ఈ ప్రజాస్వామ్య వాతావరణంలో తమ భావాలను చెప్పే హక్కు ఎవరికైనా ఉంది. అలాగే ఎన్నైనా పత్రికలు వచ్చే అవకాశమూ ఉంది. ఇది స్వాగతించవలసిన విషయం కూడా! ఎందుకంటే కొత్త కొత్త పత్రికల వల్ల కొత్త విషయాలు,కొత్త భావాలు, కొత్త కొత్త కోణాలు తెలిసే అవకాశం ఉంది. వ్యక్తిగతమైన బ్లాగులతో ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో నడిచే పత్రికలని పోల్చలేం! ఈ అంశాల్ని ఇప్పటికే చాలా మంది చర్చిస్తున్నారు. ఇది నిజంగా ఆహ్వానించదగిన చర్చ. ఈ విషయంలో రామనాథ రెడ్డి గారి వాదన ప్రజాస్వామ్య పద్దతిలో ఉందనిపించింది. ఆ వాదన ఇది---
"దాటలేక కాదులే రామయతండ్రీ మమ్ము దయజూడగ వచ్చావు రామయతండ్రీ రామయతండ్రి ఓ రామయతండ్రీ మా నోములన్ని పండినాయి రామయతండ్రీ మా సామివంటె నువ్వేలే రామయతండ్రీ
మీ సందేహం చూసి పాటలోని పై చరరణం గుర్తొచ్చింది. ఇదే ప్రశ్న మా తెలుగు టీచర్ అడిగితే నా సమాధానం ఇలా వుంటుంది:
౧. ఏ రచయితైనా ఎందుకు ఇటువంటి పత్రికలకి తను రాతలు పంపవలసిన అవసరం? ఎలాగు బ్లాగులొచ్చేక ప్రచురణ చాలా తేలిక అయిపోయింది కదా? మన గురించి, మన బ్లాగు గురించి ఇతరులకి (పాఠకులకి) తెలియ చెప్పడానికి ఒకవేళ ఈ పత్రికలు ఉపయోగ పడతాయి అనుకొంటే, కూడలి, తేనెగూడు ఆ పని ఇంకా బాగా చేస్తున్నాయి కదా? ఎలాగు, ఈ పత్రికలు చదివే వాళ్ళందరూ, కూడలి కూడా చుస్తారు - అందువల్ల, ప్రత్యేకమైన పబ్లిసిటీ ఈ పత్రికల్లో మన రచనలు ప్రచురించటం వల్ల రాదు. *జవాబు:* పత్రిక అనేది కొన్ని ప్రమాణాలకు తగ్గకుండా నడుస్తుంటుంది - నిర్వాహకుల అభిరుచిని బట్టి. పత్రిక విజ్ఞులైన వారి సలహాలను కళ్లకద్దుకుంటుంది. పత్రిక కేవలం ఒక వ్యక్తి మనోగతం కాదు. కొందరి సమిష్టి ఆలోచనలకు సమైక్య సుందరరూపం. (కొంచెం ఎక్కువైందా? కేవలం నాభావాన్ని మాత్రమే గ్రహించండి. వర్ణనను పట్టించుకోకండి.) నిజమే కదా - చాలా రకాల విషయాలను సమ పాళ్లలో వుంచి, ఆలోచనలను ఐక్యంచేసి, అందంగా అందించే పని పత్రికలోనే జరుగుతుంది. ఎవరైనా ఆ పత్రిక చూసి మంచి ప్రయత్నం అనుకొని, దానికి మెరుగులు పెట్టిపోషిస్తే ఇంకా బాగుంటుందని 'ఫీల్'అయి, సలహాలివ్వడానికి వెనుకాడే అవకాశం తక్కువ. పత్రిక సమిష్టి పుత్రిక కనుక సలహాలను సూచనలను పరిగణించి మరింత హుందాగా తీర్చే ప్రయత్నం జరుగుతుందనే నమ్మకం వలన. అదే బ్లాగయితే ఉచిత సలహాలిస్తే 'తూ కౌన్ బే' అంటుందేమో/అంటాడేమో అని భయంతో మనకెందుకులే అనిపిస్తుంది. బ్లాగులో నా బ్లాగులో నాకు తెలిసింది మాత్రమే నేను రాస్తూపోగలను. అందరూ దాన్ని చూసి పొగిడితే సంతోషిస్తాను. నాకు విసుగొస్తే అపేస్తాను. పత్రిక అంత సులువుగా ఆగిపోదు. మంచి ప్రమాణాలతో నడిచే పత్రికకు మంచి ప్రమాణాలున్న పాఠకులుంటారు. విజ్ఞులుంటారు. మంచి విమర్శలొస్తాయ్. పత్రికలో రచనలు చేయడం 'పాపు'లరైపోవడానికేనా? పాపులర్ కావచ్చు కానీ దానితోపాటు ఈ సజ్జనసాంగత్యం, విమర్శలు, వాదాలు వ్యక్తిగా మనల్ని మనం నిరంతరం మెరుగుపరచుకొనే ప్రక్రియకు పత్రిక ఒక వేదిక.
౨. ఒకవేళ పది మందికీ పనికొచ్చే రీసెర్చ్ క్వాలిటీ సరుకు మనదగ్గరుంటే, వాటిని పదికాలాల పాటు పదిల పరచటానికి వికీపీడియా ఉంది. వికీపీడియాలో మనం కూర ముక్కలు తరిగి పడెస్తే, పదిమందీ తలో చెయ్యీ వేసి, దాంతో పప్పు చేసెస్తారు. ఆ వెసులుబాటు కూడా ఈ పత్రికలులో రచనలకి లేదు. ఇవి వికీపీడియా అంత శాశ్వతం కావు కూడా కదా? *జవాబు:* ఒక వ్యాసానికి చదివించే గుణం వుండటం ఎంత ముఖ్యమో తెలియనిదికాదు. దానికి ఎలా అబ్బుతుందీ గుణం? అందులో కొంత హాస్యం, కొంత సస్పెన్సు, కొంత అద్భుతరసం లాంటి బెల్లమూ ఉప్పూ కారమూ పులుపూ ఆద్యంతమూ పూస్తే వదలకుండా చదవబుధ్దవుతుంది. వికీపీడియా విషయానికి పెద్దపీటవేస్తుందేకానీ అందులో నవరసాలు అనవసరం అంటుంది. దాని కొరతలు దానికీ వున్నాయి. ఏదైనా తెలియకపోతే, అది తెలుసుకొనాలనిపిస్తే శ్రద్ధగా వికీపీడియా చదువుకోవచ్చు. చదివించడం, నేర్పించడం పత్రికలకే సాధ్యం.
౩. ఈ పత్రికలన్ని ఉచిత పత్రికలు కాబట్టి, పారితోషికాలు కూడా ఇవ్వలేవు. *జవాబు:* ఔను మీరు ఉదహరించిన పత్రికలన్నీ 'ఉచిత' పత్రికలే. వాటిలో కొన్ని సముచిత పత్రికలు. అవి సమున్నతాలవడానికి ప్రయత్నిస్తున్న పత్రికలు. పారితోషికం ఇవ్వలేవనడం సబబుకాదు. ఎందుకంటే అవి పారితోషికాలు ఇస్తున్నాయి. పైకమే పారితోషికమా?
౪. పోనీ, ఈ పత్రికలు, మనం పంపే రచనలని, సానబెట్టి, వాటిని ఎడిట్ చేసి, మెరుగులు దిద్ది ప్రచురిస్తున్నాయా అంటే, నాకైతే అలా అనిపించటం లేదు. *జవాబు:* సానబెట్టడం, ఎడిటింగ్ జరుగుతున్నాయి. కొన్ని పత్రికల నిర్వాహకులు ఈ విషయంలో ఇంకా ప్రాథమిక విద్యార్థులు. వాళ్లకు ఇది ప్రవృత్తి. వాళ్లకు భృతి కల్పించే వృత్తులు వేరే వున్నాయి. వారి ప్రవృత్తితో ఏకీభవనించే అనుభవజ్ఞుల సాంగత్యాన్ని ఈ పత్రికలవారు స్వాగతిస్తారు.
౫. పోని, పాఠకులకేమైనా ఈ పత్రికల్లో రచనలు చదవటం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలున్నాయా అంటే, అవి కూడా నాకేం కనిపించడం లేదు. బ్లాగులైతే, ఆ బ్లాగరితో ముఖాముఖి సంప్రతించొచ్చు కదా? *జవాబు:* ప్రయోజనాలు లేకేం.కొత్త విషయాలు తెలియడం, మంచి మనసును మంచిగానే వుంచే వ్యాసాలు చదవడం, ఆత్మావలోకనం కలిగించే రచనలుచేయడం, వాటిని చదవడం ఇవన్నీ ప్రయోజనాలే కదా!
నేను 'మహర్షి విశ్వామిత్ర'నూ కాను, 'మహారథి'నీ కాను, 'స్టూడెంట్ నంబర్.1'నీ కాను.
నేను మామూలు ..."
(పూర్తి చర్చ కోసం ఇక్కడ చదవండి.)
1 కామెంట్:
ఆచార్యులకు ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి