"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

10 మార్చి, 2009

అర్థం తెలియదు! ఉద్వేగం ఆగదు!!

కొన్ని పాటలు వింటుంటే వాటి అర్థాలు తెలియకపోయినా ఏదో ఒక గొప్ప అనుభూతి హృదయాన్ని ఉద్వేగానికి గురిచేస్తుంటుంది. అలాంటి పాటల్లో నాకు నచ్చిన ఒక పాట.

4 కామెంట్‌లు:

బుజ్జి చెప్పారు...

I also like this song very much and I doo feel the same thing "అర్థం తెలియదు! ఉద్వేగం ఆగదు!!"

బుజ్జి చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

దార్ల గారు!
ఒక హైదరాబాదీగా నాకు అర్థమైన మేరకు ఈ పాటను అనువదించి అందిస్తున్నాను.
- డా.ఆచార్య ఫణీంద్ర
***
హృదయం ’ఊ..ఊ..’అననీ -
భయపడనీ -
మేఘం ఢమ ఢమలాడనీ -
గర్జించనీ -
ఒక నీటి బిందువెపుడయినా
నా కన్నుల నుండి వర్షించనీ !

నీ సాహచర్య ముద్ర ఏదైతే నాకు లభించిందో
అది ఎప్పుడు ఎండిపోతుంది?
నీ స్పర్శ తగిలి
నా ఎండిన పత్రం ఎప్పుడు పచ్చనౌతుంది?

ఏ శరీరాన్ని నీవు తాకావో
ఆ శరీరాన్ని దాచేను -
ఏ మనసుకు నీ చూపు తగిలిందో
దానిని ఎవరికి చూపను?
ఓ నా చంద్రమా!
నీ వెన్నెల దేహాన్ని కాలుస్తోంది -
ఎగిరే ఓ పక్షీ!
నా రెక్కలను కత్తిరించుకొన్నాను -
--***--

vrdarla చెప్పారు...

డా// ఆచార్య ఫణీంద్ర గారూ!
నమస్కారం... మీరు ప్రేమతో భూపెన్ హజారికా పాటను తెలుగులోకి అనువదించి, సమయాన్ని కేటాయించి ఇక్కడ రాసినందుకు కృతఙ్ఞతలు. నిజానికి ఈ పాటను మొన్నా మధ్య తులనాత్మక సాహిత్యం పై జరిగిన ఒక పునశ్చరణ తరగతుల్లో ఒక అస్సామీ ప్రొఫెసర్ పాడినప్పుడు మొట్టమొదటి సారిగా విన్నాను. అర్థం తెలియక పోయినా నాకేదో ఉద్వేగం తన్నుకొచ్చేసింది. తర్వాత ఆ పాటకోసం యూట్యూబ్ లో వెతికాను. ఈ పాటకి ఎంత క్రేజీ ఉందో అర్థమైంది. అక్కడ ఒక కామెంట్ కూడా రాశాను. నేను ఆశించిన సమాధానాన్ని ఆ పాట యూట్యూబ్ లో పెట్టిన వారు రాశారు.పాట పాడిన ప్రొఫెసర్ ని తర్వాత అడిగాను. ఆయన అర్థం చెప్పాడు.నిజానికి మన యూనివర్సిటీలో ఈ పాటకి అర్థం చెప్పలేని వాళ్ళు లేరనీ, నేను అడగలేదనీ కాదు. కానీ, పాటలోగానీ, పద్యం లో గానీ కొన్ని సార్లు కొంతమంది ప్రసంగాల్లో గానీ అర్థానికి మించిన ఒక గొప్పసౌందర్యం ఉంటుందని, అది మన హృదయాల్ని పట్టి ఊపేస్తుంటుందనీ గుర్తించవలసి ఉంటుంది సుమా! అని చెప్పడమే నా ప్రధాన ధ్యేయం. అందుకనే ఏ సాహిత్య, భాషా ఙ్ఙ్ఞానం లేని వాళ్ళు కూడా పద్యాన్ని ఆస్వాదించ గలుగుతున్నారంటే దానిలో ఉండే ఏదో ఒక మాధుర్యం, సౌందర్యం కేవలం అర్థమైనప్పుడు మాత్రమే అనుభూతిలోకి వస్తుందని అనుకోలేమని సైద్ధాంతీకరించే ప్రయత్నం.
నిజానికి మిమ్మల్ని ఇలా బ్లాగులో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాటను తెలుగులో రాసిన మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ,ధన్యవాదాలు కూడ తెలియజేస్తున్నాను.
మీ
దార్ల