"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

01 మే, 2026

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే –2026)

 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే –2026)


తే.గీ.

లోకమునకెల్ల నాధార లోకచరిత

కష్టజీవుల చెమటయే ఘనత నిచ్చు

మే దినమ్మున వారల మెచ్చ వలెను

శ్రమయె వెలుగును నిచ్చును జగతి కంత


తే.గీ.

పుడమి నిలుచును కార్మిక భుజము పైన

గోడ నిలుచును గట్టిగ గూడు నట్లు

శ్రమయె దైవము సకలార్థ సాధనమ్ము

మేటి దినమున గౌరవ మీయ వలెను


తే.గీ.

శ్రమయె జగతికి మూలమై శాంతి నిచ్చు

కూలి జనుల చెమటలచే కుదురు నిలుచు

హక్కు లందున పోరాడి హర్ష మొందు

మేటి దినమిది మేలును మెచ్చ వలయు.



తే.గీ.

పోరు సలిపెడు వారల పొగడ వలయు

శ్రమను నమ్మిన జనులకు శాంతి కలుగు

కార్మి కులయొక్క కష్టమె కల్ప తరువు 

మేటి దినమిది మేటిగ మెరయు నెపుడు 



తే.గీ.

దీపమున్నచో వెలుగులు దేరు నట్లు

శ్రామికుండున్న జగతికి శక్తి కలుగు

చెమట చిందించ సృష్టియే చిత్రమగును

మేటి దినమున వారల మెచ్చవలయు



తే.గీ.

పాలు ఉన్నచో వెన్నయే పరగు నట్లు 

శ్రమయు ఉన్నచో సంపదల్ సాగు చుండు

 కష్ట జీవుల చెమటయే కల్ప తరువు

 మేటి దినమున మేలును మెచ్చ వలయు



తే.గీ.

విత్తు ఉన్నచో వృక్షము వెలయు నట్లు 

శ్రామి కున్నచో సృష్టియే సాగు నెపుడు

 శ్రమయె దైవము సకలార్థ సాధ నమ్ము

 మేటి దినమున మేటిగ మెరయు నెపుడు 



తే.గీ.

పాలు ఉన్నచో వెన్నయే పరగు నట్లు

శ్రమయు ఉన్నచో సంపదల్ సాగు చుండు

కష్ట జీవుల చెమటయే కల్ప తరువు

మేటి దినమున మేలును మెచ్చ వలయు



తే.గీ.

వేరు ఉన్నచో వృక్షము వెలయు నట్లు 

కూలి ఉన్నచో కోటిగా కుదురు నిలుచు 

శ్రమయె దైవము సకలార్థ సాధ నమ్ము

 మేటి దినమున మేలును మెచ్చ వలయు



తే.గీ.

అలలు ఉన్నచో నంబుధి వెలయు నట్లు

 శ్రమయు ఉన్నచో సర్వము సాగు చుండు 

శ్రామి కోన్నత పరులకే శాంతి కలుగు 

మేటి దినమిది మేటిగ మెరయు నెపుడు 



తే.గీ.

వాన ఉన్నచో వసుధపై వరియు పండు

 శ్రమయు ఉన్నచో సౌఖ్యముల్ సాగు చుండు 

కష్ట జీవుల చెమటయే కల్ప తరువు

 మేటి దినమున మేలును మెచ్చ వలయు.


తే.గీ.

భాను డున్నచో భాసిల్లు భాను తేజ

శ్రామి కున్నచో సౌఖ్యము శ్రామి కునకు

శ్రమయె వెలుగును శాశ్వత శ్రమయె జయము

మేటి దినమిది మేటిగ మేలు నిడును


తే.గీ.

విత్తు ఉన్నచో వృక్షము వెలయు నట్లు 

కూలి ఉన్నచో కోటిగా కుదురు నిలుచు

 శ్రమయె దైవము సకలార్థ సాధ నమ్ము 

మేటి దినమిది మేటిగ మెరయు నెపుడు  



ఆ.వె.

చేతి కండ రముల చెమటయే చిందించ

లోక మంత నిలుచు లోతు గాను

ఘనత గాంచె నిచట గౌరవ మందుచు

వంద నములు వారు వరుస తోడ 


ఆ.వె.

శ్రామి కులకు జేయ సకలార్థ వందన

మవని నిలుచు వారలండ తోడ

శ్రమయె దైవమనుచు సాగెడి వేళల

జగతి వెలుగు నిచ్చు జయము తోడ


 – ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 1.5.2026


కామెంట్‌లు లేవు: