"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

29 జనవరి, 2007

ఇక్కడ పుట్టడమే నేరమా?

పుట్టుక గురించెవరైనా మాట్లాడుతుంటే
నా వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది
విశ్వం పుట్టడానికెన్ని సిద్దాంతాలున్నాయో ...
నాకు తెలియదు కానీ...
ఈ ప్రపంచంలో నేను పుట్టడానికిమాత్రమొక్కటే సిద్ధాంతం
వంశపారంపర్యంగా నాకుటుంబంవాళ్ళే
దేవుడిపెళ్ళాలైపోవడం
భూస్వామ్యానికి భోగవస్తువునై
పెత్తందారీ చిత్తాన్ని రాగరంజితం చేయడం
వాళ్ళ కామదహనానికి బలైపోతూ
తరతరాలుగా మాతంగిగానలిగిపోవడం

అంతా తమపుట్టుక గురించి
ఏవేవో పురాణాల్ని పవిత్రంగా వినిపిస్తుంటే
నేను కూడా
ఏ పోలేరమ్మనో, ఏ పోచమ్మనో రచ్చబండ మీద కీడ్చుకొచ్చి
నేనెవడికి పుట్టానో
నాకెవడివల్ల ఎవడు పుట్టాడో
ఆదేవతలచేతే చెప్పించాలనిపిస్తుంది

అయినా నాకో అనుమానంగానీ...
మహాపురుషుల పాదాలనుంచి పుట్టినోళ్ళు తప్ప
ఆదేవుళ్ళెవ్వరికీ ఇతరుల యవ్వనాలంతగా రుచించవా...?
- డా. దార్ల వెంకటేశ్వర రావు.
( ఈ కవిత ఈ రోజు (29-01-2007) ఆంధ్ర ప్రభ దినపత్రిక 'సాహితీ గవాక్షం ' లో ప్రచురితమయ్యింది)

2 కామెంట్‌లు:

రాధిక చెప్పారు...

మాతంగుల మనోవేదన చిన్న కవితలో హ్రుద్యం గా ఆవిష్కరించారు.చివరిలో మీరడిగిన ప్రశ్నకు ఏ దేవుడు,దేవత సమాధానం చెప్పలేరేమో?

అజ్ఞాత చెప్పారు...

చివరలో ప్రశ్న అద్భుతంగా వుంది

విహారి
http://vihaari.blogspot.com