వెబ్ సైట్ లో ఒకరికి బదులు మరొకరి వివరాలు ఉంటున్నాయి. ఇంతమందిని ఒక చోటకి చేర్చేక్రమంలో ఇలాంటి పొరపాట్లు సహజంగానే జరుగుతుంటాయి. కానీ, వీటిని గుర్తించి సవరించుకోవడం అత్యవసరం. కనకదుర్గ గారు డాక్టరేట్ చేసిన వారు. వీరి నిర్ణయాలు భావి పరిశోధకులపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కనుక, ఒక పెద్ద ప్రాజెక్టుగా చేయవలసిన పనిని ఒక్కచేతిమీదుగా చేసినందుకు లేదా చేస్తున్నందుకు అభినందిస్తూనే మొట్టమొదటి, తొట్ట తొలి రచయిత్రి వంటి నిర్ణయాలను చేస్తున్నప్పుడు, వాటికి గల ఆధారాలను కూడా సూచిస్తే బాగుంటుంది. ఫోటోలు పెట్టడం మాత్రమే కాదు, కొంతమందికి సంబంధించిన ఫోటోలు పెట్టేటప్పుడు ఫెమిలియారిటీ ఉన్న ఫోటోలను సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఒకవేళ కావాలనే అరుదైన ఫోటోలు పెడితే ఆ విషయాన్ని పేర్కొంటే మంచిది. అలా ఎందుకు తీసుకోవలసి వచ్చిందో కూడా చెప్తే మంచిది. మొత్తం మీద ఒక ప్రభుత్వ వ్యవస్థ చేయవలసిన పనిని చేపట్టిన ఈ పని విజయవంతం కావాలని ఆశిస్తూ... ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
-డా//దార్ల వెంకటేశ్వరరావు
1 కామెంట్:
URL ఇవ్వడం మరచినట్టున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి