"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

03 నవంబర్, 2008

అమెరికా అధ్యక్షుడి ఎన్నిక విధానం: ( 1-11-2008 ఈనాడు సౌజన్యంతో)

అమెరికాలో నవంబరు నాలుగోతేదీ ఎన్నికలు దేశం స్వాతంత్య్రాన్ని పొందిన తర్వాత జరుగుతున్న 56వ అధ్యక్ష ఎన్నికలు. ప్రతి నాలుగేళ్లకోసారి నవంబరు మొదటివారంలోనే అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరుగుతాయి. జనం ఓట్లేసిన దాదాపు రెండున్నర నెలల తర్వాత అంటే 2009 జనవరి 20వ తేదీన కొత్త అధ్యక్షుడు కొలువు దీరుతారు. చిన్నా చితకా పార్టీలు, స్వతంత్రులు పలువురు అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నా.. డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. కాంగ్రెస్‌కూ ఎన్నికలు ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలతో పాటే, 33రాష్ట్రాల్లో సెనేట్ పదవులకు, అన్ని రాష్ట్రాల్లో 435 ప్రతినిధుల సభ స్థానాలకు, 11రాష్ట్రాల గవర్నర్ల పదవులకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. బరాక్ ఒబామా-బిదెన్, మెక్‌కెయిన్-పాలిన్ జట్లలో ఎవరు గెలిచినా, దాంతో పాటు కాంగ్రెస్‌లో అదే పార్టీకి మెజారిటీ దక్కడం, దక్కకపోవడం అన్నది కీలకమవుతుంది. ప్రతినిధుల సభకు రెండేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో మొత్తం 435 మంది ప్రతినిధుల్ని ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు. సెనేట్‌లోని వంద సీట్లలో ప్రతి రెండేళ్లకోసారి మూడింట ఒకవంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. ఆ స్థానాలకు మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు అలా ఎన్నికలు జరగబోయే సీట్లు 33. ఓట్లేసేది జనం.. ఎన్నుకునేది నియోజక గణం అమెరికా ఓటర్లు అధ్యక్షుడు, లేదా ఉపాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోరు. ప్రతినిధుల సభకు, సెనేట్‌కు ఎన్నికైనశాసనకర్తలూ అధ్యక్షుడిని నిర్ణయించలేరు. రెండు సభల్లో ప్రతినిధుల సంఖ్యకు సమానంగా 535 ఓట్లు ఎలెక్టొరల్ కాలేజీ(నియోజక గణం)లో ఉంటాయి. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాకు ప్రత్యేకంగా మూడు ఎలెక్టొరల్ ఓట్లు ఉంటాయి. అంటే మొత్తం ఎలెక్టొరల్ కాలేజీ ఓట్లు 538. జనాభా ప్రాతిపదికన ఒక్కో రాష్ట్రం ఓట్లు(ఎలెక్టర్లు) పెరగడమో, తగ్గడమో జరుగుతుంది. ఈ లెక్కన అత్యధిక జనాభా ఉన్న కాలిఫోర్నియాకు 55 ఎలెక్టొరల్ కాలేజీ ఓట్లున్నాయి. 2000 సంవత్సరపు జనాభా గణన ఆధారంగా ఎలెక్టొరల్ కాలేజీ ఓట్లు కేటాయించారు. అధ్యక్షుడిగా ఓ అభ్యర్థి ఎన్నిక కావాలంటే ఎలెక్టొరల్ కాలేజీలో కనీసంగా సంపాదించాల్సిన ఓట్లు 270. ఒక రాష్ట్రంలో అత్యధిక ఓట్లు సంపాదించిన అభ్యర్థి ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎలెక్టొరల్ కాలేజీ ఓట్లన్నీ గెలుచుకున్నట్లే. ఈ నిబంధన మెయిన్, నెబ్రాస్కా రాష్ట్రాలకు వర్తించదు. సెనెటర్లు, రిప్రజెంటేటివ్‌లు, ప్రభుత్వ పదవులు నిర్వహిస్తున్న వారు తప్ప అర్హులైన ఓటర్లు ఎవరైనా ఎలెక్టొరల్ కాలేజీలో ప్రతినిధులుగా ఉండొచ్చు. పార్టీలు నిలబెట్టే ఎలెక్టర్లకు ప్రజలు ఓటేయాల్సి ఉంటుంది. అయితే ఇలా ఎన్నికైన ప్రతినిధులు ప్రజాభిప్రాయానికి కట్టుబడి అధ్యక్ష అభ్యర్థికి ఓటేయాలన్న నిబంధన 26 రాష్ట్రాల్లో లేదు. దీంతో వేరొకరికి ఓటేసిన అరుదైన సందర్భాలున్నాయి. నాలుగో తేదీన ముగిసేది ఎలెక్టర్ల ఎన్నిక ప్రక్రియ మాత్రమే. ఈ ఎలెక్టర్లు డిసెంబరు రెండో బుధవారం తర్వాత వచ్చే తొలి సోమవారం తమతమ రాష్ట్రాల రాజధాని నగరాల్లో సమావేశమై అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థికి ఓటు వేస్తారు. తమ రాష్ట్ర ఎన్నికల్లో అధిక ఓట్లు సంపాదించిన అభ్యర్థికే ఈ ఎలెక్టర్లు ఓటు వేయడం ఆనవాయితీ. అన్ని రాష్ట్రాల ఎలెక్టర్ల ఓట్లను అమెరికన్ కాంగ్రెస్‌కు పంపిస్తారు. ఒకవేళ ఏ అభ్యర్థికీ సంపూర్ణ మెజారిటీ దక్కకపోతే ప్రతినిధుల సభ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. ప్రతిరాష్ట్రం ఒక్కో ఓటు చొప్పున వేయొచ్చు. ఇందులో సంగం కన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థి విజేతగా నిలుస్తారు. జనవరి 20వ తేదీన విజేతలు ప్రమాణం చేస్తారు. ఓటింగ్ ప్రక్రియలో లోపాలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందని చెప్పుకొనే అమెరికాలో పూర్తిగా ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం లేదు. బ్యాలెట్ పత్రం తయారీలో వివాదాలకూ కొదవలేదు. 'మెయిల్' ద్వారానే ఓటేయాలనే నిబంధనలూ కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. వెరసి... దేశమంతటికీ వర్తించే ఓటింగ్ విధానం లేదు. దీంతో ఫలితాల వెల్లడిలో జాప్యం, న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు తప్పట్లేదు. అత్యధిక ఓట్లు లభించిన వ్యక్తి అధ్యక్షుడై తీరతాడనే అవకాశం లేదు. 2000 సంవత్సరం ఎన్నికల్ని గుర్తుకు తెచ్చుకుంటే, అల్‌గోర్‌కు లభించిన ఓట్లు 48.38 శాతం. బుష్‌కు లభించింది 47.87 శాతం ఓట్లు. ఎలెక్టొరల్ ఓట్ల ఆధారంగా గెలిచింది మాత్రం జార్జి బుష్! ఎలెక్టొరల్ కాలేజీలో లోపాల్ని, జాతీయ స్థాయిలో ఎన్నికల విధానాన్ని మార్చాలంటే అమెరికా ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాలి. ఆపై రాష్ట్రాల్లో నాలుగింట మూడువంతులు దాన్ని ధ్రువీకరించాలి. అదంతా తేలిగ్గా జరిగే పని కాదు. పోటీకి అర్హతలు అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పోటీచేసే వారికి కనీసం 35ఏళ్లు నిండి ఉండాలి. అమెరికాలో జన్మించిన పౌరులు మాత్రమే పోటీకి అర్హులు. వారు కనీసం 14 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తూ ఉండాలి. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి పోటీచేసే అభ్యర్థులు ఒకే టిక్కెట్టుపై కలిపి పోటీచేస్తారు. కాబట్టి ఓటర్లు ఒక టికెట్‌నే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఓ టికెట్‌పై ఉన్న అధ్యక్ష అభ్యర్థిని, మరో టికెట్‌పై ఉన్న ఉపాధ్యక్ష అభ్యర్థిని ఎన్నికోవడానికి వీల్లేదు.

1 కామెంట్‌:

cbrao చెప్పారు...

Informative article. Thanks.

-cbrao
San Jose,CA.