"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

12 మే, 2026

ఆమె…ప్రాణాల్ని నిలబెట్టే దేవత!

 ఆమె…ప్రాణాల్ని నిలబెట్టే దేవత!



మానిటర్‌పై కదిలే గీతలు

రోగి గుండె చప్పుళ్లు కాదు

ఆమె జాగరణకు గీసిన నిశ్శబ్ద సంతకాలు.


ఆసుపత్రి గోడల మధ్య

నిశ్శబ్దం కూడా ఒక భాషగా మారే చోట

నొప్పి అరుపులను

స్పర్శతో అనువదించే చేతులుంటాయి.

ఆ చేతులే నర్సులు.

వారి అడుగులు

వార్డు నేలపై మెల్లగా పడతాయి

కానీ

ఆ అడుగుల వెనుక

ఎన్నో ప్రాణాల ధైర్యం నడుస్తుంటుంది.

రాత్రి అంతా

నిద్రలేని కళ్లతో

ఒక రోగి ఊపిరి చప్పుడు వింటూ

తమ అలసటను 

సెలైన్ బాటిల్ ని చూస్తూనే గడిపేస్తారు

ఒక చిరు నవ్వుతో

భయపడుతున్న రోగికొక

తల్లిలా, చెల్లిలా  సేవచేస్తారు

ఒక మృదువైన మాటతో

చివరి దశలో ఉన్న వృద్ధుడికి

బతకాలని ఆశగా మారతారు.

వాళ్ళకి

రోగి ఒక కేస్‌షీట్ కాదు

ఒక  మనిషి…బ్రతించాల్సిన మనిషి

ఒక కుటుంబం.

ఒక ఎదురు చూపు.


డాక్టర్ మందు రాస్తే

ఆ మందుకు మానవత్వం కలిపేది వాళ్ళే

గడియారం

సమయాన్ని మాత్రమే కొలుస్తుంది

కానీ

నర్సు సేవ

ప్రాణాల విలువనే కొలుస్తుంది.

ఆమె కేవలం వైద్య సిబ్బంది కాదు

తెల్లని దుస్తుల్లో నడిచే

ఒక ఓర్పు.

ఒక ధైర్యం.

ఒక మౌన కరుణ.

ఒక దేవత!

ప్రాణానికీ  మరణానికీ మధ్య

సన్నని వంతెనలా నిలబడి

మనిషిని మనిషితో కలిపే

ఒక వాత్సల్యం!

ఆమె

ఆసుపత్రి అనే సముద్రంలో

దారి తప్పిన ప్రాణాలను

తీరానికి చేర్చే దీపస్తంభం.

ఆ చేతి స్పర్శ రోగికో ధైర్యం

ఆమె పెదవుల నుండి వచ్చే ఆ మాట 

ఆయుష్షును పెంచే అమృత గుళిక!


వైద్యం శాస్త్రమైతే

సేవ దాని హృదయం.

ఆ హృదయానికి

తెల్లని రూపమే నర్సు!


(అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలతో)


— ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

12.5.2026.


కామెంట్‌లు లేవు: