"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

24 ఏప్రిల్, 2007

"క్రిమీలేయర్ ఉండాలనే వాళ్ళలోనేనూ ఒకడిని"


విపుల మాస పత్రిక (2007) లో కాసుల ప్రతాపరెడ్డి గారు " రెండు వైపులా పదును " పేరుతో ఒక కథ రాశారు. నేటి రిజర్వేషనల వల్ల అగ్ర వర్ణం లో పుట్టిన ఒక జర్నలిస్ట్ ఇంటిలోనూ, సమాజంలోనూ అతను ఎలాంటి మానసిక సంఘర్షణకు గురయ్యాడు చదువుకునే విద్యార్థులలో, కుటుంబాల్లో రిజర్వేషన్లు ఎలాంటి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి? ప్రతిభావంతులు కేవలం కొందరి రిజర్వేషన్ల వల్లనే ఇంజనీరింగ్, మెడికల్ వంటి కోర్సులలో సీట్లు కోల్పోతున్నారా? సాంఘిక , ఆర్థిక కారణాలు కూడా కారణాలవుతున్నాయా? అయితే మారిని ఆ పరిస్థితులేమిటి? వాటిని సరిదిద్దుకోవటానికి ఏం చేయాలి? ఢిల్లీలో జరుగుతున్న రామదాస్ - వేణుగోపాల్ ల సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలి ? వంటి ప్రశ్నలకు కొన్ని ఆలోచనలను అందించ గలిగిందా కథ. ప్రస్తుతం జరుగుతున్న ఓ బి.సి రిజర్వేషన్‌ సమస్యను ప్రతిఫలింపచేయడంలో కూడా ఆ కథలో ఒక కోణం కనిపిస్తుంది.
క్రిమీలేయర్ ఉండాలనే వాళ్ళలోనేనూ ఒకడిని. 2004 లోనే ఎండ్లూరి సుధాకర్ గారి " వర్గీకరణీయం" పుస్తకానికి నేనొక సమీక్ష రాస్తూ క్రిమీలేయర్ మాత్రమే కాకుండా అవసరమైతే అగ్రవర్ణాలవారిలో ఆర్థికంగా వెనుకబడిన వారికీ కొంతకాలం రిజర్వేషన్లు కల్పించటం తప్పుకాదని ప్రతిపాదించాను. ఆ అభిప్రాయాన్ని "వర్గీకరణీయం" పునర్ముద్రణలోఎండ్లూరి సుధాకర్ గారు కూడా ప్రచురించుకున్నారు. ఎస్సీ రిజర్వేషన్‌ లో వర్గీకరణను ఆశించటం కూడా ఒకరకమైన క్రిమీలేయర్ ని పాటించమని కోరటమే.
ఎస్సీ రిజర్వేషన్‌ లను కొన్ని ఎస్సీలలోని కొన్ని ఉపకులాల వారే చాలా కాలం అను భవించారు. సుమారు 59 ఉపకులాలు వాళ్ళు ఎస్సీ లో ఉన్నారు. వారిలో మాల - మాదిగలు మాత్రమే అత్యధిక శాతం రిజర్వేషన్ల ను అనుభవించారు. ఒక సారి రిజర్వేషన్‌ పొందిన వాళ్ళ కంటే, అసలు రిజర్వేషన్‌ పొందని వాళ్ళకు రిజర్వేషన్‌ దక్కాలి. ఒకప్పుడు ఎస్సీలు ఇతరకులాల వాళ్ళే తమ అవకాశాలను తమకు అందకుండా చేశారని వాళ్ళ ని నిందిందించారు. అదే పద్దతిలో మాకు రావలసినవాటిని మాకు అందనివ్వండని ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఎస్సీ లోని అన్ని ఉపకులాల వారికీ సమాన అవకాశాల కోసం పోరాడు తుంది. ఇది ఒక రకంగా రిజర్వేషన్లకు క్రిమీలేయర్ పాటించ మని అడగటం వంటిదే!

3 కామెంట్‌లు:

spandana చెప్పారు...

మీరన్నది ఏమిటో స్పంష్టంగా అర్థం కాలేదు. "క్రీమీలేయర్ వుండటం" ఏమిటి? మీ వుద్దేశ్యం క్రీమీలేయర్‌కు రిజర్వేషను వుండాలనేదా? అయితే అందుకు మీకు కనిపించిన కారణాలు తెలపండి. నా మట్టుకు నాకు క్రీమీలేయర్‌కు రిజర్వేషన్ అవసరం లేదనే సుప్రీం కోర్టు వాదనతో ఎలాంటి విభేదమూ లేదు.


--ప్రసాద్
http://blog.charasala.com

vrdarla చెప్పారు...

ప్రసాద్ గారూ!
మీ స్పందనకు ధన్యవాదాలు.
క్రిమీలేయర్ అంటే ఏమిటో మీకు తెలుసనుకుంటాను. ఒకసారి రిజర్వేషన్‌ అవకాశాలను పొందిన వాళ్ళ కంటే, అసలు ఆ అవకాశాలు అందని వాళ్ళకు రిజర్వేషన్‌ సౌకర్యాలు అందాలనే ఆలోచన క్రిమీలేయర్ లో ఉంటుంది. ఇప్పుడున్న రిజర్వేషన్‌ వ్యవస్థలో కొన్ని వర్ణాలవారే అవకాశాలను పొందుతున్నారు. ఉదాహరణకు బాగా చదువుకున్న వాళ్ళ. రాజకీయవేత్తల పిల్లలతో గ్రామీణ ప్రాంత విద్యార్తులు పోటీ పడలేరు. అందులోనూ మొదటి తరం వాళ్ళు ఇప్పుడిప్పుడే విద్యావకాశాలను అందుకోవాలను కుంటున్నారు. వాళ్ళూ చాలావెనుకబడి ఉంటారు. కనుక, ఒకతరం రిజర్వేషన్లు పొందిన వాళ్ళు, తరువాత మళ్ళీ రిజర్వేషన్లు పొందడం కంటే, అసలు పొందని వాళ్ళకు ఆ అవకాశాన్ని కలిగిస్తే బాగుంటుంది. అప్పుడు మన రాజ్యాంగం ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. కలకాలం కొన్ని వర్ణాల వారే రిజర్వేషన్లు పొందాలనుకోవటం సమర్థనీయం కూడా కాదు. రాజకీయ వేత్తల్లా మేథావులు కూడా మాట్లాడితే సమస్యలు పరిష్కారాలు అందవు. ప్రస్తుతం వర్ణానికి ( కులానికి) ప్రాధాన్యతనిచ్చేరిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. దీని వల్ల బయిటికి కనిపించక పోయినా కొని వర్ణాల పట్ల మరికొన్ని వర్ణాల వారికి ద్వేష భావం పెరిగి పోతున్నది. ఒక నిస్సహాయతనుండి పుట్టు కొస్తున్న ద్వేష భావమది . దీనికి కారణం కేవలం రి్జర్వేషన్లకు కులాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోవటం ఒక ప్రధాన కారణం. అందు వల్ల అవసరమైన మేరకు ఆర్థిక కారణాలను కూడా పరిగణ లోకి తీసుకొని కొంతకాలం రిజర్వేషన్లు అమలు చేయాలనేది ఒక వర్గం వాదన.ఇదే సుప్రీం కోర్టు వాదనలో సారాంశం. అంతే తప్ప క్రిమీలేయర్ లోనూ రిజర్వేషన్లు ఎలాఉంటాయండీ!

spandana చెప్పారు...

దార్ల గారూ,
మన ఇద్దరి అభిప్రాయం ఒకటే అయినా "క్రీమీలేయర్"ను భిన్నంగా అర్థం చేసుకున్నాం.

రిజర్వేషను వల్ల లబ్ది పొందిన, సమాజంలో ఇప్పటికే మంచి అంతస్థులో (ఆర్థికంగ, సామాజికంగా)వున్న వారిని "క్రీమీలేయర్" అంటారు అనేది నా అవగాహన.
ఈ క్రీమీలేయర్‌కు మళ్ళీ రిజర్వేషన్ ఇచ్చుకుంటూ పోతే దానివల్ల బాగుపడిన వాడే మళ్ళీ మళ్ళీ బాగుపడతాడు. ప్రయోజనం అందని వాడు అందకుండానే వుంటాడు. అసలీ క్రీమీలేయరే తమ వర్గంలోని తక్కువ స్థాయి వారిని అణిచివేస్తారు.

మీ ఇదివరకటి టైటిల్ చూసి "క్రీమీలేయర్ కు రిజర్వేషను సమర్థిస్తున్నారేమొ" అని అనుకున్నాను. కానీ మన అభిప్రాయాలు ఒక్కటే!

--ఫ్రసాద్
http://blog.charasala.com