"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

27 మార్చి, 2026

ప్రపంచ రంగస్థల దినోత్సవం - 2026

 ప్రపంచ రంగస్థల దినోత్సవం 



వేష భాషల మార్చియు వింత గొలిపి

పాట పద్యాల భావాల పండ జేసి

కళ్ళెదుట నిల్పు పాత్రల కమ్మ నటన

మరపు రానిరంగస్థల మహిత కళయు!


వేదిక ప్రాణము కళయే

మోదముతోనటనచేయు మూర్తిని నిల్పున్

సాధన సేయుచు కళకై

బోధించును నీతి నిజము భువిలో నెపుడున్!


నటనల నొసగుచు లోకము

నటరాజుని రూపమొసగి నవరసములతో

ఘటియించు రంగమేగా

పటుతరమౌ సత్య శాంతి భాసిలు నెపుడున్!


నటనలె పుడమికి రకములు

నటరాజుని నాట్యమయమె నవరసములతో

పటముగ లోకపు రీతుల

నటరంగానొకటె చూపు నైపుణి 'దార్లా!

నవ్వులాటలైన, నమ్మలేని వ్యధైన

పాత్ర ధరణ సేయు పరిణతినిది

తెరలు పడగ నికను దేహమే మిగిలును

విశ్వమంతమాయ! వినుర దార్ల!


నవ్వులాట లైన నమ్మరాని వ్యధలు

పాత్ర ధరణ సేయు ప్రజ్ఞ తోడ

తెరలు పడగ నికను దేహమే మిగిలును

విశ్వమంతమాయ! వినుర దార్ల!


రాజు వేషమెంత, రౌద్రము ఇంకెంత

బంటు వేషమెంత, భయములెంత

రంగమొదిలి పోవ రంగులే మిగిలును

విశ్వమంతమాయ! వినుర దార్ల!


నిత్య జీవితాన నటియించు చుందురు

మనుజు లంద రిచట మమత తోడ

సత్యమరసి చూడు సకల లోకములందు

విశ్వమంతమాయ! వినుర దార్ల!


ఆట ముగియు వేళ హారతు లిత్తురు

కథల తీరు మారు కౌశలమున

మట్టి బొమ్మలమిది మాటలే నిజమౌను

విశ్వమంతమాయ! వినుర దార్ల!


ఆట ముగియు వేళ హారతులిత్తురు

కథల తీరు మారు కౌశలమున

మట్టి బొమ్మలమిది మాటలే నిజమౌను

విశ్వమంతమాయ! వినుర దార్ల!


వేషధారి వచ్చి వేదిక నెక్కియు

నటన సేయునచట నవ్య రీతి

కాలమెల్ల నొకటె కానరా దిలలోన

విశ్వమంతమాయ! వినుర దార్ల!

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 27.3.2026

కామెంట్‌లు లేవు: