కొంతమంది మన పట్ల చూపే ఆప్యాయతను రాగాలు… మనం చూపే ప్రేమాభిమానాలు…తెలియకుండానే ఒక ఆత్మీయానుబంధాలవుతాయి. నేను టీచింగ్ లోకి వచ్చిన తర్వాత ఎంతో మంది విద్యార్థులను చూశాను వాళ్ల వ్యక్తిగతమైన తెలిసిన తర్వాత కొంతమంది పట్ల ఎనలేని ఆత్మీయానుబంధాలు పెరుగుతాయి. అలాగే మనల్ని కూడా ఆ విద్యార్థులు అంతగా అభిమానిస్తారు. కొంతమంది తండ్రిలా భావిస్తారు. మనం కూడా పిల్లలను చూసినప్పుడు మన పిల్లలే అనిపిస్తారు. అలాంటి అనుబంధాలు నా సర్వీస్ లో ఎన్నో చూశాను. మనకి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా వాళ్ళ మన దగ్గర ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. వాళ్లు మన కళ్ళ ఎదురుగా తిరుగుతుంటే మన ఇంట్లో మసులుతూ ఉంటే ఆనందమే వేరు. మా రక్త బంధువులు కానీ వాళ్లే అలా ఉంటే మన పిల్లలయితే ఇంకెలా ఉంటుంది? ఓసారి మా రక్త బంధువులు కాకపోయినా మన పిల్లలు కాకపోయినా అంతకంటే మించిన అనుబంధాలను కూడా పెన వేసుకుంటారు.
రమేష్…జరుపుల రమేష్…మా యూనివర్సిటీలో ఏమ్మే తెలుగు పూర్తి చేస్తున్న చివరిలో నాకు దగ్గరయ్యాడు. తన ఎం.ఫిల్., పిహెచ్ డి పూర్తయ్య వరకు మా ఇంట్లో పిల్లోడులాగే ఉండేవాడు. అతను ఇంటి దగ్గర ఉంటే నాకు సొంత కొడుకు ఉన్న ఫీలింగ్ అనిపించేది. రీసెర్చ్ పూర్తి చేసి డిగ్రీ లెక్చరర్ గా వెళ్ళాడు. అయినా తరచుగా ఇంటికి వస్తూ వెళుతూ ఉంటాడు. ఈమధ్య నాకు ఇంకా ఉంటే చాలామంది ఉన్నా ఎందుకో రమేష్ కి ఫోన్ చేయాలనిపించింది. అతడికి ఈ మధ్యకాలంలో ఏదో తెలియని ఏదో అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఫోన్ చేస్తే ఆ విషయాలన్నీ చెప్పాడు. నిన్న ఇంటికి వచ్చాడు. రాత్రి ఇంట్లోనే ఉన్నాడు. అతని ఇంట్లో ఉన్నంత సేపు నాకు ఏదో సంతోషంగా, ఆనందంగా అనిపించింది. అతని కళ్ళల్లో ఆ ఆప్యాయత… మమతాను బంధాలు…అతడు నాకు కుటుంబ సభ్యుడి లాగా అనిపిస్తాయి.
పొద్దున్నే వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళాడు.
నా ఆరోగ్య గురించి పదేపదే జాగ్రత్తలు చెప్పాడు.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
30.12.2
025
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి