"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

13 మార్చి, 2026

స్వర్గం..నరకం

 స్వర్గం..నరకం

తనువున ప్రాణముగలిగిన

కనుగొనలేడెవడు పరము గాఢత తోడన్

మనసున నమ్మిన కలుగును

కనరానిది దైవ శక్తి కానగ నౌరా!


పువ్వునందు తావి పొడగాన వచ్చునా?

పాలయందు నెయ్యి బయట పడున?

నమ్మికొన్న కలుగు నారాయణుని కృప

నమ్మకున్న లేదు నరుని కటులె!


మంచి పనులనె చేయుట మమత తోడ

స్వర్గ లోకపు సౌఖ్యముల్ సాధ్యమౌను

చెడును తలచిన నరకాన చిక్కుకొనును

ఇదియె సత్యము తెలుసుకో ఇల తలంచి!


చేయు ప్రతి కర్మ కలుగును చెందదగిన

తగిన ఫలితము కార్యముల్ తలచు నెడల

ప్రకృతి నియమము మారుట పలక బోదు

దారి చూపించు నట్టిది దార్ల మాట!


నమ్ముకున్నను దైవము నమ్మికొకటె

నమ్మకున్నను తర్కమే నడక యగును

చేయు కర్మల ఫలితము చెంతనిలుచు

దారి చూపించు నట్టిది దార్ల మాట!


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 13.3.2026


కామెంట్‌లు లేవు: