27 December, 2007

దళిత రచయితల జాతీయ సదస్సు( న్యూఢిల్లీ) విశేషాలు -1

భారతీయ దళితసాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు డా.ఎస్.పి. సుమనాక్షర్ నుండి అవార్డ్ ను స్వీకరిస్తున్న సెంట్రల్ యూనివర్సిటిలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్న డా.దార్ల్ల వెంకటేశ్వరరావు


న్యూఢిల్లీ : 9 డిసెంబర్ , 2007షా ఆడిటోరియం, రాజనివాస్ మార్గ్ ,23 వ దళిత రచయితల జాతీయ సదస్సు , జాతీయ పురస్కార ప్రదానోత్సవ సభ ఆవరణం.భారత దేశ వ్యాప్తంగా వచ్చిన దళిత, దళితేతర రచయితలు,ప్రతినిధులతో రాజనివాస్ మార్గ్ కళకళలాడిపోయింది.ఈ డిసెంబరు నెలలోనూ చలి కురుస్తున్నా, ఆ ప్రాంతమంతా వేడి వేడిగానే ఉంది!

సదస్సు నిర్వ్హహించడానికి తీసుకున్న షాఆడిటోరియం అక్కడికి వచ్చిన జనానికి సరిపోలేదు.ఎటుచూసినా డా.అంబేద్కర్, ఫూలే, మాయావతి తదితరుల చిత్ర పటాలే!వివిధ భాషల్లో వచ్చిన దళితసాహిత్యం ప్రదర్సించే స్టాల్ల్స్ తో ఆ ప్రాంతమంతా కళకళలాడిపోయింది.దళిత గేయాలతో, దళిత బంధువులతో పల్లవించింది.అనేక భాషల, ప్రాంతాల ఆ ప్రజలమధ్య పెనవేసుకున్న బంధం ఒక్కటే.తామంతా దళితులం. తమ సమస్యలన్నీ ఒకటే అనే భావనే వారిలో, వారి మాటల్లో వ్యక్తయ్యింది.ఆ దృశ్యాలు ఎంతోమంది దళితులకి ఆనందభాష్పాల్ని కురిపించాయి.చిత్రమేమిటంటే, ఇంత జరుగుతున్నా అక్కడి మీడియా ఏమాత్రం స్పందించలేదు.దళితులు అంత మంది వచ్చినా, జాతీయ సదస్సు నిర్వహించినా నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరించింది.మీడియా వైఖరి పట్లా, రావలసిన జాతీయ నాయకులు సభకి హాజరుకానందుకూ సభా వేదికపైనే కొంతమంది తీవ్ర నిరసన ధ్వనులూ వినిపించారు.తమిళనాడు నుండి వచ్చిన దళిత ప్రతినిధుల పాటలతో సభ మారుమ్రోగిపోయింది


.................
దీని గురించి దట్స్ తెలుగు రిపోర్ట్ : https://telugu.oneindia.com/sahiti/essay/2008/darla-recieves-fellowship-110108.html
--------
.
యువకవి, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్న డా.దార్ల్ల వెంకటేశ్వరరావుని భారతీయ దళితసాహిత్య అకాడమీ వారు ఈ ఏడాది (2007) డా.అంబేడ్కర్ ఫెలోషిప్ అవార్డుతో సత్కరించారు. 2007 డిసెంబర్ 9-10 తేదీలలో ఢిల్లీ, రాజనివాస్ మార్గ్ లో ఎంతో వైభవంగా జరిగిన 23 వ దళిత రచయితల జాతీయ సదస్సులో ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు డా.ఎస్.పి. సుమనాక్షర్ చేతుల మీదుగా డా.దార్ల వెంకటేశ్వరరావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన దళిత రచయితల సదస్సులో డా.దార్ల వెంకటేశ్వరరావు “తెలుగు సాహిత్యంలో దళిత (మాదిగ) జీవిత ప్రతిఫలనం " ( Life reflections of Dalits (madigas) in Telugu Literature ) అనే పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఈ సదస్సులో జాతీయ స్థాయిలో దళితసాహిత్యం, దళిత జీవతాలకు సంబంధించిన వివిధ అంశాలలో చర్చలు జరిగాయి. చాలామంది తమ పత్రాలను, కథలను, కవిత్వాన్ని భారతీయ సాహిత్య అకాడమీ వారికి సమర్పించారు. వేదికపై వివిధ ప్రాంతాలనుండి వెలువడుతున్న కొన్ని దళిత పత్రికలను ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయంగా ఉన్న వర్ణ, కుల , వర్గ వివక్షలను ఈ సదస్సు సుదీర్గంగా చర్చించింది. భారతదేశంలో ఉత్త్తరాదిలో బహుజన చైతన్యం మిగిలిన రాష్ట్రాలలోనూ రావాలని సదస్సు ఆకాంక్షించింది.

భారతదేశవ్యాప్తంగా వివిధ భాషలలో దళిత సాహిత్యం, సామాజిక, పత్రికా, కళారంగాలలో కృషి చేసిన వ్యక్తులకు, సంస్థలకు ఈ సమావేశాల్లో డా.అంబేడ్కర్, జ్యోతీబాపూలే, మహర్షి వాల్మీకి, సద్గురు కబీర్ , గురు రవిదాస్, బిర్సాముండా, జగజ్జీవన్ రామ్ తదితరుల పేర్లతో జాతీయ స్థాయిలో వివిధ పురస్కారాలను అందజేశారు. వేలాదిగా హాజరైన ప్రతినిధులకు షా ఆడిటోరియం సరిపోలేదు. వివిధ స్థాయి రాజకీయ నాయకులు, మంత్రులు, మాజీ గవర్నర్లు, సాహితీవేత్తలు. కళాకారులు హాజరైన ఈ సమావేశాల్ల్లో భారతీయ దళిత సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.ఎస్.పి. సుమనాక్షర్ చేతులమీదుగానే పురస్కారాలను స్వీకరించడానికి అత్యధికులు ఉత్సాహం చూపారు. రెండు రోజుల ఈ జాతీయ సదస్సులో వివిధ భాషలలో వెలువడిని దళిత సాహిత్యాన్ని ప్రదర్శించారు.
https://telugu.oneindia.com/sahiti/essay/2008/darla-recieves-fellowship-110108.html సౌజన్యంతో...

No comments: