"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

07 ఫిబ్రవరి, 2026

షుగర్ బాగా తగ్గిపోయిన రాత్రి..


చక్కెరయు తగ్గి పోయెను చౌకగాను

శక్తి యుడిగెను దేహాన శాంతి కరువై

కళ్ళు తిరిగెను లోకము కారు చీక

టయ్యె; ప్రాణము పోవునన్ టంచు తోచె.


ఓర్చుకొంటిని నాడు నే నోర్పు తోడ

నేడు తట్టుకో లేకను నెమ్మదిగను

వశము దప్పిన గాత్రము వరుస జూడ

భీతి నొందితి నెంతయు భీకరముగ.


ఏమి జరుగ నున్న దెరుగ లేని స్థితి

కాల మాయె నంచు కలత చెంది

ఒంటరితన మందు ఓటమినినిజూడ

ఆవిరయ్యె ధైర్య మంత నిపుడు.


తల్లడిల్లిన మనసును తేర్చు కొనుచు

మెల్ల మెల్లగ ధైర్యము మేలు కొలిపి

వైద్యు సాయము గోరుచు వరుస లోన

మరల నూపిరి పీల్చితి మహిని నేడు.


తెలివి దప్పెడి వేళను తెగువ తోడ

ప్రాణ రక్షణ కొరకై పరుగు పెడితి

దైవ చింతన మదిలోన ధైర్యమిచ్చె

మరల గంటిని లోకము మహిని నేడు.


చక్కెరయును తగ్గి చావును జూపించె

కడుపు లోన నొప్పి కలత బెట్టె

ప్రాణ వాయు వపుడు పరుగెత్త జూడగ

భీతి నొంది నాదు భీష్మ మనసు.


ఔషధమ్ముల సాయాన అదుపు లోన

చక్కెరయు వచ్చె నిపుడు చక్కగాను

నిన్న రాత్రిని గడపితి నిద్ర లేక

మృత్యు ముఖమును జూచిన మనిషినవుచు.


దేహ బలము తగ్గు దీనత్వ మునుజూడ

పథ్య లోమందు నేడు పట్టు దొరికె

చింత జేయ వలయు చెచ్చెర నెప్పుడు

మేలు నొంద మనము మేటి గాను.


కష్ట కాలము దాటెను కరుణ తోడ

ధైర్య మొక్కటె మనకును ధైర్య మిచ్చు

కాయ కష్టము చేయుచు కలత వీడి

సుఖము పొందెద నిక పైన సుగుణ శీల!

- దార్ల వెంకటేశ్వరరావు 
7.2.2026
( నిన్న రాత్రి 6.2.2026 షుగర్ బాగా లో కి పడిపోయినప్పుడు కలిగిన ఆలోచనలు)

కామెంట్‌లు లేవు: