"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

27 సెప్టెంబర్, 2010

ఆ ఆవేదనను ఆ మాటల్లోనే వినండి.

26 - 09 -2010
ఆంథ్రజ్యోతి ఏబిన్‌ న్యూస్ చానల్‌లో రాత్రి గం.8.30 నిమిషాలకు రాథాకృష్ణగారు చేసిన ఒక గొప్ప ఇంటర్వ్యూని ప్రసారం చేశారు.
పుట్టినప్పుడు అతడ్ని లక్ష్మణ్‌ అన్నారు. మగపిల్లాడిలా జీవించమన్నారు.
కానీ, అతనికి ఆడపిల్లలా ఉండాలనిపించేది.
దొంగచాటుగా ఆడపిల్ల వేషం వేసుకునేవాడు.
అందుకు తండ్రితో, కుటుంబసభ్యులతో తిట్లుతిన్నాడు... దెబ్బలు తిన్నాడు.
తనలాంటి వాళ్ళని చూసి మాట్లాడాలని తపించిపోయేవాడు.
మాట్లాడిన తర్వాత మనసుకెంతో హాయి అనిపించింది.
తన మనసు విప్పి చెప్పుకోగలిగే అవకాశం దొరికిందని ఆనందించాడు.
తాను మగా కాదు, ఆడా కాదని గుర్తించాడు.
తనలాంటి వాళ్ళెంతోమంది ఉన్నారని తెలుసుకున్నాడు.
వాళ్ళతో కలిసిజీవించడానికి తన కుటుంబాన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు!
మళ్ళీ వచ్చాడు.
మళ్ళీ వెళ్ళిపోయాడు.
కొన్నాళ్ళకు లక్ష్మణ్‌ ...లైలాగా మారిపోంది.
లైలా మనసు విప్పి చెప్పేవరకూ వారిజీవితం ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు. కానీ నిజమైన మానవీయకోణాన్ని రాధాకృష్ణగారు ఆవిష్కరించే అవకాశం లైలాకి కల్పించారు. లైలా చెప్పిన మాటలు వినండి. అరమరికలు లేకుండా వ్యక్తీకరించిన ఆమె వేదనను ఆమె మాటల్లోనే వినండి.
అప్పుడు...
ఈ ప్రోగ్రామ్‌ ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి నిర్వాహకులకు అభినందనలే కాదు... రేపేదైనా అవార్డులిస్తే దీనికే ఇవ్వాలని ఆశిస్తారనుకుంటున్నా....
నిజమైన మానవీయ విలుల కోసం ప్రయత్నిచే వారి వేదనని ఆంథ్రజ్యోతి ఏబిన్‌ న్యూస్ చానల్ లో ప్రసారం చేసినందుకు అభినందనలతో...
... -డా. దార్ల వెంకటేశ్వర రావు

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

yes i agree with u Sir

డేవిడ్ చెప్పారు...

i agree with u Sir