ప్రపంచ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు!
(ప్రతి ఏటా మే నెలలో మొదటి ఆదివారం.)
కం.
నవ్వులె వెలుగులు జగమున
నవ్వులె సిరిసంపదలును నయముగ చూడన్
నవ్వుట నైజము గావలె
నవ్వుల తోడనె జయించు నరుడును దార్లా!
కం.
నవ్వులె మనిషికి ధనమును
నెవ్వరి నైనను మురియుచు నింపుగ జేయున్
నవ్వుటె యోగము ధరలో
నవ్వుచు గెలువగ నవకము నందవె దార్లా!
కం.
చిరునవ్వులె ఇల వెలుగులు
పరులన్ నవ్వుచు నడపగ పదమున నిచ్చున్
మరువక నవ్వుము నెప్పుడు
పరగుచు నవ్వున గెలువగ పసనగు దార్లా!
కం.
నవ్వుటె మనిషికి అందము
నవ్వుల నడచెడి పనులును నలమును నిచ్చున్
నవ్వులె ధైర్యము నిచ్చును
నవ్వుచు గెలువగ వశమగు నమ్మగ దార్లా!
కం.
నవ్వులె ధైర్యము నిచ్చును
నవ్వుల నడచెడి పనులును నలమును నిచ్చున్
నవ్వుటె మనిషికి అందము
నవ్వుచు గెలువగ వశమగు నమ్మగ దార్లా!
కం.
నవ్వుట నలుబది రోగము
లివ్వున నశియించు దనువు నింపగు నెపుడున్
నవ్వుము నవ్వించు జగము
నవ్వుల పువ్వులనుజల్లు నయముగ దార్లా!
కం.
నవ్వుచు పలికిన మాటలు
నవ్వుచు నడచెడి పనులును నలమును నిచ్చున్
నవ్వులె నందన వనమున
నవ్వులు రువ్వెడి సుమములు నవకము దార్లా!
కం.
నవ్వులె మనకును రక్షలు
నవ్వులె కైవల్య పదము నయముగ చూడన్
నవ్వుటె యోగము ధరలో
నవ్వులు చిందగ జయమును నందవె దార్లా!
కం.
నవ్వుచు బ్రతికెడి మనిషికి
నవ్వుచు దీవించు నెపుడు నలువయు భువిలో
నవ్వుటె గొప్పదగు ధనము
నవ్వుల తోడనె సుఖమును నందవె దార్లా!
నవ్వులె మనిషికి ధనమును
నెవ్వరి నైనను మురియుచు నింపుగ జేయున్
నవ్వుటె యోగము ధరలో
నెవ్వగ నవ్వుచు గెలువగ నెలవగు దార్లా!
కం.
నవ్వుచు సాయము జేయగ
నవ్వుచు దీవించు నెపుడు నరుడును సుమతీ
నవ్వులె నయముగు మందులు
నవ్వులె శాంతికి నిలయము నమ్మగ దార్లా!
కం.
నవ్వని ముఖమున కాంతియు
నవ్వని హృది యందు శాంతి నానాటికగున్
నవ్వుటయే యోగము సుమి
నవ్వులు చిందేటి బ్రతుకు నందన వనమే.
నవ్వులె వెలుగులు ధరలో
నవ్వుల నడచెడి పనులును నలమును నిచ్చున్
నవ్వుటె మనిషికి అందము
నవ్వుచు గెలువగవశమగు నమ్మగ దార్లా!
ఆ.వె.
నవ్వు మనిషి కొసగు నవకాంతి రేఖలు
చింత నణచివేసి చెంత జేర్చు
నవ్వు లేని బ్రతుకు నడి సంద్రమున నావ
నవ్వు నవ్వుమయ్య నరుడ నీవు.
తే.గీ.
నవ్వు చిందించ ముఖమున నవకమబ్బు
నవ్వు లేకున్న బ్రతుకది నట్టడవియె
నవ్వు నలుగురి జేర్చును నమ్మకముగ
నవ్వులే గద మనిషికి నవనిధులును.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 3.5.2026
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి