"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

03 మే, 2026

పత్రికా స్వేచ్ఛా దినోత్సవం-2026

 పత్రికా స్వేచ్ఛా దినోత్సవం

 (World Press Freedom Day


లోకమందున జరుగుటె ల్లోకమందు

పత్రికలు జూపు గన్నుల భవ్య రీతి

సత్య వాక్కును వెలుగించు సమయ మిదిగొ

ప్రగతి బాటల నడుపును ప్రాజ్ఞు లెన్న!


భీతి బాసియు నిజమును భీష్మ రీతి

చాటి చెప్పెడి కలమున చాకచక్య

మొప్పు గలిగిన పత్రిక లున్న చోట

న్యాయమనెడిది వెలుగును నలు దిశలను!


అక్షరమ్మె ప్రచండమౌ ఆయుధమ్ము

అవని లోపల వెలుగెడు నధిక శక్తి

కలమునందున దాగున్న కడిమి జూడ

ప్రజల పక్షాన నిలుచును ప్రగతి గనగ.


నిజము దాచక లోకాన నిలచి యుండి

వార్త లన్నియు దెలిపెడి వారు నేడు

సత్య మార్గము వీడక సమత తోడ

ప్రజల మేలును గోరుచు ప్రబల వలెను!


లోక హితమును గోరెడి లోగిలిదిగొ

ప్రజల నాలుక యనదగు ప్రక్రియలివి

న్యాయ రక్షణ జేసెడి నమ్మకమ్ము

పత్రికా స్వేచ్ఛ జగతికి ప్రాణ మగును!


కలము పట్టిన యోధులు కదన మందు

నిలిచి గెలిచెడి ధీరులు నిశ్చయముగ

కినుక తోడను తప్పుల గెలుచు వారు

ధర్మ రక్షణ జేయగ ధన్య మగును


లోక వృత్తము దెల్పుచు రూఢిగాను

సత్య మార్గము జూపుచు సాగుచుండు

జాతి గౌరవమును నిల్పు జగతి యందు

పత్రికా స్వేచ్ఛయే కదా ప్రాణమౌను!



వార్త లందున సత్యము వరుస నిలిపి

ప్రజల పక్షాన నిరతము ప్రశ్న వేసి

న్యాయ మెప్పుడు కాపాడు నమ్మకముగ

పత్రికా స్వేచ్ఛ రాజ్యమున్ ప్రబల జేయు.


చీకటిని చీల్చు వెలుగుల చిత్రమగుచు

నీతి మార్గము దెల్పుచు నిరతమందు

అర్క బింబము వోలెను నవని యందు

పత్రికా స్వేచ్ఛ భాసిల్లు ప్రగతి నిడగ.



ఎల్ల ప్రజలకు కన్నుగా నిలచి యుండి

ఏలు వారల తప్పుల - నెత్తి జూపి

స్వేచ్ఛ గలిగిన వార్తలే - క్షేమ మొసగు

లోక చైతన్య దీప్తియే - లోక మమ్మ.


ఖడ్గ ధారల కన్నను గరిమ గలిగి

అక్షరమ్ములు ఆయుధ మ్మవగ నిలచి

దుష్ట శిక్షణ జేయుచు పావనముగ

పత్రికల స్వేచ్ఛ నిలుపును ధరణి శాంతి.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

3.5.2026

కామెంట్‌లు లేవు: