"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

08 జులై, 2026

కొలతల జీవితం

 

కొలతల జీవితం


తినాలనిపిస్తుంది.
తినకూడదు.
కొలతల తిండి.

కొలిచిన ముద్దలు.
కొలిచిన సమయాలు.
కోరికతీరా తినడం
ఒక జ్ఞాపకం.

తీపి కనిపిస్తుంది.
నాలుక ముందుకెళ్తుంది.
గ్లూకోమీటర్
వెనక్కి పిలుస్తుంది.
పండుగలన్నీ
పళ్లెంలో దిగుతాయి.
నా చూపు మాత్రం
కొలతల దగ్గరే ఆగిపోతుంది.

చేయాలనిపిస్తుంది.
చేయలేకపోతాను.
రెండు అడుగులకే ఆయాసం.
కొద్దిసేపటికే అలసట.
శరీరం ప్రతి రోజూ
కొత్త నిబంధన చదివిస్తుంది.

జీవితం
మందుల సమయాలతో,
ఆహారపు కొలతలతో,
పరీక్షల సంఖ్యలతో
కొలవబడుతోంది.

మనసు మాత్రం
చిన్నపిల్లాడిలా
ఒక్క లడ్డూ కోసం
ఇప్పటికీ మొండికేస్తూనే ఉంటుంది.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 7.7.2026


కామెంట్‌లు లేవు: