ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు❣️❣️❣️
మాకు జ్ఞానాన్ని, ధర్మాన్ని,
నీతిని బోధిస్తున్న వశిష్ఠుడు.
మా చే విమర్శ శాస్త్ర సూత్రాలను
పఠింపజేస్తున్న విశ్వామిత్రుడు.
మమ్మల్ని అత్యుత్తమ శిష్యులుగా
సాన పెడుతున్న ద్రోణాచార్యుడు.
వెన్ను వంచని అశ్వత్తామలుగా
మమ్మల్ని నిలబెట్టే కృపాచార్యుడు.
విద్యనార్జించి ఎవ్వరొచ్చినా వెనక్కి
పంపని పరుశురాముడు.
దానధర్మ గుణాలను హక్కున
చేర్చుకున్న శుక్రాచార్యుడు.
సురాసురులకు సమాన
విద్యనందించిన బృహస్పతి.
సృష్టిలో గురువు స్థానం ఎప్పుడూ శిఖరమే.
గురువును మోసం చేసిన శిష్యుడు
ఉంటాడేమో గానీ
శిష్యుడిని మోసం చేసిన గురువు
ఇలలోనే లేడు
గురువెప్పుడు వెలుగునిచ్చే దీపమే.
ఆ వెలుగులోనే విద్యార్థి వికసిస్తాడు.
దార్ల గారి మాటలే మాకు దిక్సూచి.
వారి బోధలే మాకు ప్రాణ వాయువు.
తానొక జ్ఞాన స్రవంతిలా విరజిమ్ముతూ
మా జీవితాలను సార్థకం చేస్తున్న సాందీపుడు.
మాకు పూలదారులు వేస్తున్న దార్ల గారు
మా మస్తకాలు విప్పుటకు పుస్తకాలు పట్టుకొని
తానొక నిత్య విద్యార్థిలా మారే నూతన బోధకుడు.
మీ జ్ఞానం మరింత వెలుగునివ్వాలని
మీ ఆయురారోగ్యాలు రెట్టింపవ్వాలని
గురుపథం చూపే మీ అడుగులు
ఎల్లప్పుడూ దృఢంగా నిలవాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ
పుట్టిన రోజు శుభాకాంక్షలు సార్❤️🎂🎉
- ఆంజనేయులు ఎర్రోళ్ల
రీసెర్చ్ స్కాలర్, తెలుగు శాఖ,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
హైదరాబాద్ - 500 046
5.9.2025
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి