"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

27 ఏప్రిల్, 2026

లక్ష్యమే నీ జీవితం! (కవిత)

 లక్ష్యమే నీ జీవితం!


పక్షి ఆకాశాన్ని ప్రేమిస్తుంది

అది ఏ ఒక్క మేఘానికో మాత్రమే 

బంధీ కావడం లేదు.

అది ఎగిరేది ఒక చెట్టు కోసం కాదు

దూరాన కనిపించేతన గమ్యం కోసం.


నది ఒక రాయిని తాకి అక్కడే ఆగిపోదు.

ఎన్ని మలుపులు వచ్చినా

సముద్రమనే లక్ష్యాన్ని

మనసులో మోస్తూనే ఉంటుంది.


విత్తనం మట్టిలో పడినప్పుడు

చీకటిని ద్వేషించదు.

తనలో దాగిన చెట్టునే నమ్ముతుంది.


లక్ష్యంతో జీవించే మనసు

దీపంలా ఉంటుంది.

గాలి వీచినా

మళ్ళీ వెలిగే ప్రయత్నం చేస్తుంది.


వ్యక్తులు మారవచ్చు,

వస్తువులు కనుమరుగవచ్చు,

లక్ష్యం మాత్రమే

మనిషిని లోపల నుంచి నిలబెడుతుంది.

ఒక చెట్టు ఆకాశాన్ని ముద్దాడాలంటే

ముందు వేర్లు తన నేలలోకి వెళ్లాల్సిందే!

డా.దార్ల వెంకటేశ్వరరావు 27.5.2026

Your Goal is Your Life!


A bird loves the sky,

but it does not become

a prisoner to a single cloud.

It flies not for one tree,

but for the destination

it sees far away.


A river does not stop

just because it touches a rock.

No matter how many turns it takes,

it continues to carry

the ocean as its goal

within its heart.


When a seed falls into the soil,

it does not hate the darkness.

It believes in the tree

hidden within itself.


A mind that lives with a goal

is like a lamp.

Even when the wind blows,

it keeps trying

to shine again.


People may change,

things may disappear,

but only a goal

can strengthen a person

from within.


If a tree wishes

to kiss the sky,

its roots must first

go deep into the earth.


— Dr. Darla Venkateswara Rao

27.05.2026

కామెంట్‌లు లేవు: