తే.గీ.
కాన్షిరాముడు వెలిగెను క్రాంతి వలెను
బహుజనాళికి దారిని బాటచూపె
మేలు కొనగను లోకము మేటి గాగ
నెనరు పొంగును నమృతంపు నిలయ మగుచు!
తే.గీ.
బహుజ నాళికి నేడును భాగ్య మబ్బె
నేను గెక్కియు రాజ్యము నేల వలెను
అణచి వేసిన శక్తుల నాప వలెను
విజయ పథమున నేడును విభుడు గాగ!
ఆ.వె.
నీలి జెండ పట్టి నిఖిలమ్ము దిరిగెను
బానిసత్వ మికను బాసి పోవ
దళిత లోక మపుడు ధైర్యమ్ము బొందెను
జయము గలిగె నేడు జగతి యందు!
కం.
ఓటును జూపెను మనకును
మాటలు నేర్పెను నలరిన మమతలు మీరన్
చాటెను హక్కుల విలువను
బాటలు వేసెను జెలగగ భరతము నందున్!
కం.
మనమున కాన్శిని దలపగ
ధనమును నొసగెను మదినిని ధర్మము మీరన్
వినయము నేర్పెను మనకును
తనవున నింపెను జలదము తపనను నెపుడున్!
ఆ.వె.
ఓటు హక్కు విలువ చాటెను జగమంత
రాజ్య మేల వలెను రమ్య గుణము
బహుజ నాళి కెల్ల భాగ్య మబ్బునిజము
హాయి నిండె నెదను అమృత ముగను!
ఆ.వె.
కులము ఉన్న వరకు కులమునే వాడాలి
ప్రజల మేలు కొరకు బాట వేయ
అడ్డు తగిలినంత అంతము చేయాలి
పిలుపు నిచ్చె కులము కలుపు తీయ!
కం.
ఖవసను పురమున బుట్టెను
భువిని మహానీయుడైన బుధజన నుతుడై
అవనిని బహుజన రాజ్యము
జవమున స్థాపించె నాడు జయమును గొనగన్!
కం.
ధరలో కాన్శియు వెలిగెను
స్థిరముగ నిలిచెను పడపున సిరినిని నిడగన్
కరమున తాళము నిచ్చెను
సురలగు జూడగ జెలగగ సుఖమును నిడగన్!
తే.గీ.
ఖవసు పురమున జన్మించి ఘనుడు యతడు
బహుజనులజాతి బానిస బతుకు మార్చ
నడుము బిగియించె నవయుగ నడత తోడ
అతడె కాన్షిరామ్ బహుజన భాగ్య మతడు!
తే.గీ.
ఓట్లు మావని -లాగుచు -ఓర్పు తోడ
చీకటిని బాపి -జేసెను -చిరున గవుల
రాజ్య మధికార -మేరాజ -రాహ వంచు
బాట జూపెను -బహుజన -బలము తోడ!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి