ఆంధ్ర జ్యోతి దినపత్రిక, 11.9.2025 సౌజన్యంతో
మన తెలంగాణ దినపత్రిక, 11.9.2025 సౌజన్యంతో
దిశ దినపత్రిక, 11.9.2025 సౌజన్యంతో

నినాదం దినపత్రిక సౌజన్యంతో...
డాక్టర్ సి.నారాయణరెడ్డిగారి జీవితం, విశ్వంభర కావ్య తత్వం గురించి మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
సిటీ కళాశాల, హైదరాబాద్ వేదికపై డాక్టర్ సి.నారాయణరెడ్డిగారి జీవితం, విశ్వంభర కావ్య తత్వం గురించి మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
విద్యార్థులు, అధ్యాపకులతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
మాట్లాడే ముందు సభలో ఆశీనులైన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, పక్కన డా.భాస్కర్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు
మాట్లాడే ముందు సభలో ఆశీనులైన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, పక్కన డా.భాస్కర్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు
మాట్లాడే ముందు సభలో ఆశీనులైన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, పక్కన డా.భాస్కర్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు
నిలువెత్తు మానవత్వమే సినారె సాహితీ సంతకం
తెలుగు సాహిత్యంలో ఒక నిలువెత్తు మానవత్వపు సంతకమే సినారే సాహిత్యమని హెచ్ సియు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. విశ్వనాథ కళాపీఠం, సిటీకళాశాల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం (10.9.2025) సిటీకళాలలో ఒక రోజు ‘జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల సాహిత్య సదస్సు’ జరిగింది. ఈ సదస్సులో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు డా.సి.నారాయణరెడ్డి జీవితం, సాహిత్యం గురించి మాట్లాడారు. అధ్యాపకుడు,, కవి, పరిపాలనాదక్షుడు అయిన సినారెది తెలుగు సాహిత్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమనీ, ఆయన రచించిన ‘విశ్వంభర’కు జ్ఞానపీఠ్ పురస్కారం వచ్చిందని, అది సృష్టి ఆవిర్భావం నుంచి మానవుని అన్వేషణ అంతా శాస్త్రీయంగా వర్ణించిన కావ్యమని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సోదాహరణంగా వివరించారు. ఐదు భాగాలుగా ఉన్న ఆ కావ్యంలో ప్రకృతిలోని పంచభూతాలను, మానవునిలోని పంచేంద్రియాల స్పందనను సమన్వయించిన ఒక అన్వేషణను తెలుపుతుందని వివరించారు. సుమారు ఎనభై ఏడేళ్ళ పాటు జీవించిన సినారె తన ప్రతి పుట్టినరోజుకీ ఒక పుస్తకం ఆవిష్కరించే వారనీ, ఆయన అరవై రచనలు పద్దెనిమిది సంపుటాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయన కవిత్వంలో తెలుగు తనం, మానవత్వం, అభివ్యక్తి వైవిధ్యం నిండుఉంటాయని ఆచార్య దార్ల పేర్కొన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్. లక్ష్మణచక్రవర్తి, రావూరి భరద్వాజ గురించి డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య ఎన్. రజని మాట్లాడారు. ఉదయం ప్రారంభసమావేశంలో ముఖ్య అతిథిగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, కళాశాల ప్రిన్సిపాల్ డా.బాల భాస్కర్, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కోయికోటేశ్వరరావు,
డాక్టర్ వెల్చాల కొండలరావు, డా.జె.నీరజ, విశ్వనాథ శోభనాద్రి, సదస్సు సంచాలకులు అవధానం సుజాత, అధ్యాపకులు డా.పి.కమల సుధారాణి, ఆచార్య కాకునూరు సూర్యనారాయణ మూర్తి, సుజాతా ఆజ్మీరా, డా.భాస్కర్, డా.మల్లికార్జున్ లతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానవక్తలను ఘనంగా సత్కరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి