మరిన్ని వివరాలకు http://uohydtelugu.blogspot.in/2017/07/phd-telugu-results-provisional-list.html వెబ్ సైట్ ని దర్శించవచ్చు.రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

డా.జి.వి.రత్నాకర్ అనువాద పుస్తకావిష్కరణ

హిందీలో భగవాన్‌ దాస్ రాసిన మై భంగీహూ '' దళిత ఆత్మ కథను ఉర్థూయూనివర్సిటి అధ్యాపకుడు, కవి డా.జి.వి.రత్నాకర్ అనువదించిన 'నేను అంటరాని వాన్ని' గ్రంథావిష్కరణ సభ హైదరాబాదులోని ప్రెస్ క్లబ్బులో శనివారం ( 27-4-2008)సాయంత్రం జరిగింది. సభలో పడమటిగాలి నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు, తెలుగు విశ్వవిద్యాలయం లో అధ్యాపకుడు డాశిఖామణి, సెంట్రల్ యూనివర్సిటిలో తెలుగు అధ్యాపకుడు డా.దార్ల వెంకటేశ్వరరావు ,ప్రముఖ కవి పైడి తెరేష్ బాబు, సాక్షి హ్యూమన్‌ రైట్స్ రాష్ట్ర నాయకుడు దేవకుమార్, స్ఫాయి కర్మచారి రాష్ట్ర నాయకుడు ఓబులేషు, ఉర్ధూ యూనివర్సిటి అధ్యాపకుడు డా.శేషుబాబు, సురేష్ తదితరులు ప్రసంగించారు.

No comments: