"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

24 ఏప్రిల్, 2026

రక్తం మాట్లాడే నిశ్శబ్దం.

 రక్తం మాట్లాడే నిశ్శబ్దం.



ఒకే చెట్టు కొమ్మలన్నీ

ఒకే దిశగా పెరగవు

ఒకటి ఆకాశం వైపు వంగితే

మరోటి నేలవైపు నీడ పంచుతుంది.

కానీ కొమమ్మలన్నీ చెట్టుకే

అంటిపెట్టుకొనుంటాయి

ఒకే గూటిలో పెరిగిన పక్షులైనా

ప్రతి రెక్క గాలి తాకిడిని

వేరువేరుగా అర్థం చేసుకుంటుంది.


ఒకడు

నదిలా నిశ్శబ్దంగా ఉంటాడు…

మరోడు

అలల్లా ఆవేశంగా ఉప్పొంగుతాడు…

ఇంకొకడు

వానచినుకులా మృదువుగా పలుకుతాడు…

మరొకడు

మెరుపులా మాటలు విసురుతాడు.


అందుకే

ఒకే తల్లి గర్భం

ఒకే స్వభావాన్ని పుట్టించకపోవచ్చు

ఒక ఆకాశం

భిన్న గర్జనలు చేసినట్లే!



ఒక కొమ్మ విరిగితే

మొత్తం చెట్టే వణుకుతుంది.

ఒక పక్షి గూటికి రాకపోతే

మిగిలిన రెక్కలన్నీ

ఆకాశాన్నే అనుమానంగానే చూస్తాయి.


ఒకరి కంట్లో నీళ్ళు మెదిలితే

మరోకరి గుండెలో

కనిపించని గాయమేదో

తెరుచుకుంటుంది.


బయట ప్రపంచానికి

వాళ్లు వేర్వేరు మనుషుల్లా కనిపించవచ్చు…

కష్టం అనే తుఫాను వచ్చినప్పుడు

అన్నీ ప్రవాహాలు

ఒకే సముద్రంగా మారిపోవడమే

వాళ్ళని కలిపే మంత్రం


అదే

రక్తం మాట్లాడే నిశ్శబ్దం.


— ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 

24.5.2026.


The Silence Spoken by Blood


Not every branch

of the same tree

grows in the same direction.


One bends toward the sky,

another leans down

to offer shade to the earth.

Yet every branch

remains bound to the same tree.


Even birds raised

in the same nest

understand the touch of the wind

in different ways.


One brother

flows silently like a river…


Another

surges with fury like waves…


One speaks gently

like raindrops…


Another

throws words like lightning.


That is why

the same mother’s womb

may not give birth

to the same nature—

just as one sky

can roar in many different voices.


But when one branch breaks,

the whole tree trembles.


If one bird

does not return to the nest,

the remaining wings

begin to doubt the sky itself.


When tears gather

in one person’s eyes,

an unseen wound

opens

inside another’s heart.


To the outside world,

they may appear

as different individuals…


But when the storm called hardship arrives,

all streams

become one ocean.


That invisible force

that binds the

m together—

that is

the silence spoken by blood.


— Prof. Darla Venkateswara Rao

University of Hyderabad

24.5.2026

కామెంట్‌లు లేవు: