మసి అంటని వెన్నెల అతడు
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
అతడి
ప్రేమకు హద్దులు ఉండనట్టే
ప్రేమించే మనసుకు హద్దులు ఉండవు
వేకువజాము వెలుతురును
ఏ కల్మషం దరిచేరనట్టే
మసి అంటని వెన్నెల అతడు
అతడి
నిత్య చలనానికి కల ఉన్నట్టే
కలం కవనానికి కళ ఉంటుంది
మనిషితో మాట్లాడాలని పలకరిస్తే
మనసుతో స్వరం కలిపే గుణశీలి
అతడు
మనిషిగా మిగలడానికి
తీవ్రంగా తిలోదకాలు ఇచ్చేస్తున్న
కలి కాలాన...
మమతగా మనగలగడానికి
నిరంతరం ఆరాటపడే
సమత మమతల జాడ అతడు
నాకు అరుదైన అన్న
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు...
బావుకాల బంధానుబంధాల కోలాహలంలో
జీవించాలని ఆశిస్తూ...
పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న...
మీ
డప్పోల్ల రమేష్
05.09.2025
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి