"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

01 మే, 2026

నా నీడ నాతో మాట్లాడిన రోజు

 నా నీడ నాతో మాట్లాడిన రోజు



ఈ ఉదయం
నా నీడ ముందే లేచింది
నేను ఇంకా అలసటలోనే ఉన్నా
అది పనిముట్ల వైపు నడిచింది.

గోడపై వేలాడుతున్న గడియారం
నా గుండెతో తగువాడింది—
“ఆగకు” అని అది కొట్టుకుంటే
“ఆగాలి” అని నా శరీరం పలికింది.


నేను ఒక దీపస్తంభం
నాలోనే నూనెగా కరుగుతున్నాను,
వెలుగై ఇతరుల దారిని చూపిస్తున్నాను.
కానీ నా అడుగుల చుట్టూ
చీకటి ముసురుకుంటూనే ఉంది.

ఇనుప మోతల మధ్య
నా ఆలోచనలు చెల్లాచెదురై
ముక్కలైన అద్దంలా
నా ముఖాన్నే నన్ను అడుగుతున్నాయి
“నీవెవరవు?” 

చెమట చుక్క
నుదుటిపై నుంచి జారిపడేలోపే
అది జ్ఞాపకమవుతుంది
నిన్నటి కష్టం,
రేపటి ఆశల మధ్య చిక్కుకున్న
ఒక క్షణం.

మేడే
నాకు సెలవు కాదు,
నా నీడతో కూర్చుని
నన్ను నేనే వినే ఓ విజయతీరం.

– ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 1.5.2026

The Day My Shadow Spoke to Me


This morning,

my shadow woke before I did.

While I was still wrapped in fatigue,

it walked toward the tools of labor.


The clock hanging on the wall

argued with my heart—

it kept beating, saying “Don’t stop,”

while my body whispered, “I must.”


I am a lighthouse,

melting within myself like oil,

becoming light

to guide others on their way.

Yet around my own footsteps,

darkness keeps gathering.


Amid the clang of iron,

my thoughts scatter apart;

like a shattered mirror,

my own face asks me,

“Who are you?”


Before a drop of sweat

can slip from my forehead,

it turns into a memory—

a moment trapped

between yesterday’s hardship

and tomorrow’s hopes.


May Day

is not a holiday to me;

it is a shore of triumph

where I sit with my shadow

and finally listen to myself.


— Prof.Darla Venkateswara Rao, 1.5.2026


కామెంట్‌లు లేవు: