"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

08 జూన్, 2026

జాతీయ ఉత్తమ స్నేహితుల దినోత్సవం (National Best Friends Day) జూన్, 8.

 జాతీయ ఉత్తమ స్నేహితుల దినోత్సవం (National Best Friends Day) జూన్, 8.


కపట బుద్ధి లేక కలుషంబు లరయక

మనసు విప్పి మాటలాడువాడు

ధనము కన్న మిన్న ధరణిలో మిత్రుడు

నమ్మదగినవాడు నరుడు గాడె.


కష్టకాలము నందున కాచి నిలిచి

తోడు నీడగ నిలిచెడి తోడబుట్టు

మదిని దాచక కూరిమి బంచువాడు

ఇలను జూడగ నాతడె యిష్టుడౌను.


ధనము పోయిన మల్లీయు దక్కవచ్చు

కీర్తి పోయిన నెమ్మది గెలువ వచ్చు

మంచి స్నేహితు డొక్కడు మళ్లి రాడు

తిరిగి రాడయా జగతిని తెలియ గనుమ.


ఆశ లూరక నెల్లెడ కాచి నిల్చి

కోప తాపము లున్నను గూర్మి జూపు

తప్పు లన్నిటి మన్నించి దరిని జేర్చు

ఒప్పు లొలికెడి స్నేహమె గొప్ప దయ్య.


గాంధ మలయజ మంటిన కట్టె కైన

పరిమ ళమ్ములు నబ్బును బరగ నవని

మంచి వారల మైత్రిని మనుజు డెపుడు

ఉత్త ముడుగాను మారును నుర్వి నందు.


అంత రమ్ములు జూడక ఆద రించి

అటుకు లైనను మెసవెను అచ్యు తుండు

సఖుని ప్రేమకు లొంగెడి స్వామి నాడు

నేడు జూడగ గలమొకో నిఖిల మునను.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 8.6.2026

కామెంట్‌లు లేవు: