నిలువెల్లా కాలిపోతున్నా
సుగంధాల్ని వెదజల్లడమే నాకు తెలుసు
గుండెల్లో మేకులు దిగుతున్నా
బలమైన నిచ్చెనగా మారడమే నాకు తెలుసు
నీకు దగ్గర కావడమంటే
అందరికీ దూరమై ఒంటర్ని కావడం కాదు!
నీకు దగ్గర కావడమంటే
అందరికీ దూరం కావడం కాదు
స్వచ్ఛంగా స్వేచ్ఛగా విహరించడం!
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
29.9.2025
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి