సదస్సులో పాల్గొన్న ఆచార్యదార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ఆచార్య సుబ్చాచారి, ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, డా.పి.విజయ్ కుమార్, డా.లక్ష్మీనారాయణ, డా.రఘు తదితరులు చిత్రంలో ఉన్నారు
సదస్సు లో మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ఆచార్య దార్ల, ఆచార్య కొవ్వలి, డా. రఘుశ్రీ
డా.పి.వియ్ కుమార్
సదస్సులో పాల్గొన్న ఆచార్యదార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ఆచార్య సుబ్చాచారి, ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, డా.పి.విజయ్ కుమార్, డా.లక్ష్మీనారాయణ, డా.రఘు తదితరులు చిత్రంలో ఉన్నారు
నినాదం దినపత్రిక, 16.10.2025 సౌజన్యంతో
భూమిపుత్ర దినపత్రిక, 16.10.2025 సౌజన్యంతో
దిశ దినపత్రిక, 16.10.2025 సౌజన్యంతో
‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి జానపద కళారూపాల పాత్ర ఎంతో కీలకం’
జానపద కళారూపాలను సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటే, వాటి ప్రభావం ఎంత కీలకమో తెలియాలంటే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆ కళలు చూపిన ప్రభావం ప్రత్యక్షంగా కనిపిస్తుందని హెచ్ సియు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. బాబు జగ్జీవన్ రామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల( స్వయం ప్రతిపత్తి) నారాయణగూడ, హైదరాబాద్, తెలుగు విభాగం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు సిపి బ్రౌన్ అకాడమీ సంయుక్త నిర్వహణలో బుధవారం నాడు (15 అక్టోబర్ 2025) " తెలంగాణ జానపద కళల పునరజ్జీవనం- సమాలోచనం " పేరుతో ఒకరోజు అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ప్రారంభోత్సవ సమావేశంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు సినిమాలు సీరియల్స్ లలో చైతన్యవంతమైన రచయితలు, కళాకారులు ఉన్నప్పుడు, తెలంగాణ కళారూపాలను కూడా సందర్భోచితంగా చిత్రిస్తున్నారని పేర్కొన్నారు. మరొక ఆత్మీయ అతిథి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ పి. విజయ్ కుమార్ మాట్లాడుతూ జానపద కళారూపాలు, జాతి కళాతృష్ణకు, సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనాలని, ఇవి మరుగున పడిపోవడం అంటే మన సాంస్కృతిక మూలాలు, చారిత్రిక వికాసం కనుమరుగవటమే అని ప్రస్తావించారు. కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ మడుగు విజయ్ కుమార్ అధ్యక్షత వహిస్తూ విద్యార్థులకు జానపద కళారూపాలు, కళాకారులను పరిచయం చేసే దృష్టితో సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ప్రారంభ సమావేశంలో, ప్రముఖ జానపద సాహితీవేత్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి కీలకోపన్యాసంలో ఆదిమ సమాజం నుంచి ఆధునిక సమాజం వరకు జానపద కళల అభివృద్ధిని వివరించారు. ఆధునిక కాలంలో ఆదరణలేక ఈ కళలు అంతరిస్తున్నాయన్నారు. ఆ కళల పునర్జీవనానికి ఈ సదస్సు కొత్త ఆలోచనలను కలిగిస్తుందని ఆశాభావాని వ్యక్తం చేశారు.ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ పీఠాధిపతి ఆచార్య పులికొండ సుబ్బాచారి మాట్లాడుతూ జానపద కళారూపాలు సజీవంగా ఉండాలంటే వాటిని కళాకారులను పోషించేవారు ఉండాలని చెప్పారు. కాళోజీ పురస్కార గ్రహీత , ప్రజావాగ్గేయకారుడు జయరాజు, ప్రకాశిక త్రైమాసిక పత్రిక ప్రధాన సంపాదకులు ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ జానపద కళారూపాలు అరవైకి పైగా ఉన్నా, కొన్ని కళారూపాలు మాత్రమే మనుగడలో కనిపిస్తున్నాయనీ, అన్నీ కళారూపాలకు ప్రభుత్వ ప్రభుత్వం ఇతర సంస్థల ప్రోత్సాహం అవసరమని ఆయన చెప్పారు. కళాశాల విద్య సంయుక్త సంచాలకులు, ఆచార్య పి బాల భాస్కర్ మాట్లాడుతూ కళ కళారూపాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను తెలిపే ఇలాంటి సదస్సులను నిర్వహించవలసిన అవసరం ఉందని దాని ద్వారా మన సంస్కృతిని కాపాడుకోవచ్చునని అన్నారు.అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ ఆచార్య రాజేంద్రప్రసాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు, ఆచార్య సాగి కమలాకర శర్మ, జర్మనీ నుండి డాక్టర్ తొట్టెంపూడి శ్రీ గణేష్, జడ్చర్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి సుకన్య, సదస్సు సమన్వయకర్త, తెలుగు శాఖ అధ్యక్షులు,డా. రాపోలు శ్రీనివాస్, సదస్సు ఉపసంచాలకులు, డాక్టర్ ఎన్ దీపిక, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ సి.వి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తర్వాత జరిగిన వివిధ సమావేశాలలో ఉభయ రాష్ట్రాల్లోని ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధకులు, అధిక సంఖ్యలో పాల్గొని పత్ర సమర్పణలు చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి