Thursday, May 01, 2008

'కుల' మంటల్లో దళిత బాలిక

(నిన్న రాత్రి టి.వి. చూస్తుంటే ఒక వార్తను ఒక ప్రయివేట్ చానల్ వాళ్ళు పదే పదే చూపించారు. ప్రధాన రహదారిపై నడిచి వస్తున్నందుకు ఆ దళిత బాలికను అగ్రవర్ణాలకు చెందిన ఒక యువకుడు మంటల్లోకి తోసేసాడనేది ఆ వార్త సారాంశం! ఆసుపత్రిలో కాలిన గాయాలతో ఉన్న బాలికను కూడా చూపించారు. అలా చూపించడంలో ఆ బాలికను నగ్నంగా చూపించడం, ఆమె మర్మావయవాన్ని కనీసం కనిపించకుండా చూపించాలనే ఆలోచన లేకపోవడం చాలా విషాదకరం. ఒక సమస్యను ప్రధాన వార్త చేస్తూనే , దాన్ని నైతిక విలువలను విస్మరించి ప్రచారం చేయడంలోని వ్యాపారధోరణి మాత్రం శో్చనీయం. అక్కడేమి జరిగిందో తెలియదు గానీ దళిత బాలిక లేదా ఒక బాలిక పట్ల ఆ యువకుడు ప్రవర్తించిన తీరు మాత్రం ఖండించదగిందే కాదు, శిక్షించ్దగింది కూడా! ఆ వార్తా విశే్షాలను ఒక పత్రిక కింది విధం గా నివేదించింది.)
'కుల' మంటల్లో దళిత బాలిక
లక్నో, ఏప్రిల్ 30: అభం శుభం తెలియని ఓ ఆరే ళ్ల దళిత బాలిక రోడ్డుపై వెళ్తోంది. అయితే ఓ 18ఏళ్ల యువకుడు ఆ చిన్నారిని అడ్డుకున్నాడు. ఆ రోడ్డుపై నడువకూడదంటూ బెదిరించాడు. ఆ రోడ్డు మాదంటూ హూంకరించాడు. అదేం తెలియని ఆ పాప అలాగే వె ళ్లేందుకు ప్రయత్నించింది. ఆగ్రహించిన ఆ యువకుడు పక్కనే మండుతున్న చెత్తకుప్పలోకి ఆ బాలికను విసిరేశాడు. ఫలితం ఆ బాలిక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురకు 40కిలోమీటర్ల దూరంలోని ఛాతా గ్రామంలో జరిగింది. తన ఇంటి పక్కన ఉన్న రోడ్డుపై వెళ్లొద్దంటూ ఓ దళిత బాలికను అగ్రకులానికి (థాకూర్)చెందిన సన్నీ అనే యువకుడు అడ్డుకున్నాడు. బాలికతో పాటు ఆమెతల్లి కూడా ఉంది. దీంతో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ బాలిక తన మాట వినకపోవడంతో ఆగ్రహించిన యువకుడు ఆమెను పక్కనే మండుతున్న చెత్త కుప్ప్టలోకి విసిరేశాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. సగానికి పైగా కాలిపోయిన శరీరంతో ఆ చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు. ఆ బాలిక ఛాతా గ్రామానికి చెందిన సౌదవ జాతవ్ కూతురు. అయితే, ఆ యువకుడిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని,గూండా చట్టం కింద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మధుర ఎస్పీ ఆర్.కె. చతుర్వేదిచెప్పారు. ఆ రోడ్డు అగ్రకులాలకే సంబంధించినది కాదని, అందరూ దానిని ఉడయోగించుకుంటారని, ఇదివరకు ఇలా ఎవరూ దళితులకు అభ్యంతరం చెప్పలేదని , ఇది కేవలం వ్యక్తిగత చర్యేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, తాను ఆ బాలికను మంటల్లో కి నెట్టలేదని, ప్రమాద వశాత్తు మంటల్లో పడిపోయిందని ఆ యువకుడు పేర్కొంటున్నాడు.
( ఆంధ్రజ్యోతి 01-05-2008 సౌజన్యంతో...)

2 comments:

రాధిక said...

ఇలాంటి వెధవలు దేశంలో చాలా మందే వున్నారు.వీళ్ళకి మరణశిక్ష కూడా తక్కువేనేమో? టీవీ చానల్లవాళ్ళు ఎంతవరకూ వెళ్ళిపోతున్నారంటే తమ రేటింగ్స్ పెంచుకోవడానికి ఏమి చెయ్యడానికీ వెనకాడట్లేదు.

chandramouli said...

ఇంతకీ... మీరు నొక్కివ క్కాణీస్తుంది....
ఆ సదరు అనామక చానల్ మానసిక దౌర్బల్యంతో వ్యవహరించింది అనా...లేక,
కులపిచ్చి అనే మానసిక వైకల్యంతో భాదపడుతున్నా ...ఆ కులపురుషుని గురించా..?? రెండూనా??

అయినా ఆ చానల్ పేరు రాయడానికి మీరు ఎందుకు విముఖత చూపించారో నాకు అర్దంకావటం లేదు.... అది మీ వినయానికి నిదర్శనమా..... పేపర్లు చదివి చదివి ..అలా అలవాటయింది... సదరు సదరు...అని రాయటం....

ఎట్టకేలకు... మీ కొటేషన్ బాగుంది.... వినయం - జీవితంగురించి రాసినది..