తెలుగు భాషను బతికించుకోవాలి ( prajasakti report)

తెలుగు పత్రికల్లో సంస్కృత పదాల వాడకం పెరిగిపోయిందని, దీన్ని తగ్గించి తెలుగు భాషను బతికించుకునేందుకు తెలుగు పత్రికలు కృషిచేయాలని వక్తలు సూచించారు. తెలుగు బాలసాహిత్య వేదిక ఆధ్వర్యంలో నెక్లస్‌రోడ్‌లోని 26వ హైదరాబాద్‌ బుక్‌ పెయిర్‌ ప్రాంగణంలో 'తెలుగు దినపత్రికల భాష ఆధునీకరణ' గ్రంథావిష్కరణ సభ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు పై విధంగా పేర్కొన్నారు. ఈ సభకు ఆచార్య సి.లక్ష్మన్న అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గ్రంథావిష్కరణ చేసి అనంతరం మాట్లాడుతూ పత్రికభాషలో సంస్కృత పదాల వాడకం విపరీతంగా పెరిగిపోయిన సమయంలో ఈ పుస్తకం రావడం వల్ల పాత్రికేయులు రాసే భాషలోని లోపాలు తెలుసుకోవచ్చని అన్నారు. ఇది తెలుగు భాష పరిరక్షణకు దోహదపడుతోందని, అలాంటి పుస్తకం రాయడానికి పగడాల చంద్రశేఖర్‌ పూనుకొవడం అభినందనీయమని అన్నారు. అనంతరం ప్రముఖ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ జీవనంలో భాష భాగమైందని, ఆ భాషే సజీవమైందని తెలిపారు. పత్రిక భాష ప్రసార భాషగా మారి చాలా కాలమైందని, దీని వల్ల పత్రికలు తరుచుగా వాడే సంస్కృత పదాలు కూడా వాడుక భాషగా మారాయని అన్నారు. కాబట్టి అలాంటి పదాల వాడకాన్ని పత్రికలు క్రమంగా తగ్గించాలని, అదే సమయంలో కొత్తగా అన్య భాష పదాల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని అన్నారు. పత్రికలకు వార్తలను ప్రచురించడానికి చాలా తక్కువ సమయం ఉంటోందని, దీని వల్ల ఇతర భాష నుంచి తెలుగుకు అనువాదలు చేసేటప్పుుడు ఈ సమస్య తలెత్తుతోందని అన్నారు. పత్రిక భాష లోపాలు తెలియజేయడానికి రచయిత చేసిన కృషి అమోఘమైందని అన్నారు. పత్రికలు వాడే భాషపై రచయిత ప్రామాణికమైన పరిశోధన చేసి ఈ పుస్తకం రాశారని పేర్కొన్నారు. ప్రముఖ పాత్రికేయులు ఎబికె ప్రసాద్‌ మాట్లాడుతూ భాష లోపాలకు సంబంధించిన వివరణలను ఈ పుస్తకంలో పొందుపరిచారని అన్నారు. ఆంగ్ల భాష పదాలను కొన్ని సందర్భాల్లో పత్రికలు నేరుగా వినియోగిస్తున్నాయని, దీన్ని తర్వాతైనా సరళమైన తెలుగు భాషలోకి అనువాదించాలని తెలుగు పత్రికల నిర్వహకులకు సూచించారు. తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టరు జె. చెన్నయ్య మాట్లాడుతూ పాత్రికేయులతో పాటు భాష పరిశోధనాలు చేసే వారికి ఈ పుస్తకం ఉపయోడపడుతోందని అన్నారు. కార్యక్రమంలో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య డి.చంద్రశేఖర రెడ్డి, జి.యస్‌ వరదాచారి, పుస్తక రచయిత పగడాల చంద్రశేఖర్‌ ప్రసంగించారు. కార్యక్రమంలో పలువురు సాహిత్య ప్రియులు పాల్గొన్నారు.
26వ హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌లో జనవిజ్ఞాన వేదిక (జెవివి) మ్యాజిక్‌ షో నిర్వహించింది. ఈ మ్యాజిక్‌ పలువురు సందర్శకులను ఆకట్టుకొవడంతో పాటు మూఢనమ్మకాలను, బాబాల మహిమలను నమ్మరాదనే సందేశానిచ్చింది. మ్యాజిక్‌లో నిర్వహించిన అద్భుత విన్యాసాలకు పిల్లలు ముగ్ధులయ్యారు. ఈ కార్యక్రమాన్ని జెవివి రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

darla books in http://kinige.com/

http://kinige.com/kbrowse.php?via=author&id=69
ఒక మాదిగ స్మృతి On Kinige

తెలుగు సాహిత్యంలో స్త్రీ వాద, దళిత ఉద్యమాలు బలహీన వర్గాల్లో గొప్ప చైతన్యానికి కారణమయ్యాయి. సామాజిక, సాహిత్య రంగాల్లోని వివక్షలను తీవ్రంగానే విమర్శించాయి. అయినా వీటిలోనూ కొన్ని వర్గాల్ని విస్మరించడాన్ని గుర్తించి "మాదిగ సాహిత్యం" ప్రత్యేక అస్తిత్వంతో ముందుకు రావాలని ఆకాంక్షించిన సాహితీ వేత్త నాగప్ప గారి సుందర్రాజు.

మాదిగ చైతన్యం, చండాల చాటింపు, మాదిగోడు, మావూరి మైసమ్మ పుస్తకాల ద్వారా మాదిగ సాహిత్యాన్ని తెలుగు సాహిత్యంలో ఒక ధోరణిగా మార్చగలిగాడు.

భాషలో, వస్తువులో, శిల్పంలో కొత్త పంథాని ప్రవేశపెట్టి, తాను మాత్రం ఈ లోకం వీడి వెళ్ళి పోయాడు.

అతన్ని స్మరించుకోవడం మాదిగలకు, తెలుగు సాహిత్యానికి ఒక తప్పని సరి అవసరం. దానిలో భాగమే ఈ పుస్తకం.
-దార్ల వెంకటేశ్వరరావు.

darla books in http://kinige.com/

http://kinige.com/kbrowse.php?via=author&id=69


వీచిక On Kinige

పరిశోధకుడిగా పింగళి లక్ష్మీకాంతం గారి వరివస్యను మదింపు వేసినా, వల్లంపాటి వారి విమర్శ దృక్పథాన్ని విశ్లేషించినా, జ్ఞానానందకవి, మల్లవరపు జాన్ గార్ల పద్యకృతులను అనుశీలించినా, సాహిత్యంలోని ప్రాంతీయతనలూ, మానసిక స్థితిగతులనూ మూల్యాంకన చేసినా, నానీలూ, కథలూ, నవలలూ, అనువాద నవలల్లోని రూప వైవిధ్యాన్ని ఆవిష్కరించినా, దళిత వాద, స్త్రీ వాద, మైనార్టీ వాదాల నేపథ్యంలో ఆ యా రచనల విలువలను నిర్ధారించినా డాక్టర్ దార్ల - తలస్పర్శి అవగాహనతో, నిష్పాక్షికతతో చేసి తన ఉత్తమ విమర్శక లక్షణాన్ని నిరూపించుకున్నారు. ఈ సంపుటిలోని ప్రతి వ్యాసమూ పాఠకుల అవగాహన పరిధులను విస్తరించేదే. ఏదో ఒక కొత్తదనాన్ని ఆలోచనాత్మకంగా అందించేదే. మామూలు మాటల్లో చెప్పాలంటే చదువరి శ్రమకు ప్రతి వ్యాసమూ గిట్టుబాటు అవుతుంది.
- ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

darla books in http://kinige.com/

http://kinige.com/kbrowse.php?via=author&id=69

దళిత సాహిత్యం మాదిగ దృక్పథం On Kinige

సమకాలీన సాహిత్యంలో ఒక ప్రధాన ఉద్యమం మాదిగ సాహిత్య ఉద్యమం. ఇది అంబేద్కర్ తాత్విక భూమికను, ఆయన పోరాట పటిమను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్న ఉద్యమం. ఒక చారిత్రక నేపథ్యంలో జాతి అస్తిత్వాన్ని ప్రతిఫలించే దిశగా పయనిస్తుంది. ఈ పుస్తకాన్ని చదివి ప్రజాస్వామిక వాదులందరూ సామాజికంగానూ, సాహిత్యపరంగానూ మాదిగల సంస్కృతిని స్వీయ అస్తిత్వాన్ని స్వాగతిస్తారని ఆశిస్తాను.
-డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు.
కుల-వర్గ, వర్తమాన దండోరా ఉద్యమ సమస్యల్లాంటివి సామాజిక ప్రధాన అంశాలై సమగ్రమైన చర్చ లేవదీస్తూ, అది సాహిత్యంలో ప్రతి ఫలిస్తున్న తీరును శాస్త్రీయంగా విశ్లేషిస్తూ ప్రచురిస్తున్న ఈ పుస్తకం దార్ల సామాజిక అవగాహనకు సాహిత్య కృషికి అంకిత భావానికి తార్కాణంగా నిలుస్తుంది.
-డాక్టర్. జె. భీమయ్య.
ఆరంభంలో మాదిగ సాహిత్యం దళిత సాహిత్యంలో అంతర్భాగంగా ఆరంభమైనప్పటికీ ఆ సాహిత్యం తడిమిన పలు ప్రక్రియలు వస్తు వైవిధ్యాల దృష్ట్యా చూసినప్పుడు దానికంటూ ఒక స్వంత అస్తిత్వం ప్రత్యేకతలు ఉన్నాయని ఈ పుస్తకంలో దార్ల మాదిగ సాహిత్య స్వతంత్ర బావుటాను దశ దిశలా ఎగురవేస్తాడు. ఇదే ఈ పుస్తకంలోని వ్యాసాలన్నింటిలో కనిపించే ఏక సూత్రత.
సాంబయ్య గుండి మెడ
Dalitha Sahityam : Madiga Drukpadam aptly captures community concerns and traces out the rich cultural heritage of the Madigas in carving a significant place in Telugu society. Dr. Darla Venkateswararao, one of the youngest poets, a dynamic scholar and rational literary critique, covered a wide range of issues and mapped out the contributions of literary.
-Dr. G. Nagaraju.