"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

05 జూన్, 2026

బొట్టు లేని చెల్లి ముఖం ( కవిత)

  బొట్టు లేని చెల్లి ముఖం ( కవిత)


చెల్లి ముఖం మీద

ప్రతి రోజూ ఉదయించే

కొత్త ఆశల సూర్యుడిలాంటి బొట్టు

కనిపించకుండా ఎలా చూడాలి...?


అది 

ఇద్దరి కలలతో వెలిగిన

ఇంటి గుమ్మం ముందు వేలాడే దీపం.


ఇప్పుడు ఆ బొట్టు లేకుండా 

చెల్లిని చూడ్డమంటే

పౌర్ణమి ఆకాశంలో

చంద్రుణ్ణి తుడిచేసి చూసినట్టుంది.


ఎప్పుడూ

ఆ బొట్టు ఆమె నవ్వుకి మధ్యలో వెలిగే

ఎర్రని ఉదయ సూర్యుడిలా ఉండేది.

ఇప్పుడు

ఆకాశమే ఉన్నా

ఉదయం రాకపోయినట్టుంది.


ఆమె నుదుటి ఖాళీని చూస్తుంటే

ఎవరో కాలాన్ని తీసుకొచ్చి

జీవితం మధ్యలో

నల్లగీత గీసినట్టుంది.

డా.దార్ల వెంకటేశ్వరరావు 28.5.2026.

….

My Sister's Face Without the Bindi



On my sister's face,

the bindi that rose every day

like the sun of new hopes—

how can I bear to see it missing?


It was not merely a mark;

it was the lamp hanging at the doorway

of a home illuminated

by the dreams of two hearts.


Now, to look at my sister

without that bindi

is like gazing at a full-moon sky

after the moon has been erased.


That bindi always shone

at the center of her smile

like the red sun of dawn.


Now,

though the sky remains,

it feels as if morning

has never arrived.


As I look at the emptiness

upon her forehead,

it seems as though someone has brought Time itself

and drawn a black line

across the middle of life.


Dr. Darla Venkateswara Rao

28.05.2026


కామెంట్‌లు లేవు: