ప్రపంచ క్రీడా దినోత్సవం 2026
శాంతి మార్గము చాటెను సకల జగతి
క్రీడ లాడుచు కీర్తిని గడన చేయు
భార తీయుల భాగ్యము పెరుగు చుండు
నిత్య ముత్సాహ నిధియును నిలచు నపుడు
ఆట లాడిన అదియును ఆయు వొసగు
కాయ కష్టము కలిగిన కండ పెరుగు
గెలుపు పొందిన గెలుచును గెలుపు నిచ్చు
ఓట మైనను ఒప్పుగ ఓర్వ వలెను
వేగ మున్నది విజయము వెతుకు నపుడు
ఆట పాటల అలసట ఆగి పోవు
దేహ దార్ఢ్యము దేవత దీప్తి లాగ
ధన్య మవునుగ ధరణిని దైవ మెంచ.
పట్టు వీడక పనినిట పలక వలెను
లక్ష్య శుద్ధితో లఘువుగ లలిత మగును
విశ్వ మంతట విందుగ విస్త రించు
ఖ్యాతి నొందును క్రీడయు ఖరము గాను.
సాటి లేనట్టి సత్తువ సాగ జేయు
మేటి వీరుల మెప్పును మెరవ జేయు
ఐక్య మత్యము నమితమై అలరు నపుడు
జయము కలుగును జగతిలో జవము తోడ.
ప్రకృతి తోడను ప్రాణము పలక వలెను
ఆట లాడుచు నిచ్చెడి ఆయు వొసగు
ప్రజల కందరి కిప్పుడు ప్రబల మగుచు
క్రీడ దినమున కీర్తిని క్రియను బెంచు.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 6.4.2026
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి