కులం అనివార్యమైన మన భారతీయ సమాజంలో దళితుని ప్రతి జీవితమూ ఒక రాయని గ్రంథమే! శతాబ్దాల తరబడి దళితులకు జరుగుతున్న అవమానాలను ఎవరి మాటల్లో వాళ్ళు వ్యక్తీకరించడం నేటి అవసరం. దళిత వాస్తవికతకు అవే గొప్ప ఆధారం. పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల స్థాయిలో దళిత జీవితాల సమగ్రాభివృద్ది కోసం అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ స్వీయ అనుభవాలను "దళిత స్వీయ చరిత్రలు" గా ప్రచురించాలని భావిస్తున్నాం. ఈ స్వీయ చరిత్రలను ఇంగ్లీషులోకి కూడా అనువదించి ప్రచురించడం జరుగుతుంది. రచయితలు ఎస్.సి. (షెడ్యూల్డ్ కులా)లలోని తమ ఉపకులాన్ని కూడా సూచించాలి. ఈ స్వీయ చరిత్రలు రాయడానికి లింగ, ప్రాంత, వయో భేధాలు అడ్డంకి కాదు.
తెలుగు, ఆంగ్ల భాషలలో తమ అనుభవాలను 8నుండి 12 పేజీలకు మించకుండా, వ్యాస రూపంలో స్పష్టంగా అర్థమైయ్యే శైలిలో రాసి పంపించవలసిందిగా కోరుతున్నాం.
తమ రచనలను కింది చిరునామాలలో ఎవరికైనా మార్చి 30నాటికి అందే విధంగా పంపించవలసినదిగా కోరుతున్నాం. తమ రచనలను కింది మెయిల్స్ ద్వారా కూడా పంపించవచ్చు.
--డా.జె.భీమయ్య,
లెక్చరర్, తులనాత్మక సాహిత్య కేంద్రం,
సెంట్రల్ యూనివర్సిటి,
లెక్చరర్, తులనాత్మక సాహిత్య కేంద్రం,
సెంట్రల్ యూనివర్సిటి,
గచ్చిబౌలి, హైదరాబాదు-44
E-mail: jbheemaiah66@gmail.com
-డా.దార్ల వెంకటేశ్వరరావు
లెక్చరర్ , తెలుగుశాఖ,
సెంట్రల్ యూనివర్సిటి,
గచ్చిబౌలి, హైదరాబాదు-44
E-mail: vrdarla@gmail.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి