"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

20 సెప్టెంబర్, 2025

‘తెలుగు సాహిత్యం -సాంకేతికత’ అంతర్జాతీయ సదస్సులో ఆచార్య దార్ల

 
















       సాంకేతిక సహకారంతోనే తెలుగు భాషాసాహిత్యాభివృద్ధి వేగవంతం

తెలుగు భాషలో సాంకేతిక వినియోగం వల్ల ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం సులభతరం అవుతుందని, దీనికి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు విస్తృతంగా కృషి చేస్తున్నాయని హెచ్ సియు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం (19.9.2025) నాడు సి.యస్.టి.యస్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జంగారెడ్డిగూడెం వారు నిర్వహించిన ‘తెలుగు సాహిత్యం -సాంకేతికత’ అనే అంశంపై నిర్వహించిన ఒకరోజు అంతర్జాతీయ సదస్సులో అంతర్జాలం ద్వారా పాల్గొన్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రధాన ప్రసంగాన్ని చేశారు. రెండు దశాబ్దాల క్రితం కంప్యూటర్, ఇంటర్నెట్లలో తెలుగు భాషా వినియోగం ఎంతో కష్టంగా ఉండేదనీ ప్రస్తుతం కంప్యూటర్ తెరపై తెలుగు కనిపించేలా నిపుణులు ఎంతో కృషి చేశారని, దీన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే తెలుగు భాషా సాహిత్యాలలోని అనేక విషయాలను ప్రపంచానికి శక్తివంతంగా తెలియజేయవచ్చునని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.

 ఈ సదస్సులో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అసోసియేట్ ప్రొఫెసర్, డా. పి విజయ కుమార్ సదస్సుకి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. డా. పి విజయ కుమార్ మాట్లాడుతూ వైజ్ఞానిక,శాస్త్ర,సాంకేతిక విషయాలను పొందుపరచడానికి అనువైన భాష తెలుగు భాష అనీ,విభిన్న ధోరణులను తనలో విలీనం చేసుకొని విరాణ్మూర్తి గా వర్ధిల్లే భాష తెలుగు భాష అని పేర్కొన్నారు. సాంకేతికత అందిపుచ్చుకుంటే తెలుగు భాష చిరంజీవిగా వర్ధిల్లుతుంది. తెలుగు భాషకు సాంకేతిక సొబగులు అద్దితేనే యువతకు భవిత కూడా దేదీప్యమానంగా విరాజిల్లుతుందని స్పష్టం చేశారు. హెచ్ సియు, తెలుగు శాఖకు చెందిన మరొక అసోసియేట్ ప్రొఫెసర్ డా. భాశెట్టి లత మాట్లాడుతూ సాంకేతికత మనుషులని దగ్గర చేసే వారధికావాలనీ, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 కోట్లకు పైగా తెలుగు వారున్నారనీ, అలాంటప్పుడు తెలుగు గ్లోబల్ కావాలి. కానీ సాంకేతికతను సరిగ్గా వినియోగించుకోవలేఖపోతున్నారని అన్నారు. ఈ సదస్సు కన్వీనర్, తెలుగు శాఖ అధ్యక్షులు డా.జి.వెంకటలాల్ మాట్లాడుతూ తెలుగు భాషను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే సాంకేతికతను ఉపయోగించుకోవడానికి ప్రేరణగా ఈ సదస్సుకలిగించాలని భావించానని అన్నారు. ఈ సదస్సులో జర్మనీలోని హైడెల్ బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య తొట్టెంపూడి శ్రీగణేష్ కీలకోపన్యాసం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.యస్.ప్రసాద్ బాబు, ఆర్జేడీ డా.పి.వి.కృష్ణాజీ, మారిషస్ నుండి పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ సంజీవ నరసింహ అప్పడు, మలేషియా నుండి కస్తూరి విజయం తెలుగు పబ్లిషర్, రచయిత పామిరెడ్డి సుధీర్ రెడ్డి, సింగపూర్ నుండి శ్రీమతి పద్మజానాయుడు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య ఎన్వీ కృష్ణారావు, అక్ను (AKNU) తెలుగు శాఖ అధ్యక్షులు డా.టి.సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ డా.ఇళ్ళ రవి, ఐక్యూ ఏసి కన్వీనర్ డా.యం.మధు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బి.శ్రీనివాసరావు విద్యార్థులు పాల్గొన్నారు.










కామెంట్‌లు లేవు: