"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

02 డిసెంబర్, 2025

తెలుగు సాహిత్యంలో ఆధునికతను తెచ్చిన మహాకవి గురజాడ

 

నినాదం దినపత్రిక, 2.12.2025 సౌజన్యంతో 

తెలుగు సాహిత్యంలో 

ఆధునికతను తెచ్చిన మహాకవి గురజాడ 


తెలుగు సమాజంలో భావజాలపరంగాను, సాంస్కృతికంగానూ ఆధునికతను తెచ్చిన ఘనత గురజాడ వారికే దక్కుతుందని గురజాడ 110వ వర్ధంతి సందర్భంగా గురజాడ ఫౌండేషన్ వారు ఆదివారం రాత్రి అంతర్జాలం ద్వారా నిర్వహించిన గురజాడ 110 వ వర్థంతి, స్మృత్యంజలి సభలో వక్తలు పేర్కొన్నారు. 

జనప్రతిధ్వని దినపత్రిక, 2.12.2025 సౌజన్యంతో 


ఈ సమావేశానికి అమెరికా కేన్సర్ ఔషధ రూపకల్పక శాస్త్రవేత్త, ప్రకాశిక త్రైమాస పత్రిక ప్రధాన సంపాదకులు ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. ప్రతి యేడాది గురజాడ అప్పారావు జయంతి, వర్థంతులను ఆయన సాహిత్య అభిమానులు ఉభయ తెలుగు రాష్ట్రాలలోను, దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకుంటున్నారనీ, అయినా అంతర్జాతీయ, భారతీయ గురజాడ ఫౌండేషన్ వారు కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. గురజాడ అప్పారావు స్థాపించిన ‘ప్రకాశిక’ పత్రికను గత ఐదేళ్లుగా నిర్విరామంగా ప్రచురిస్తూ, గురజాడ వారి రచనలను, సామాజిక స్పృహ గల ఇతరుల రచనలు ఈ సంచికలో ప్రచురిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఐదో వార్షికోత్సవ సంచికలో అందెశ్రీకి నీరాజనాలు అర్పిస్తూ ఒక ప్రత్యేక వ్యాసం ప్రచురించి, గురజాడ అప్పారావు, అందెశ్రీ మానవత్వం, మనిషి తత్త్వం గురించి చర్చించుకుంటున్నట్లు కృత్రిమ మేధ సహాయంతో చిత్రీకరించిన చిత్రాన్ని ముఖచిత్రంగా తీసుకొచ్చామని ఆయన చెప్పారు. ఈ పత్రికను హెచ్ సియు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ప్రకాశిక పత్రిక అంతర్జాలం ద్వారా ప్రచురిస్తున్నప్పటికీ అచ్చు పత్రికను చదువుతున్న అనుభూతి కలిగేలా గురజాడ ఫౌండేషన్ ప్రచురిస్తుందనీ, దానితో పాటు వెబ్సైట్ ద్వారా యూనికోడ్ లో చదువుకొనే సౌకర్యాన్ని కలిగిస్తుందని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. గురజాడ వారి ప్రకాశిక పత్రికను కొన్నాళ్లపాటు గురజాడ అరుణ గారు ప్రచురించడం వివిధ విశ్వవిద్యాలయాలలో సమావేశాలు, సదస్సులు నిర్వహించి ప్రచార రావు తీసుకొచ్చారని తర్వాత ఆచార్య గోపాలకృష్ణ కొవ్వలి ప్రధాన సంపత్తులుగా ఒక సంపాదిక మండలిని ఏర్పాటు చేసి అందులో వివిధ రంగాలకు చెందిన వారిని తీసుకున్నారని అలా తనను కూడా కార్యనిర్వాహక సంపాదకులుగా ఎంపిక చేశారని వెంకటేశ్వరరావు తెలిపారు. గురజాడ వారు స్థాపించిన ఆ పత్రికకు సంపాదకుడిగా పనిచేయడం తనకు జ్ఞానపీఠ్ పురస్కారం, సాహిత్య అకాడమీ పురస్కారం కంటే గొప్పదిగా భావిస్తున్నానని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గతంలో పనిచేసిన సంపాదకమండలి సభ్యుల కృష్ణుని గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం ప్రకాశిక పత్రిక వస్తున్న తీరుతెన్నులను ఆయన వివరించారు. గురజాడ వారి ఆశయాలకు అనుగుణంగా పత్రిక వివిధ రచనలను ప్రచురిస్తూనే, సమకాలీన సాహిత్యంలో వస్తున్న ధోరుణలపై ప్రత్యేక సంచికలను కూడా తీసుకొచ్చిందని ఆయన వాటిని వివరించారు. కవిత్వోద్యమాలు, లఘు కవితాప్రక్రియలు, వాగ్గేయకార సాహిత్యం, ప్రాచీన సాహిత్యం- సామాజిక స్పృహ, గురజాడ భాషా విశేషాలు మొదలైన పేర్లతో ప్రత్యేక సంచికలు తీసుకొని రావడం, ఆ తర్వాత వాటిని పుస్తకాలుగా తీసుకురావడం ప్రకాశిక పత్రిక చేస్తున్న గొప్ప కృషి అని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. 

భూమి పుత్ర దినపత్రిక 2.12.2025 సౌజన్యంతో 


ఈ సంచికలు తీసుకొని రావడంలో ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, ఆచార్య గారపాటి దామోదరం నాయుడు, ఆచార్య జి.యస్.మోహన్, ఆచార్య అయినవోలు ఉషాదేవి, డా. వింధ్యవాసినీదేవి, డా.గెడ్డం శ్యామల తదితరుల కృషి ఎంతగానో ఉందనీ, వారిని గురజాడ ఫౌండేషన్ వారు ప్రత్యేకంగా ఆ యా ప్రత్యేక సంచికలకు సంపాదకులుగా గౌరవించిందనీ పేర్కొన్నారు.

తెలుగు లోకం దినపత్రిక, 2.12.2025 సౌజన్యంతో 


 ఈ సందర్భంగా ఆచార్య గోపాలకృష్ణ కొవ్వలి, ఆచార్య అయినవోలు ఉషాదేవి సంపాదకత్వంలో వచ్చిన ‘గురజాడ సాహిత్యంలో భాషా విశేషాలు’ గ్రంథాన్ని ప్రముఖ కవి, విమర్శకులు, తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎస్.షమీఉల్లా, ‘మనస్వినీయం’ (ఆచార్య గోపాలకృష్ణ కొవ్వలి వారి వచన కవితాసంపుటి)ని ప్రముఖ కవయిత్రి, విమర్శకులు, తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.చెంగల్వ రామలక్ష్మి సమీక్షించారు. 




గురజాడ ఫౌండేషన్ (అమెరికా) అధ్యక్షులు శ్రీమతి గురజాడ అరుణ స్వాగతం పలికిన ఈ సమావేశంలో ప్రత్యేక అతిథి గా సహృదయ సాహితి, అధ్యక్షులు, శ్రీ శేఖరమంత్రి ప్రభాకరరావు మాట్లాడుతూ గురజాడ జయంతి ప్రతి ఏడాది భాషా దినోత్సవం గా నిర్వహించుకుంటామని తెలిపారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గురజాడ ఫౌండేషన్ (ఇండియా) అధ్యక్షులు గురజాడరవీంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్ర జ్యోతి దినపత్రిక, 2.12.2025 సౌజన్యంతో 



కామెంట్‌లు లేవు: