“క్రిస్టియన్ అంటే ఎవరు?” అనే అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును....
సీనియర్ ఐపీఎస్ అధికారి శ్రీ పీవీ సునీల్ కుమార్ గారు స్పష్టంగా వివరించారు.
కులం–
మతాన్ని ముడిపెట్టవద్దని ఆయన స్పష్టం చేశారు.
కులం అనేది పుట్టుకతో వచ్చే గుర్తింపు కాగా, మతం అనేది రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ప్రకారం వ్యక్తి తన ఇష్టానుసారం స్వీకరించుకునే హక్కు అని తెలిపారు.
ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2018లో దళిత క్రిస్టియన్లను దళితులుగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపించారని గుర్తుచేశారు.
అలాగే తదనంతరం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపించారని తెలిపారు. కావాలంటే ఈ విషయాలను అసెంబ్లీ రికార్డుల్లో పరిశీలించవచ్చని అన్నారు.
చర్చికి వెళ్లిన ప్రతి ఒక్కరూ క్రిస్టియన్ కారు అనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.
తాను ఏ విషయంపై మాట్లాడినా చట్టం ఆధారంగానే మాట్లాడతానని స్పష్టం చేశారు.
మాలోకం సుధాకర్ బాబు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కేసులో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం —
బాప్టిజం తీసుకున్నవారే క్రిస్టియన్లు;
బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ క్రిస్టియన్ కారు అని హైకోర్టు స్పష్టంగా పేర్కొందని తెలిపారు. ఈ తీర్పు ప్రజలకు అందుబాటులో ఉందని, కావాలంటే గూగుల్‌లో చూసి తెలుసుకోవచ్చని అన్నారు.
హైకోర్టు తీర్పు ఈ విషయంలో పూర్తిగా స్పష్టంగా ఉందని పీవీ సునీల్ కుమార్ గారు వ్యాఖ్యానించారు.
— పీవీ సునీల్ కుమార్ IPS వ్యాఖ్యలు
(FB సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి