(అర్థం తెలియదు! ఉద్వేగం ఆగదు!! పేరుతో నేను రాసిన పోష్టుకి స్పందించి డా// ఆచార్య పణీంద్ర గారు భూపెన్ హజారికా పాటకి తెలుగు అనువాదాన్ని పంపారు. వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ పాట గురించి ఇలా రాయడం వెనుక ఒక నేపథ్యం ఉంది. ఆ మధ్య మా యూనివర్సిటీలో తులనాత్మక సాహిత్యం పై సుమారు 22 రోజుల పాటు పునశ్చరణ తరగతులు జరిగాయి. నేనూ దానిలో పాల్గొన్నాను. దేశవ్యాప్తంగా ఉన్న అనేక భాషల వాళ్ళు అందులో పాల్గొన్నారు. ముగింపు రోజున సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఒక అస్సామీ ప్రొఫెసర్ ఈ పాట పాడారు. అప్పుడు నాకు దాని అర్థం తెలియదు. కానీ, హృదయం ఊగిపోయింది. వెంటనే వెళ్ళి ఆయన్ని కౌగిలించుకున్నాను. దాని అర్థం చెప్పమని అడిగాను. ఆయన చెప్పారు. ఆ తర్వాత యూట్యూబ్ ల దీన్ని విన్నాను. అయినా, నాకు అర్థంతో నిమిత్తం లేకుండానే ఏదో గొప్ప ఉద్వేగం, గొప్ప అనుభూతి, ఆ పాట వింటుంటే నాకు తెలియకుండానే ఆనందాశ్రువులు రాలిపోతుంటాయి. అలాంటిదే నూరిలో పాట కూడా! తెలుగులో కూడా ఇలాంటి పాటలెన్నో ఉన్నాయనుకోండి. అందుకే సంగీతానికి అంత శక్తి ఉందనిపిస్తుంది.
తులనాత్మక సాహిత్యంలో జరిగిన పునశ్చరణ తరగతులు నాకు చాలా కొత్త విషయాలను తెలిసికోవడానికి, అనేక భాషల వాళ్ళను కలుసుకోవడానికీ అవకాశం కలిగించింది. బెంగాల్ నుండి వచ్చిన ఒకరిద్దరు అధ్యాపకులు మన రాష్ట్రాన్ని చూసి ఆశ్చర్య పోయారు. ముఖ్యంగా శాంతినికేతన్ గురించి అడిగాను. కానీ, దాని గురించి చెప్పడానికి చాలా నిరాశ అనిపించినట్లు వారి అభిప్రాయాలను బట్టి నాకు అనిపించింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో బిజినెస్ ప్రారంభమైందని, నిజమైన శాంతినికేతన్ ఎప్పుడో పోయిందని అక్కడే చదివిన ఒక అధ్యాపకురాలు చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ చూసి చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నానని అన్నారు. ఇలా చాలా అంశాలు చెబుతుంటే ఔనా? అనిపించింది. మా యూనివర్సిటీ పట్ల నాకు మరీ అభిమానం పెరిగింది. అస్సాం నుండి వచ్చిన అధ్యాపకురాలు చక్కటి నృత్యాన్ని చేశారు. దాన్ని యూట్యూబ్ లో పెట్టాను.ఇలా చాలా సరదాగా గడిచిపోయింది. బహుశా వీటన్నింటి అనుబంధం కూడా భూపెన్ హజారికా పాట మళ్ళీ మళ్ళీ వినిపించేటట్లు చేయిస్తుందా? అదేమీ కాదు... ఆ పాటలోనే , ఆ రాగంలోనే ఆ సౌందర్యం ఉందా? ఏమో... ఒక చక్కని అనుభూతిని నెమరువేసుకోవడానికి! కాసేపు ఒక మధురమైన ప్రపంచంలోకి వెళ్ళిపోవడానికి.. ఈ పాట వినాలనిపిస్తుంటుంది.
భూపెన్ జారికా పాట పాడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ గొగై ( తెల్ల షర్ట్ గల వ్యక్తి)
పునశ్చరణ తరగతుల్లో పాల్గొని Prof. Mohan G.Ramanan, డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, Prof. Tutin Mukharjee, Head, Centre for comparativi Literature నుండి సర్టిఫికెట్ స్వీకరిస్తున్న డా//దార్ల వెంకటేశ్వరరావు.
పునశ్చరణ తరగతుల ముగింపు సమావేశంలో పాల్గొన్న అకాడమిక్ స్టాఫ్ కాలేజీ డైరెక్టర్ Prof. Narasimhulu మరియు ఇతర అధ్యాపకులు.
పునశ్చరణ తరగతుల గదిలో వరసగా డా//దార్ల వెంకటేశ్వరరావు, డా//పిల్లలమర్రి రాములు, డా// రాజ్యరమ
( హాయిగా వెనుక సీట్లలో కూర్చొని చర్చలు...)
పునశ్చరణ తరగతుల లో పాల్గొన్న అధ్యాపకులతో క్యాంపస్ లో మిర్చీ బజ్జీ తింటూ ....
పునశ్చరణ తరగతుల గదిలో ....
పునశ్చరణ తరగతులలో ప్రసంగించడానికి వచ్చిన ప్రసిద్ద చరిత్రకారిణి Susie J.Tharu (ఆమెకి ఇరువైపులామేము ఉన్నాం. కుడి వైపు నుండి మూడవ వ్యక్తి), మరియూ అధ్యాపకులతో దార్ల
పునశ్చరణ తరగతులలో పాల్గన్న అస్సామీ, త్రిపుర రాష్ట్రాల నుండి వచ్చిన అధ్యాపకులతో దార్ల
డా// ఆచార్య పణీంద్ర గారు ప్రేమతో పంపించిన ఆ పాట తెలుగు అనువాదాన్ని ఇక్కడ దాచుకుంటున్నాను.
హృదయం ’ఊ..ఊ..’అననీ -తులనాత్మక సాహిత్యంలో జరిగిన పునశ్చరణ తరగతులు నాకు చాలా కొత్త విషయాలను తెలిసికోవడానికి, అనేక భాషల వాళ్ళను కలుసుకోవడానికీ అవకాశం కలిగించింది. బెంగాల్ నుండి వచ్చిన ఒకరిద్దరు అధ్యాపకులు మన రాష్ట్రాన్ని చూసి ఆశ్చర్య పోయారు. ముఖ్యంగా శాంతినికేతన్ గురించి అడిగాను. కానీ, దాని గురించి చెప్పడానికి చాలా నిరాశ అనిపించినట్లు వారి అభిప్రాయాలను బట్టి నాకు అనిపించింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో బిజినెస్ ప్రారంభమైందని, నిజమైన శాంతినికేతన్ ఎప్పుడో పోయిందని అక్కడే చదివిన ఒక అధ్యాపకురాలు చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ చూసి చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నానని అన్నారు. ఇలా చాలా అంశాలు చెబుతుంటే ఔనా? అనిపించింది. మా యూనివర్సిటీ పట్ల నాకు మరీ అభిమానం పెరిగింది. అస్సాం నుండి వచ్చిన అధ్యాపకురాలు చక్కటి నృత్యాన్ని చేశారు. దాన్ని యూట్యూబ్ లో పెట్టాను.ఇలా చాలా సరదాగా గడిచిపోయింది. బహుశా వీటన్నింటి అనుబంధం కూడా భూపెన్ హజారికా పాట మళ్ళీ మళ్ళీ వినిపించేటట్లు చేయిస్తుందా? అదేమీ కాదు... ఆ పాటలోనే , ఆ రాగంలోనే ఆ సౌందర్యం ఉందా? ఏమో... ఒక చక్కని అనుభూతిని నెమరువేసుకోవడానికి! కాసేపు ఒక మధురమైన ప్రపంచంలోకి వెళ్ళిపోవడానికి.. ఈ పాట వినాలనిపిస్తుంటుంది.
భూపెన్ జారికా పాట పాడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ గొగై ( తెల్ల షర్ట్ గల వ్యక్తి)
పునశ్చరణ తరగతుల్లో పాల్గొని Prof. Mohan G.Ramanan, డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, Prof. Tutin Mukharjee, Head, Centre for comparativi Literature నుండి సర్టిఫికెట్ స్వీకరిస్తున్న డా//దార్ల వెంకటేశ్వరరావు.
పునశ్చరణ తరగతుల ముగింపు సమావేశంలో పాల్గొన్న అకాడమిక్ స్టాఫ్ కాలేజీ డైరెక్టర్ Prof. Narasimhulu మరియు ఇతర అధ్యాపకులు.
పునశ్చరణ తరగతుల గదిలో వరసగా డా//దార్ల వెంకటేశ్వరరావు, డా//పిల్లలమర్రి రాములు, డా// రాజ్యరమ
( హాయిగా వెనుక సీట్లలో కూర్చొని చర్చలు...)
పునశ్చరణ తరగతుల లో పాల్గొన్న అధ్యాపకులతో క్యాంపస్ లో మిర్చీ బజ్జీ తింటూ ....
పునశ్చరణ తరగతుల గదిలో ....
పునశ్చరణ తరగతులలో ప్రసంగించడానికి వచ్చిన ప్రసిద్ద చరిత్రకారిణి Susie J.Tharu (ఆమెకి ఇరువైపులామేము ఉన్నాం. కుడి వైపు నుండి మూడవ వ్యక్తి), మరియూ అధ్యాపకులతో దార్ల
పునశ్చరణ తరగతులలో పాల్గన్న అస్సామీ, త్రిపుర రాష్ట్రాల నుండి వచ్చిన అధ్యాపకులతో దార్ల
డా// ఆచార్య పణీంద్ర గారు ప్రేమతో పంపించిన ఆ పాట తెలుగు అనువాదాన్ని ఇక్కడ దాచుకుంటున్నాను.
భయపడనీ -
మేఘం ఢమ ఢమలాడనీ -
గర్జించనీ -
ఒక నీటి బిందువెపుడయినా
నా కన్నుల నుండి వర్షించనీ !
నీ సాహచర్య ముద్ర ఏదైతే నాకు లభించిందో
అది ఎప్పుడు ఎండిపోతుంది?
నీ స్పర్శ తగిలి
నా ఎండిన పత్రం ఎప్పుడు పచ్చనౌతుంది?
ఏ శరీరాన్ని నీవు తాకావో
ఆ శరీరాన్ని దాచేను -
ఏ మనసుకు నీ చూపు తగిలిందో
దానిని ఎవరికి చూపను?
ఓ నా చంద్రమా!
నీ వెన్నెల దేహాన్ని కాలుస్తోంది -
ఎగిరే ఓ పక్షీ!
నా రెక్కలను కత్తిరించుకొన్నాను -
(dil hoom hoom kare-- Bhupen Hajarika పాటకు డా// ఆచార్య పణీంద్ర తెలుగు అనువాదం)
5 కామెంట్లు:
బ్లాగోత్తమా!
మీ బ్లాగ్ దర్శించాను, బావుంది, ప్రయాణిస్తూనే ఉండండి.
మీ
ఈగ హనుమాన్ (nanolu.blogspot.com)
దార్ల గారు! మీ అభిమానానికి ధన్యవాదాలు.
- డా.ఆచార్య ఫణీంద్ర
ఆచార్య ఫణీంద్ర గారి అనువాదం కృతకంగా ఉంది.అనుసృజన సహజంగాలేదు.
నేను అనుసృజన చేసానని ఎవరన్నారు? అర్థాన్ని అనువదించి అందించాను. అంతే!
- డా. ఆచార్య ఫణీంద్ర
తెలుగు అభిమాని గారూ!
ఆచార్య పణీంద్ర గారు దానిలోని భావాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ పాటలోని సౌదర్యాన్ని అవగాహన చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. మీరు కూడా ప్రయత్నించండి. ఆయన కామెంట్ గా ఆ అనువాదాన్ని రాశారు. దాన్ని నేను బ్లాగు గా post గా పెట్టాను. అంతే తప్ప ఆయన అనువాదం కోసం చేసిన అనువాదం కాదని గమనించాలి. అటువంటి వారిని నాలుగు ప్రోత్సాహక వాక్యాలతో అభినందించడం అంటే తెలుగు పట్ల కృషిచేసేవారిని ప్రోత్సాహించడమే అవుతుందనుకుంటున్నాను.
మీ
దార్ల
కామెంట్‌ను పోస్ట్ చేయండి