పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటి, ఫిలాసఫీ శాఖలో అసిస్టెంటు ప్రొఫెసర్ డా//పి.కేశవకుమార్ రచించిన దళిత ఉద్యమం-వెలుగు నీడలు గ్రంథాన్ని మార్చి 3 వ తేదీన హైదరాబాదు ప్రెస్ క్లబ్బులో సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరిస్తారు.
తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన జరిగే ఈ పస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రపదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కమీషనర్ ఎ.విద్యాసాగర్ . ఐ.ఎ.ఎస్., పాల్గొంటారు. పుస్తకాన్ని దళిత ఉద్యమ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొజ్జాతారకం ఆవిష్కరిస్తారు. ఈ సభలో ముఖ్య వక్తలుగా ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటి అసోసియేట్ ప్రొఫెసర్ డా//కె. సత్యనారాయణ, ప్రముఖ దళిత కవి, విమర్శకులు కలేకూరి ప్రసాద్, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో తులనాత్మక శాఖ ప్రొఫెసర్ శిఖామణి, హైదరాబాదు విశ్వవిద్యాలయం లో తెలుగు అసిస్టెంటు ప్రొఫెసర్ డా// దార్ల వెంకటేశ్వరరావు, బహుజనకెరటాలు ప్రధాన సంపాదకురాలు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో బుద్దిస్ట్ స్టడీస్ సెంటర్ లో అసోసియేట్ ప్రొఫెసర్ డా// చల్లపల్లి స్వరూపరాణి తదితరులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని స్పృహ సాహితీ సంస్థ, హైదరాబాదు వారు నిర్వహిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి