ వలె భూస్వాముల, ధనవంతుల ధాన్యాన్ని, డబ్బును దోచుకుని గ్రామీణ పేద జనానికి పంచి పెడతాడు. కథ చివరలో పట్టుబడి ఉరిశిక్షకు గురి అయినా తను ఎంచుకున్న మార్గంలో తప్పులేదని, భవిష్యత్తు పరిణామాలకు తానొక మార్గదాతనని చాటి చెబుతాడు. ఇలా అన్నా రాసిన ప్రతి నవలలో ఏదో ఒక సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశం ఉండడం విశేషం. ప్రేమ, కుటుంబ కలహాలు, ఆర్థిక గొడవలు, రాజకీయాలు- ఒకటేమిటి విభిన్న మనస్తత్వాలతో పీడితుల పక్షాన నిలబడి వాటికి ఆలోచింపచేసే, ఆశ్చర్యపరిచే రీతిలో తుది రూపాన్ని సృష్టించడం ఆయన గొప్పద నం. అన్నాబావు రాసిన కథలు 22. వీటిలో అమృత ఆబీ నుంచి స్వప్న సుం దరి వరకు ప్రతి కథా గొప్పదే. ఆయన శిల్పం, శైలి గురించి ఎంత చెప్పినా తక్కువే.

అంత తక్కువ చదువుతో, అం త తక్కువ సమయంలో ఆయన ఎలా ఎదిగాడన్నది ఎందరో పరిశోధకులను సైతం ఆలోచింపజేసిన అంశం. అన్నా బావు మాములు కథకుడు నవలాకారు డే కాదు గొప్ప నాటకకర్త, జన నాట్య కార్యకర్త. అన్నాబావు రాసిన గొప్ప నాటకాలలో అతి ముఖ్య మైనవి 16. వాటిలో ఎన్ని కల మోసం, దేశభక్తి మో సం, నాయకుడు దొరికిండు, ప్రజాస్వామ్య యాత్ర వంటి నాటకాలు విరివిగా ప్రదర్శితమై జనాన్ని ఎంతో ఆకర్షించాయి.

అన్నాబావు రాసిన పద్యాలలో ‘షాహీర్‌’ (వాగ్గేయ కారుడు) మరాఠా ఆ బాల జనానికి ఎంతో నచ్చిం ది. అన్నాబావు స్వయంగా గానం చేస్తూ స్టేజీ పై ప్రదర్శన ఇచ్చి లక్షలాది జనం చేత ‘షాహీర్‌ అన్నా బావు’గా, ‘వాగ్గేయకారుడిగా’ పేరు గడించాడు. ఆయన జానపద కళా సాహిత్య కృతులలో ప్రధానమైనవి 1. పోవడా (ఒగ్గుకథ), 2. లావిణీ (స్ర్తీల నృత్యం), 3. పదే, 4. గీతే, 5. చక్కడ్‌. పోవడాలలో 9 అతి ప్రధానమైనవి. మొదటిది 1942లో వ్రాసిన స్టాలిన్‌గ్రాడ్‌ ఒగ్గుకథ. రెండవది బంగాళ్‌ హాక్‌. జులై 23, 1944లో రాశాడు. అలా బర్లిన్‌ చీ పోవడా, పంజాబ్‌, ఢిల్లీ అల్లర్లు 1947లో రాశాడు.ఆ తర్వాత 1947 లోనే తెలంగాణ సమస్య స్పష్టమైన రాజకీయ అవగాహనతో ‘తెలంగాణ సాయుధ పోరాటాన్ని’ సమర్థిస్తూ నిజాం రజాకార్ల దారుణ అత్యాచారాలను ఎండగ డుతూ బలమైన గీతాలతో, సంభాషణలతో ‘తెలంగాణ పోరా టం’ ఒగ్గుకథ రాశాడు.

వేలాది ప్రదర్శనలు ఇచ్చాడు. బహుశ మన నాజర్‌, సుంకర సైతం అంత విస్తృతంగా తిరిగి (నిర్బధం వల్ల) ఆ కాలంలో ప్రచార ప్రదర్శనలు ఇచ్చి ఉండక పోవచ్చు. ఆ తర్వాత ముంబాయి మిల్లు కార్మికులపై, నల్లబజారుపై అమర వీరులపై 1949 వరకు ఎన్నో నాటికలు రాసి స్వయంగా తనే ప్రదర్శన ఇచ్చే వాడు. ఆయన గొంతు గంభీరమై నందున చిన్ననాడు గానం, నృత్యం, నటన, పఠనం నేర్చుకున్నందున సాధన సులభమెంది.

కమ్యునిస్టు ప్రజానాట్య సంస్థ తరపున పని చేసినందున అందులో అమర్‌శేఖ్‌, గవన్‌కర్‌ లాంటి గొప్ప ప్రజా నాట్య కళా మండలి లభించడం వలన అన్నా అగ్రశ్రేణి స్థాయికి దూసు కు వెళ్ళగలిగాడు. దళిత కుటుంబంలో పుట్టినందున కొంత వరకు సాంప్రదా య మార్క్సిజంను వదులుకున్నాడు. అన్నాకు ఇప్టా (ఐ.పి.టి.ల)తో అనుబంధం వల్ల ముంబాయి హిందీ సినీ పరిశ్రమలో క్యారెక్టర్‌ నటుడిగా ప్రసిద్ధి చెందిన బలరాజ్‌ సహాని, ఎ.కె.హంగల్‌ వంటి ప్రముఖ నటులతో దగ్గరి సంబంధం ఉండ ేది. ఆ కాలంలో వెలువడే బ్లిట్జ్‌ సంపాదకుడు కె.ఎ.అబ్బాస్‌ నిర్మిం చిన చిత్రాల్ని సమీక్ష చేస్తూ అన్నా వ్యాసాలు సైతం ప్రముఖ దిన పత్రికలలో రాసేవాడు. ఆయన విలేకరిగా ఎన్నో నాళ్ళు పని చేసాడు. దానితో బాటు వివిధ పత్రికలో విస్తృత స్థాయిలో- సమ్మెలు, అత్యాచారాలు, దోపిడీలు, లంచగొండితనాలపై, రాజ కీయ, ఆర్థిక అంశాలపై ప్రత్యేక కథనాలు రాసేవాడు.

prbhakar ఇంతటి సమగ్ర ఆలోచనా ధోరణిలో ఉన్న సాహితీ వేత్త, బహుశా భారత దేశ సాహిత్యంలో అరుదు. అందుకే ఆయనను సోవియట్‌ యూనియన్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించ డం జరిగింది. ఆయన సాహిత్యం భారతదేశ భాషలలో బాటు చెక్‌, పోలిష్‌, రష్యన్‌, జర్మన్‌, స్లోవక్‌, ఇంగ్లీష్‌ వంటి 14 భాషల్లోకి అనువాదమయ్యాయి. లాల్‌ బావుటా వీధి నాటక సం స్థల ద్వారా అన్నా బావూ రచయితగా, అభినయకర్తగా, దర్శకుడ ిగా ఎంతో అను భవం గడించాడు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో, కార్మిక వర్గ పోరాటాల్లో, వివిధ సామాజిక న్యాయ ఉద్యమాల్లో క్రియాశీల కర్తగా పాల్గొంటూ ఒక అగ్రశ్రేణి సాహిత్యవేత్తగా, కళాకారుడిగా రూపొందిన అన్నాబావూ సాఠే భారతదేశ సాహిత్యానికి మార్గదర్శి. తెలుగులో అన్నా సాహిత్యం లేని లోటు తీరలేనిది. దానిని త్వరలోనే తెలుగు- మరాఠి సాహిత్యకారులు పూడ్చగలరని ఆశిద్దాం.

- మచ్చ ప్రభాకర్‌

No comments: