ఇప్పటి వరకూ వికీపీడియాలో రాయడానికి పెద్దగా మనస్కరించలేదు. కొన్ని రచనలు చూసిన తర్వాత ప్రామాణిక సాహిత్యాన్ని అందించవలసిన అవసరం ఉందనిపించింది. మా ఊరి గురించి చూశాను. వివరాలు లేవు. ఇక పై రాయాలనుకున్నాను. ఈ సారి ఇంటికి వెళ్ళినప్పుడు ఫోటోలతో సహా తేవాలనిపించింది. అలాగే రాయడం ఎంత అవసరమో, వివరాలను సరిగ్గా తెలుసుకొని వెబ్ లో పెట్టడం కూడా అంతే అవసరమనిపించింది.
ఆ మధ్య వికీపీడియాలో రాయమని ఆహ్వానం వచ్చినా, సమయం వచ్చినప్పుడు రాస్తానని అప్పుడు అన్నాను. అప్పుడు ఇలా సాగింది మా మధ్య సంభాషణ:
ఆ మధ్య వికీపీడియాలో రాయమని ఆహ్వానం వచ్చినా, సమయం వచ్చినప్పుడు రాస్తానని అప్పుడు అన్నాను. అప్పుడు ఇలా సాగింది మా మధ్య సంభాషణ:
వెంకటేశ్వరరావు గారూ! నమస్కారం.
మీ వ్యాసంలో ఎన్నో విషయాలు తెలిసాయి.
ఈ వ్యాసంలోని విషయాలనూ, ఇంకా ఇలాంటి సాహిత్య విషయాలనూ మీరు తెలుగు వికీపీడియాలో http://te.wikipedia.org/wiki/ వ్రాస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. లేదా మీరు అనుమతిస్తే మేము వాటిని వికీపీడియాకు కాపీ చేస్తాము.
మీవంటి వారు తెలుగు వికీలో పాలుపంచుకొంటే బాగుంటుందని అభ్యర్ధన. “తెలుగు సాహిత్య వేదిక” రచయితలందరికీ ఇదే విన్నపం. ఎందుకంటే ప్రస్తుతం నాలాంటి ఔత్సాహికులే (విషయం గురించి సరిగా తెలియనివారు) వికీపీడియాలో ఎక్కువ వ్యాసాలు వ్రాస్తున్నారు.
సుధాకర బాబు
సుధాకర్ బాబు గారు!
నా వ్యాసం చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సాహిత్య వాస్తవిక స్థితిగతులను పరిచయం చేయాలనే ఒక సంకల్పంతోనే తెలుగు సాహిత్య వేదికలో కొన్ని శీర్షికలు నిర్వహిస్తున్నారు. అందరికీ ఉపయోగపడాలనే ఆలోచనతోనే ఈ శీర్షికను నిర్వహించడానికి అంగీకరించాను. సాహిత్య పరిశోధక విద్యార్థుల బృందం తెలుగు సాహిత్య వేదికను నడుపుతున్నది. బహుశా వారి ఆశయం కూడా సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలనేదే కావచ్చు. నేను రాసిన/రాసే వ్యాసాల వరకు వికీపీడియాలో ఉపయోగించుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. వికీపీడియాలో రాయాలనే మీ ఆహ్వానానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సమయం వచ్చినప్పుడు నేను కూడా కొన్ని వ్యాసాలు రాయడానికి ప్రయత్నిస్తాను.