Wednesday, April 25, 2007

నాగరాజు గారూ... విజయోస్తు !

నాగరాజు పప్పు గార్కి !
మీరు ఇంజనీరుననీ, సాహితీ వేత్తను కాదంటూనే బ్లాగ్మిత్రులను ఉత్తమ సాహిత్యం, కళాస్వాదనల వైపుకి పయనింప చే్స్తున్నారు.ఇలాంటి మీ ప్రయత్నాన్ని ప్రతివారూ అభినందించ కుండా ఉండాలేరు. అందులో నేనూ ఒకడిని!
మీరు బ్లాగులో రాస్తున్నారు. కంప్యూటర్ పరిభాష, బ్లాగు స్పర్శతో అక్కడక్కడా కొంతమంది బ్లాగు మిత్రులను ఉటంకిస్తూ " విషయాన్ని " బోధన పధ్ధతిలో వివరించటం చాలా బాగుంది. అలంకార శాస్త్రంలో "సౌందర్య" చర్చ ఉన్నా, ఆధునిక కాలంలో సౌందర్య శాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా అభివృద్ది చెందటంలో పాశ్చాత్యుల కృషి ప్రశంస నీయం.పుట్టని బిడ్దకి పేరు పెట్టాడని క్రోచీ వ్యాఖ్యానించినా గానీ, Alexander Gottlieb Boumgarten నే సౌందర్య శాస్త్రానికి ఆద్యుడిగా విమర్శకులు భావిస్తున్నారు. తన గ్రంథానికి Aesthetics అని పేరు పెట్టినా, కళా సౌందర్యం గురించి ఆయన (Alexander Gottlief Boumgarten) Aesthetic (1750) గ్రంథం లో చేసిన వివేచన ఎక్కువ మంది మెప్పుని పొందలేదని చెప్పిన వారున్నారు. అయినా ఆయన కృషిని విస్మరించ లేని స్థితి. అలాగే భారతీయులలో ముఖ్యంగా భరతుడు నాట్యశాస్త్రంలో సౌందర్యానికి సంబంధించిన అనేక విషయాలు చెప్పాడు. అయినా, సౌందర్య శాస్త్రం గురించి చెప్పేటప్పుడు పాశ్చాత్యులతోనే మొదలు పెడతుంటాం.!
మీరు ఒక మంచి రచనకు పూను కున్నందుకు మిమ్మల్ని మరోసారి అభినందిస్తూ... మీ రచనకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.
(నాగరాజు పప్పు గారు సౌందర్య శాస్త్రంలో గల కొన్ని మౌలిక విషయాలను వివరిస్తూ రాయబోతున్న వ్యాస పరంపరకు ఆయన రాసిన ఉపోద్ఘాతం చదివి రాసిన నా అభిప్రాయం)

3 comments:

Nagaraju Pappu said...

మాస్టారు,
మీ అభినందనలు నాకు ఆశీర్వాదాలు. నేను చదువుకొన్నది హైదరాబాదు విశ్వవిద్యాలయంలోనే, కాబట్టి మీరు నాకు గురుతుల్యులు. క్రితం సంవత్సరం ఐ.ఐ.ఐ.టి. లో విసిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నప్పుడు, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు అక్కడ తెలుగు సాహిత్యం భోదించేవారు - ఆయన క్లాసులకి నేను కూడా విధిగా హాజరవుతుండేవాడిని, ఆరకంగా ఆయనతోనూ, ఇంటర్నెట్టు ద్వారా మీతోను సాంగత్య బాగ్యం లభించటం అదృష్టమే.

నేను రాయబోయే విషయాన్ని మీరు ముందుగానే పట్టుకొన్నారు. ఈ వ్యాసాలలో మూడో భాగంలో బౌమ్‌గార్టెన్ సిద్ధాంతాలని పరిచయం చేస్తాను.

ఇంతకు ముందు రాసిన మూడు భాగాలుకూడా మీకు వీలున్నప్పుడోసారి చదివి, మీ అభిప్రాయం తెలియచెయ్యండి.

మీ ప్రోత్సాహానికి మరోసారి ధన్యవాదాలతో,
నాగరాజు పప్పు.

డా.వి.ఆర్ . దార్ల said...

నాగరాజు గారూ! నన్ను గురుతుల్యులుగా భావించటం మీ ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. ఆచార్య బేతవోలు వారు గొప్పపండితులు.నిజంగా ఆయన దగ్గర మేము
( మా అధ్యాపకులు )అంతా చాలా నేర్చు కోవాల్సిందే ఉంది. మీకు Aesthetics పై మంచి పట్టు ఉందని మీ వ్యాసమే చెబుతుంది. నేను ఇచ్చినవి ఆశీస్సులు కాదు... వ్యాసాల్ని రాయటానికి ఉత్సాహపరిచే మాటలే ! మీ అభిమానానికి నా ధన్యవాదాలు.

gandu said...

సార్ మీ బ్లాగు చాల బాగుంది.......మీ విధ్యార్థి జి.మహెందర్