( ఆంధ్ర జ్యోతి http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/aug/28edit4 సౌజన్యం)
రాజ్యాంగ సభలో రిజర్వేషన్ల విషయమై కేవలం షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతుల కోసమే ఏకగ్రీవ ఆమోదం లభించింది. రాజ్యాంగంలోని 341 అధికరణ లో దాన్ని చేర్చారు. ఈ అధికరణనే సవరించి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఈ రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చారు. ఈ నిబంధనలు అమలు పరచేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులు హిందూ షెడ్యూల్డు కులాలు, సిక్కుల్లో నాలుగు షెడ్యూల్డు కులాలు ఉండాలని నిర్వచించడం గమనార్హం.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మన శాసనసభ తీర్మానించింది. తద్వారా దేశ విచ్ఛిన్నానికి మరొక మొక్కను నాటింది. మజ్లిస్ సభ్యులు దళిత ముస్లింలను కూడా చేర్చాలని దానికి నీరు పోయడం ప్రారంభించారు. శాసనసభ బయట ప్రారంభించిన 'ఆకర్ష' పథకాన్ని ఏకంగా సభలోనే ప్రవేశపెట్టి తీర్మానించారు. ఈ వివాదం ఇదివరకు సుప్రీంకోర్టు విచారణలో ఉంది.
రాజ్యాంగ సభలో, పార్లమెంటులో దీనికి సంబంధించిన చర్చలను పరిశీలించినట్టయితే ఈ తీర్మానం వికర్షింప బడుతుందని చెప్పవచ్చు. కాని ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జరుగుతున్న కుహనా లౌకికవాద ప్రయోగాల వరసలో ఇదొకటిగా చేరింది. మత విద్వేషాలతో పాటు, ఇదివరకే నష్టపోతున్న దళితులలో అభద్రతా భావాన్ని ఈ ప్రభుత్వం తీర్మానం ద్వారా పెంచింది.
భారత స్వాతంత్య్రోద్యమ సమయంలోనే- మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే, చట్ట సభల్లో సీట్లను రిజ ర్వు చేయాలనే బ్రిటీష్ ప్రభుత్వ 'కమ్యూనల్ అవార్డు' (1935) ప్రతిపాదనలను మహాత్మా గాంధీ వ్యతిరేకించా రు. రాజ్యాంగాన్ని రచించే సమయంలో కూడా మళ్ళీ ఈ అంశం చర్చకు వచ్చింది. అయితే మతపరమైన రిజర్వేషన్లను వద్దని అందరూ తిరస్కరించారు.
ఇది కేవ లం మూర్ఖత్వమే కాక విపత్తుకు దారితీస్తుందని పండిట్ నెహ్రూ లాంటి వ్యక్తి కూడా హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం 2004లో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించింది. 2005లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకువేసి ముస్లింల స్థితిగతుల అధ్యయనం కోసం జస్టిస్ రాజీందర్ సచార్ నేతృత్వంలో కమిటీ వేసింది.
ఇలాంటి ధోరణి కొనసాగితే హిందూ సమాజంలో మరిన్ని వర్గాలు మైనారిటీ హోదా కావాలని డిమాండ్ చేస్తాయి. మెజారిటీ మతంలో కొనసాగితే తమ పట్ల వివక్ష ఉంటుందని, ప్రయోజనాలు కోల్పోతామని, మెజారిటీగా ఉండడమే పొరపాటయింద ని విశాల హిందూ సమాజంలోని పలు వర్గాలు భావించే అసా«ధారణ సంకేతాలు వస్తాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనకపోతే దేశ ఐక్యత, సమగ్రత దెబ్బ తింటుంది.
బహుశా అందుకే 1947 ఆగస్టులో రాజ్యాంగ సభలో మతపరమైన రిజర్వేషన్లను తిరస్కరించారు. 1947 ఫిబ్ర వరి 27న రాజ్యాంగసభలో సలహా కమిటీ నివేదికను సర్దార్ పటేల్ ప్రవేశపెట్టారు. ముస్లింల ప్రయోజనాల రీత్యా మాత్రమేకాక మొత్తం దేశ ప్రయోజనాల రీత్యా కూడా మతపరమైన మైనారిటీలకు చట్ట రిజర్వేషన్‌ను రద్దు చేయాలని కమిటీ తీర్మానించింది. 'బ్రిటీష్ వారు మైనారిటీల పైన మమకారం ఉందని తరచు చెప్పుకుంటారని, కాని అది బూటకమని మనం రుజువు చేయాలని ఆయ న సూచించారు.
మనకన్నా మైనారిటీల పరిరక్షణపైన ఎవరికీ ఆసక్తి లేదని, మొత్తం జాతీయ ప్రయోజనాల రీత్యా వారిని అన్ని రంగాలలో సంతృప్తిపరచ డం, వారి ప్రయోజనాలు పరిరక్షించడం కర్తవ్యమని ఆయన భావించారు. దీర్ఘకాలంలో ఈ దేశంలో మెజారి టీ, మైనారిటీ అంటూ ఎవరూలేరని భారత్‌లో ఒకే జాతి నివసిస్తున్నదని అనుకునేలా చేయడం మనందరి లక్ష్యం అని ఉద్ఘాటించారు.
రాజ్యాంగ సభలో రిజర్వేషన్ల విషయమై కేవలం షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతుల కోసమే ఏకగ్రీవ ఆమోదం లభించింది. రాజ్యాంగంలోని 341 అధికరణ లో దాన్ని చేర్చారు. ఈ అధికరణనే సవరించి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా దీన్ని అమల్లోకి తెచ్చారు. ఈ నిబంధన లు అమలు పరచేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారు లు హిందూ షెడ్యూల్డు కులాలు, సిక్కుల్లో నాలుగు షెడ్యూల్డు కులాలు ఉండాలని నిర్వచించడం గమనించా లి. నెహ్రూ ప్రభుత్వం విద్య, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించేటప్పుడు ముస్లింలు, క్రైస్తవులను దాని పరిధి నుంచి తప్పించింది.
ఒక వేళ ఈ మైనారిటీ వర్గాలు రిజర్వేషన్ పరిధిలో ఉండాలనుకుంటే ఆనాడే చేర్చేవారు. చాలా కాలంగా దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు అని చెప్పుకునే వారికి కూడా రిజర్వేషన్లు విస్తరించాలన్న డిమాండ్లు ఉన్నాయి. కాని వీటిని పట్టించుకోకపోవడానికి కారణం హిందూ సమాజంలో కులం అనేది ఒక లక్షణమ ని భారత రాజ్యాంగ నిర్మాతలు గమనించారు. ఒక తక్కు వ జాతి హిందువు ఇస్లాంకో, క్రైస్తవ మతానికో మారితే వారికి అందరితో పాటు సమాన హోదా లభిస్తుంది.
కులరహిత సమాజం అనే హామీ లభిస్తుంది. నెహ్రూ హయాంలో- ఒక వ్యక్తి తన హిందూమతాన్ని వదిలి మరో మతానికి మారి, ఆ తరువాత మళ్ళీ హిందువు అయితే, అతడికి మొదట ఉన్న షెడ్యూల్డు కులం హోదా లభిస్తుందా అనే అంశంపై చర్చ సాగింది. తిరిగి మతం మారడం వల్ల మొదలు లభించిన హక్కులు, సహాయం పొందే అర్హత లభిస్తుందని భారత ప్రభుత్వం నిర్దారణకొచ్చింది.
ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక ముఖ్యమైన సర్కుల ర్ (భారత ప్రభుత్వం /నెం 18/4/ 54- ఎస్.టి.4, తేదీ 23 జూలై 1959) ద్వారా తెలిపింది. ఈ సర్కులర్ ద్వారా కులం అనేది హిందూ సమాజానికి మాత్రమే చెందినదిగా నెహ్రూ ప్రభుత్వం భావించింది. దళిత ముస్లింలు దళిత క్రిస్టియన్స్ షెడ్యూ ల్డు కులాలకు చెందినవారు కాదు కాబట్టి నెహ్రూ నుంచి పి.వి. వరకు ఏ ప్రభుత్వమూ వారికి రిజర్వేషన్స్ అవకాశాన్ని అందించలేదు.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. షెడ్యూల్డు జాతులకు మాత్రం మతపరమైన సంబంధా లు, రిజర్వేషన్ ప్రయోజనాలు పొందేందుకు అడ్డంకి లేదు. ఎందుకంటే వీరి నిర్ధారణ మత ప్రాతిపదికన కాదు కాబట్టి. కులం అనేది హిందూ సమాజానికి చెందిన ప్రత్యే క వర్గంగా రాజ్యాంగ నిర్మాతలు భావించారని స్పష్టమవుతున్నది. శాసనసభ తీర్మానం విప్లవాత్మక నిర్ణయం అని బయట కాంగ్రెస్ వారు అన్నారంటే దాని మతలబు అందరికీ తెలిసిందే!
-సిహెచ్. విద్యాసాగర్ రావు
(వ్యాసకర్త, కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నాయకులు)
1 కామెంట్:
ప్రస్తుత ప్రభుత్వ ప్రతిపాదన రాజకీయ లబ్ధికోసమే అనేది తేటతెల్లమే అయినా, ఈ విషయంపై చర్చ మాత్రం అత్యంత ఆవశ్యకం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి