"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

01 January, 2009

జోగినీ వ్యవస్థను నిర్మూలించాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జోగిని, దళిత మహిళల సాధికార చైతన్య యాత్రను పూర్తి చేసుకొని వచ్చిన కార్యకర్తల అనుభవాలను విలేఖర్ల సమావేశంలో వివరించారు. తేదీన ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘటన ఆధ్వర్యంలో హైదరాబాదులో డిసెంబరు 21 వ తేదీన ఒక కార్యక్రమం జరిగింది. దీనిలో రాష్త్ర కన్వీనర్ శ్రీమతి గేస్ నిర్మల, నేనూ, డా//జి.వి.రత్నాకర్ , ప్రముఖ గాయకుడు చిలుక భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.1988 లోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దేవదాసీ(అంకితాల నిషేధం) చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం " బాలికలను, యువతులను, దేవదాసీలుగా, జోగినిలుగా, మాతమ్మలు గా, బసివినిలు గా మారుస్తున్న వారు శిక్షార్హులు. జోగినీ స్త్రీలకు, వారి పిల్లలకు, వారి పై ఆధార పడిన వారందరికీ తగిన గౌరవంప్రదమైన పునరావాసం కల్పించడం" అనే కర్తవ్యాలను నిర్వహించాలి. అయితే అవి వాస్తవంలో అమలు కావడం లేదని సమావేశంలో వివరించారు.

ఒక్కో జిల్లాలోని పరిస్థితినీ వారు వివరిస్తుంటే ఇంకా జోగినీ వ్యవస్థ కొనసాగుతున్న తీరు అనేక మందికి ఆశ్చర్యాన్ని, ఆవేదననూ కలిగించింది.
ఈ సందర్భంగా కార్యకర్తల నుండి సేకరించిన సమస్యలను ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించారు. ప్రభుత్వానికి తమ డిమాండ్ లను కూడా నివేదించాలని నిర్ణయించారు.








2 comments:

వేణూశ్రీకాంత్ said...

చాలా ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపారు. ఇంకా ఇటువంటివి కొనసాగుతున్నాయంటే నమ్మలేకున్నాను.

S Swaroop Sirapangi said...

I am pursuing M.Phil, at present, in the Department of Political Science, University of Hyderabad. During last academic year, while pursuing M.A, I opted one paper entitled "Political Economy of Andhra Pradesh", offered by Dr.K.Y.Ratnam, in that paper he referred about this practice.

I felt curious to know the conditions of Joginies, in the present contemporary world. With the help of Dr.K.Y.Ratnam and ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘటన, I visited Nizamabad distrit, for one day and interviwed Joginies (ex). And submitted it as an assingment to Dr.K.Y.Ratnam, and at the same time posted it on my blog too. You can have a glance at it by following this link -

http://ssanthiswaroop.blogspot.com/2007/10/jogini-system-in-andhra-prdesh.html

I am very happy to see Dr.Darla Venkateswara Rao's blog with this topic. I am optimistic, at least some persons will definitely try to read Dr.Darla's blog and would try to become sensitive towards Jonigi System.