"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

20 మార్చి, 2009

దళిత సాహిత్యం --మౌలిక భావనలు: నవల,కథ,నాటకం

--డా//దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం,
గచ్చిబౌలి, హైదరాబాదు-46, 09989628049, vrdarla@gmail.com


1.5.4 దళిత నవల:

అస్పృశ్యతను వివిధ కోణాల్లో చిత్రిస్తూ నవలలు రాసిన వాళ్ళున్నారు. ‘‘హేలావతి’‘ (1913), వెంకటపార్వతీశ్వరకవుల ‘‘"మాతృమందిరం' ‘‘(1919), ఉన్నవ లక్ష్మీనారాయణ గారి ‘‘"మాలపల్లి'‘‘ (1922), ఆచార్య రంగనాయకులుగారిమ ‘‘"హరిజన నాయకుడు'‘‘ (1933), వట్టికోట ఆళ్వార్స్వామిగారి ‘‘"ప్రజల మనిషి'‘‘ (1955) ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి ‘‘"బలిపీఠం'‘‘ (1962), డా. కేశవరెడ్డి రాసిన ‘‘"బానిసలు'‘‘ (2971), ‘‘"శ్మశానం దున్నేరు'‘‘ (1979),’‘ "ఇన్క్రెడిబుల గాడెస్'‘‘ (1979),’‘ "అతడు అడవిని జయించాడు'‘‘ పేర్కొనదగినవి.’‘"మాలపల్లి'‘‘ నవల మార్క్సిస్టు భావజాలంతో జాతీయోద్యమ ప్రభావంతో వచ్చినా, దళితుల జీవితాన్ని స్పర్శించిన నవలగా ప్రసిద్ధి పొందింది. దళితులలోని దాసరుల కుటుంబం చుట్టూనే ‘‘"మాలపల్లి'‘‘ నవలలోని సంఘటఅనలన్నీ చిత్రితమయ్యాయి. తక్కెళ్ళ జగ్గడు ఉరఫ్వెంకటదాసు కులం వల్ల వివక్షకు గురవుతుటాడు. అయినా, ఆర్థిక స్థితిగతులలో మార్పుల రాకపోతే దళితుల అస్తవ్యస్తమవుతుందనేటట్లు పాత్రను తీర్చిదిద్దారు రచయిత.

1980 తర్వాత దళిత సాహిత్యంలో నవలా ప్రక్రియ వేగవంతంగానే వచ్చింది. అక్కినేని కుటుంబరావు ‘‘"సొరాజ్జెం'‘‘ (1981) స్వాతంత్ర్యానంతర గ్రామీణ దళితుల జీవితాలను నవలలో చిత్రించారు. ‘‘"ఖాకీ బతుకులు'‘‘ (1980-82) నవలలో

పోలీసుశాఖలో దళితుల ఆత్మగౌరవ పోరాటాన్ని స్పార్టకస్‌ (జి. మోహనరావు) వివరించారు. చిలుకూరు దేవపుత్ర రాసిన ‘‘"అద్దంలో చందమామ' ‘‘(1988), ‘‘"పంచమం'‘‘ (1998) నవలలో సుమారు 1975 నుండి 99 వరకు రాష్ట్రంలో జరిగిన దళిత ఉద్యమాల చారిత్రక నేపథ్యాన్ని చిత్రించే ప్రయత్నం చేశారు. ‘‘"అకాశంలో సగం'‘‘ (1990) నవలలో ఓల్గా అగ్రవర్ణ భూస్వామ్య వ్యవస్థ కింద నలిగిపోతున్న దళితుల జీవితాలను, ముఖ్యంగా స్త్రీ దృక్పథాన్ని వర్ణించారు. సదానంద శారద 1992లో రాసిన ‘‘"మంచినీళ్ళ బావి’‘' తెలంగాణ ప్రాంతం దళిత జీవితాలను వర్ణించింది. 1996లో బండి నారాయణస్వామి ‘‘"గద్దలాడతాండాయి'‘‘ నవలలో రాయలసీమ దళితుల జీవితాన్ని చిత్రించారు. ‘‘"నీ బాంచెన్కాల్మొక్త' ‘‘(1997) నవలలో కాలువ మల్లయ్యగారు సుమారు యాబై ఏళ్ళలో తెలంగాణలో వచ్చిన సామాజిక పరిణామాలను ప్రాంతీయ మాండలికంలో వివరించే ప్రయత్నం చేశారని విమర్శకులు వ్యాఖ్యానించారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘‘"కాడి'‘‘ (1998) నవలలో మాల, మాదిగల మధ్య కలిగే అంతరాలను ఆసరా చేసుకొని అగ్రవర్ణాల వారు దళితులపై చేసే పెత్తనాన్ని వర్ణించారు. ఇంచుమించు ఇదే ఇతివృత్తంతో పి.నాసరయ్య’‘ "మాదిగపల్లె'‘‘ (1998) నవల రాశారు. జి.కళ్యాణరావు గారు ‘‘"అంటరాని వసంతం'‘‘ (2000)లో సుమారు వంద సంవత్సరాల దళితుల పోరాటాల పరిణామాలను ఆకర్షణీయమైన శైలిలో రాశారు. వేములఎల్లయ్య ‘‘"కక్క"‘‘ (2000) ‘‘"సిద్ధి'‘‘ (2006) నవలలో తెలంగాణ ప్రాంత దళితుల సాంస్కృతిక జీవనాన్ని ప్రాంతీయ మాండలికంలో రాశారు. బోయ జంగయ్య జాతర (1997) కూడా తెలంగాణ దళితుల జీవితాన్ని వర్ణించిందే. ఇంకా చాలా నవలల్లో దళిత, దళితేతర రచయితలు ఆయా పాత్రలను వర్ణించిన వారున్నారు.

1.5.5 దళిత కథ:

దళిత జీవితాలను చిత్రిస్తూ సంస్కరణ, అభ్యుదయ, విప్లవ సాహిత్యంలో భాగంగానే దళిత కథలు కూడా ప్రారంభమయ్యాయి. వాటిలో ఆర్థిక కోణాలకున్న ప్రాధాన్యత కులనిర్మూలన దిశ కనపడదు. దళితేతరులు రాసిన కథల్లోనూ నిమ్న కులాలనే స్పృహ తప్ప, కులాల జీవిత సంవేదనలకు దర్పణం పట్టే విధంగా వర్ణించినవి చాలా తక్కువగానే వచ్చాయి.

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 1925లో రాసిన ‘‘"పుల్లంరాజు కథ'‘‘లో తొలిసారిగా దళితుల ప్రస్తావన కనిపిస్తుంది.

దళిత జీవితాన్ని, సంవేదనలను, పోరాట చైతన్యాన్ని వర్ణించిన తొలి దళిత కథగా కొలకలూరి ఇనాక్రాసిన’‘ "ఊరబావి'‘‘ (1968-69) కథను పరిశోధకులు గుర్తిస్తున్నారు. కథలో వ్యవస్థ కోసం వ్యక్తి చేసిన త్యాగం, దళితుల్లోని వివిధ తరాల్లో వచ్చిన చైతన్యాన్ని వర్ణించారు. కథలో మాల మాదిగలందరికీ నీటి సమస్యను తీర్చడానికి ఒక దళిత స్త్రీ చూపిన సాహసంలో ధైర్యం ఉంది. అగ్రవర్ణ కుట్రను ఎదుర్కొనే ఆలోచన ఉంది.

డా. భార్గవీరావు సంకలనం చేసిన ‘‘"ఇంకానా ఇకపై సాగవు'‘‘, కె. లక్ష్మీనారాయణ, ఆర్‌. చంద్రశేఖర్రెడ్డి సంపాదకత్వం, సంకలనంలో వచ్చిన ‘‘"దళిత కథలు'‘‘, గోగు శ్యామల, జూపాక సుభద్ర సంపాదకత్వంలో వచ్చిన ‘‘"రేగడి సాల్లు'‘‘ (2006), రచయితలే విడివిడిగా ప్రచురించుకున్న కథా సంపుటాలలో సుమారు వెయ్యికి పైగా దళిత కథలు కనిపిస్తున్నాయి. కొలకలూరి ఇనాక్, బొయ జంగయ్య, కాలువ మల్లయ్య, శాంతి నారాయణ, ఎండ్లూరి సుధాకర్, నాగప్పగారి సుందర్రాజు, గోగు శ్యామల, జూపాక సుభద్ర, చల్లపల్లి స్వరూప రాణి, జాజుల గౌరి మొదలైన వాళ్ళు రాసిన దళిత కథల్లో నిజమైన దళిత జీవితం కనిపిస్తుంది. దళితేతరులు రాసిన కథల్లో కరుణకుమార్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, గోపీచంద్వంటి వారు కూడా దళిత జీవితాల్లోని అనేక కోణాలను చిత్రించగలిగారు. చలం కొన్ని కథలు రాసినా దళిత జీవితం పట్ల సరైన అవగాహన లేదనిపిస్తుంది. క్రైస్తవం దళితుల్లో తెచ్చిన సాంఘిక, ఆర్థిక అభ్యున్నతితో పాటు, నీరుగార్చే చైతన్యాన్ని కూడా ధారాగోపి, చిలుకూరి దేవపుత్ర వంటి కథకులు వర్ణించగలిగారు.

దళితుల్లోని అంత:సంఘర్షణను, ముఖ్యంగా మాల - మాదిగల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సామాజిక వ్యత్యాసాలను స్వామి, మద్దూరి నగేష్బాబు, పైడితెరీష్బాబు, ఎండ్లూరి సుధాకర్, ఒమ్మి రమేష్బాబు, గోగు శ్యామల, జూపాక సుభద్ర మొదలైన వాళ్ళు వర్ణిస్తూ కథలు రాశారు.

ననుమాస్వామి, బిఎస్‌. రాములు, కాలువ మల్లయ్య, కాసుల ప్రతాపరెడ్డి మొదలైన వారు కథల్లో మార్క్సిస్టు, తెలంగాణ సమస్యలను దళిత జీవిత కోణాల నుండి వర్ణించారు.

మొత్తం మీద దళిత కథ 1934-68 వరకు సంస్కరణోద్యమ దశగా చెప్పుకోవచ్చు. దశలో సానుభూతి ధోరణి కనిపిస్తుంది. 1968-80 వరకు కులనిర్మూలన దశ. దశలో మాల, మాదిగలలో ఉండవలసిన సమష్టి పోరాట చైతన్యాన్ని చిత్రిస్తూనే, నీటి సమస్య, వృత్తి చేత పొందే న్యూనత, ఆర్థిక వెనుకబాటుతనం, దళితులు చదువుకోవలసిన అవసరం, క్రైస్తవ,

ముస్లిం మతాంతరీకరణ, కులనిర్మూలన చైతన్యంతో కథలు వచ్చాయి. 1980-95 వరకు దళిత పోరాట చైతన్య దశ. దశలో దళితులలో వచ్చిన చైతన్యం చిత్రించబడింది. కారంచేడు, పదిరి కుప్పం, చుండూరు తదితర ప్రాంతాలలో దళితులపై జరిగిన దాడుల నేపథ్యంలో అంబేడ్కర్భావజాలం, ఆత్మగౌరవ పోరాటం మొదలైనవి ప్రతిఫలించాయి. 1995 నుండి నేటివరకు వరకు దళిత బహుజన సమైక్య దశ. దశలో ఉత్తర భారత దేశంలోని రాజకీయ పరిణామాల నేపథ్యంతో బహుజన్సమాజ్పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లే ఆంధ్రప్రదేశ్లోనూ ఏర్పాటు చేయాలనే ఆకాంక్షతో కొన్ని కథలు వస్తున్నాయి. బి.సి. కులాల నుండి వచ్చిన కథకులు దిశగా మంచి కథలు రాశారు. మాల, మాదిగల మధ్య వర్గీకరణ నేపథ్యంలో జరుగుతున్న సంఘర్షణలకు రాజ్యాధికారమే పరిష్కారం చూపుతుందనే ఆలోచనలు కూడా కొన్ని కథల్లో కనిపిస్తునాయి.

మొత్తం మీద వస్తు విస్తృతితో పాటు శిల్ప పరమైన మార్పులు కూడా దళిత కథ అందించగలిగింది. అయినా, సాంస్కృతిక, ఆర్థిక అంశాలను వర్ణిస్తూనే దళిత తాత్విక భూమికను విస్మరించకుండా అంబేడ్కర్భావజాలతో మరిన్ని కథలు రావలసి ఉంది.

1.5.6 దళిత నాటకం:

పందొమ్మిది వందల ముప్ఫై ప్రాంతం నుండి దళితులను ప్రస్తావిస్తూ కొన్ని నాటికలు, నాటకాలు వచ్చాయి. వాటిని దళితులపై సానుభూతిని చూపుతూ వచ్చిన నాటకాలుగానే చెప్పుకోవచ్చు. ధర్మవరం గోపాలాచార్యుల ‘‘"అస్పృశ్యవిజయం'‘‘లో అస్పృశ్యత మహాపాపమని వివరించే నాటకం. మునిమాణిక్యం నరసింహారావు తిరుగుబాటు (1938), దర్భ భాస్కరమ్మ ‘‘"దేవాలయ ప్రవేశం'‘‘ ఓరుగంటి కృష్ణ కౌండిన్య ‘‘"కృష్ణ చరితం'‘‘ (1933),బండారు మృంత్యుంజయ ‘‘"సమాజం మారాలి',’‘ ఆచార్య ఎన్‌.జి. రంగా ‘‘"హరిజననాయకుడు'‘‘ (1933), ఉన్నవ లక్ష్మీనారాయణ ‘‘"హరిజన నాటకం"‘‘ (1933) వంటి నాటకాలలో ఆయా రచయితలకు దళితుల పట్ల ఉన్న సానుభూతి కనిపిస్తుంది.

దళిత జీవితాన్ని పౌరాణిక, చారిత్రక, సాంఘిక ఇతివృత్తాలతో రాసిన నాటకాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. దళితులపై సానుభూతి చూపండంటూనే వారి ప్రతిభను వివరించే ప్రయత్నం చేసిన నాటకాలున్నాయి. పుట్టుక, ‘‘"కలిసిమెలిసి తిరగటం', "ప్రేమ వివాహాలు', "దేవాలయ ప్రవేశం'‘‘, తిరుగుబాటు భావాలతో కొన్ని నాటకాలు వచ్చాయి.

1959లో బోయి భీమన్న రాసిన’‘ "రాగవాశిష్టం'‘‘ నాటకాన్ని తొలి దళిత నాటకంగా భావించే అవకాశం ఉంది. దళితుల పుట్టుక కూడా ఉన్నతమైనదేనని, దళితులు హిందువులలో భాగమని వాదించే నాటకం’‘ "రాగవాశిష్టం'‘‘. రచయితే రాసిన’‘ "ఆదికవి వాల్మీకి'‘‘ (1970),’‘ "పాలేరు'‘‘ నాటకం దళితులను ఆలోచింపజేసినవి. కొలకలూరి ఇనాక్రాసిన’‘ "మునివాహనుడు'‘‘ నాటకం దళితులు దేవాలయ ప్రవేశాన్ని, వారి భక్తిని శక్తివంతంగా వర్ణించింది. ఇంకా సాంఘిక నాటకాలు కూడా చాలా వచ్చాయి.

కామెంట్‌లు లేవు: