ఇంతకు ముందు కంప్యూటర్ ఎరా లో నల్లమోతు శ్రీధర్ గారు కంప్యూటర్ కి సంబంధించిన సాంకేతికాలను సులభంగా వివరించేవారు. అలాగే ఇప్పుడు Boreddy Mahesh Reddy గారు మహీగ్రాఫిక్స్ పేరుతో మరింత సులువుగా బ్లాగ్ టెక్నిక్స్ వివరిస్తున్నారు. ఆయనే ఇప్పుడు సాంకేతిక సలహాదారులను అందరినీ ఒక చోటకు తీసుకొచ్చే పనిలో భాగం అన్నట్లు మహిబ్లాగ్ ఫోరమ్ ఏర్పాటు చేశారు. దానిలో చాలా మంచి సౌకర్యాలున్నాయి. మీరు కూడా ఒక సారి చూడండి. మహేశ్ గారికి అభినందనలతో...దార్ల
మహీగ్రాఫిక్స్ బ్లాగ్ ఫోరమ్ ముఖచిత్రం కూడా చాలా ఆకర్శణీయంగా ఉంది చూడండి!
1 కామెంట్:
డా.ధార్ల గారు,
నమస్కారం,
నేను ఇపుడే అనుకోకుండా బ్రౌజ్ చేస్తూ మీ బ్లాగు ను చూశాను. మీ బ్లాగు చాలా బాగుంది. యాహూలో నా తొలి కథలాంటిది ! చాలా బాగుంది. ముఖ్యంగా మీ రైటింగ్ స్టైల్ నాకు నచ్చింది. ఇక నుంచి మీ బ్లాగు ను చూస్తుంటాను. మీరు మా ఫోరమ్ కు అభినందనలు చెప్పినందుకు వెరీ వెరీ థాంక్స్, గ్రాఫిక్స్ ను బేస్ చేస్కొని పెట్టిన ఫోరమ్ ఇది. చాలా మంది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో దాదాపు 100,000 పెట్టి మల్టీమీడియా ప్యాకింగ్స్ నేర్చుకుంటున్నారు. మరి ఇంట్రెస్ట్ ఉండి అమౌంట్ లేని వాళ్లకు నా ఫోరంలో మల్టీమీడియా ట్యుటోరయల్స్ ఫ్రీ గా తెలుగులో స్టెప్ వైజ్ ట్యుటోరియల్స్ లభిస్తాయి. ఉదా:కు http://mahigrafix.com/mahiforum/showthread.php?tid=23 లో చూడండి. బేసిక్ లెవెల్ వాళ్లకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ట్యటోరియల్స్ పెడుతున్నాము. మీ తరపునుంచి కూడా మా ఫోరమ్ గురించి తెలియచేస్తున్నందుకు చాలా థాంక్స్
కామెంట్‌ను పోస్ట్ చేయండి