- దార్ల వెంకటేశ్వరరావు
యూనివర్శిటీ కాంపస్‌కి
రాత్రీ పగలూ లేదు
నిన్నినే అడ్మిషన్లు పూర్తయ్యాయి !
ఇంటర్నెట్‌లో కులుకుతున్న
నిద్రను లాక్కొని రావడానికే
ఇంత అర్ధరాత్రైనా ప్రయాణమైంది !
ఇంకా తెలవారడం లేదు
బిగికౌగిట సూర్యుణ్ణి
కమలిని విడిచిపెట్టలేదేమో !
గుండెపగులుతూనే ఉంది
బద్దకం పిల్ల మాత్రం
కవిత్వాన్ని వండనివ్వడం లేదు !
ఇస్త్రీమడత
ఆఫీసుకొచ్చేసరికే చెమటకంపు
సిటీ బస్సు ప్రేమతో ఆలింగనం !
కపటప్రేమ ఎరకి
ఇంకో చేప పిల్ల
గేలానికి తగిలాకే మూలుగు !
శీతాకాలంలో దుప్పటి
అమ్మ ఒడిలో వెచ్చదనం
మళ్ళీ బాల్యం గుర్తొచ్చింది !
నాకీ భాష చాలదంటూ
మౌనవీణ మీటిన మనసు
మూగ భావాల లోగిళ్ళలో కళ్ళు !
పండుకొబ్బరాకు చూసి
పైనున్న పచ్చి కొబ్బరాకుకి నవ్వు
జీవితాన్నిప్పుడే ప్రారంభిస్తున్నట్లుంది !
( ఇవి 2002 కంటే ముందు యూనివ్ర్సిటీలో చదివేటప్పుడు రాసిన మినీకవితలు. వీటిని వెబ్ ప్రపంచం వాళ్ళు అప్పుడే ప్రచురించారు. వారీ సౌజన్యంతో మళ్ళీ ఇక్కడ పున:ప్రచురిస్తున్నాను. )
6 కామెంట్‌లు:
చాలా బాగున్నాయండీ.
మరీ ముఖ్యంగా
పండుకొబ్బరాకు చూసి
పైనున్న పచ్చి కొబ్బరాకుకి నవ్వు
జీవితాన్నిప్పుడే ప్రారంభిస్తున్నట్లుంది !
చాల బాగున్నాయండి. వీటిని మీ పేరుతో మా ఇ- పత్రికలో ప్రచురించాలని మా కోరిక, మీ అంగీకారం తెలియచేయగలరు.
మా వెబ్సైటు - www.samputi.com
lalitha garu,
mee web lo prachurinchu kovadaniki naaku elaanti abhyantaram ledu.
mee
darla
...
bolloju babaa garu,
thank you
darla
థాంక్స్ అండి! మీ ఇ-మెయిల్ ఇవ్వగలరా? for further communication about publishing the same... maa Id - portals@srisaa.com
Regards
Lalitha
చాలా బాగా వ్రాసారు
chalaa bagaa vraasaaru
కామెంట్‌ను పోస్ట్ చేయండి