"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

23 మార్చి, 2026

ప్రపంచ జల దినోత్సవం - 22.3.2026

 

ప్రపంచ జల దినోత్సవం - 2026

 

మన బాధ్యత జలరక్షణ

మన రేపటి తరము కొరకు మనమున దలపన్

మనమున నెంచక యున్నను

మన మనుగడ కష్టమౌను మహినిని దార్లా

 

జలమే జగతికి జీవము

జలమే నల రారు సకల సౌఖ్యము ధరలో

జలమును పూజించినచో

నలరును జల ములతొ లోక మవనిని దార్లా!

 

నీటిని వృధా గ జేయకు

నీటికి నల రారు విలువ నెమ్మది నెరుగున్

నీటిని కాపాడినచో

నీటిని జల మదియు నిన్ను నిలుపును దార్లా!

 

నీరే జీవుల కాధా

నీరే వసుధకును రూప నిలయము నెన్నన్

నీరే ప్రాణము ధరలో

ధారగ జల మదియు లేక దక్కరు దార్లా!

 

నీరే సిరులని నమ్ముము

ధారల నొలకగను జేయ తగదిక ధరలో

నీరే లేనియెడల నీ

ధారల జల మదియు దొరక దవనిని దార్లా

 

నీరే రేపటి భాగ్యము

నీరే జలధార యగుచు నిలచును ధరలో

నీరే జీవపు నాడిగ

ధారల నల రారుచుండ దాచుము దార్లా

 

నీరే సకలము జగతికి

నీరే లేకుండ నెండ నిలయము నెన్నన్

నీరే కరుణగ గురియగ

ధారల జల మదియు పంట ధరణిని దార్లా!

 

నీరే సిరులని నమ్ముము

నీరే లేకుండ నెండ నిలయ మగు ధరన్

నీరే జీవపు నాడిగ

ధారల జల మదియు దాచు ధరణిని దార్లా!

 

నీరే రేపటి భాగ్యము

నీరే జలధార యగుచు నిలచును ధరలో

నీరే ప్రాణాధారము

ధారల నల రారుచుండ దాచుము దార్లా

 

నీరే సకలము జగతికి

నీరే లేకుండ నెండ నిలయమగు ధరన్

నీరే కరుణగ గురియగ

ధారల నల రారు పంట ధరనగు దార్లా!

 

నీరే ప్రాణము ధరలో

నీరే లేకుండ నెండ నిలయమగు ధరన్

నీరే కరుణగ గురియగ

ధారల జల మదియు తల్లి దయయగు దార్లా!

 

నీరే భాగ్యము ధరలో

నీరే లేకుండ నెండ నిలయమగు ధరన్

నీరే దీపపు వెలుగుగ

ధారల జల మదియు జూడ దగవును దార్లా!

 

నీరే జీవపు నాడిగ

నీరే లేకుండ నెండ నిలయమగు ధరన్

నీరే దేహపు టాత్మగ

ధారల జల మదియు దాచు ధరణిని దార్లా!

 

నీరే జీవుల కాధా

నీరే కలుషితమవగను నిలవదు ధరలో

నీరే కంటికి నలుసుగ

ధారల మలినము దగదుర ధరణిని దార్లా!

కామెంట్‌లు లేవు: