"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

25 ఆగస్టు, 2025

ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారితో నా కొన్ని సంభాషణలు)

 (ప్రముఖ విమర్శకుడు, పరిశోధకుడు, ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా పని చేసిన ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు 1 ఆగస్టు 2025 వ తేదీన అమెరికాలోని తన కుమారుని ఇంటి దగ్గర మరణించారు. ఆయనతో గల పరిచయం నాలో కొత్త కొత్త విషయాలను నేర్చుకొనేలా ప్రేరేపించేది. నిత్య అధ్యయనశీలత్వాన్ని నేర్పింది. ఆయనతో నేను జరిపిన కొన్ని సంభాషణలు ఇక్కడ పెట్టాలనుకొంటున్నాను...దార్ల)

ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగార్కి నేను రాసిన ఈ మెయిల్.

సార్... నమస్కారం,

నిన్న (12మార్చి2017) సాయంత్రం 4.45 ని.ల నుండి సుమారు రెండు గంటలు మీ ఇంటి దగ్గర గడిపి క్షణాలు మరిచిపోలేను. ఆత్మీయంగా మీరు పెట్టిన పకోడి, చెకోడి, స్వీటు, పాయసం(ఇది మరీ అద్భతః) చాలా బాగున్నాయి. అవి నేను తింటుంటే మీరు సంతోషపడిన దృశ్యం నా కళ్ళల్లో మెదులుతోంది. పిల్లాడు తింటుంటే తండ్రి సంతోషపడుతున్నంత ఆత్మీయంగా అనిపించింది. 
మా పరిశోధక విద్యార్థుల కోసం మీరు మళ్ళీ మీ పాతనోట్సులను, పుస్తకాలను, జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటా అక్షరమవుతున్న దృశ్యాలు మీలోనుండి వెలువడే శక్తినీ, నాలో కొత్త ఆశనీ కలిగిస్తున్నాయనిపించింది.
మీరు రాసిన పుస్తకాన్ని (పరిశోధన కళ) మీ నోటి నుండి వినేటప్పుడు, వాటిని వివరించేటప్పుడు వాక్యాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎందుకు విరవాలో, కామా, ఫుల్ స్టాప్ (తదితర విరామ చిహ్లాలు) వంటివాటి వల్ల రచయిత ఉద్దేశమేమిటో మీ కంఠస్వరంలో వినడం ఒక మధురానుభూతి.
మధ్యమధ్యలో మీమీద మీరే జోక్స్ వేసుకోవడం ( వాక్యం విషయంలో ‘కాంపోజిషన్ రాయాలేమో‘ వంటివి) వాటినేమి చేయాలో ఎడిటర్ గా నీ ఇష్టం అనడం...  నాకు బలే ఛమత్కారం అనిపించింది.
మీరు concept కీ, Idea కీ చెప్పిన సోదాహరణ వివరణ నాకు చాలా బాగా నచ్చింది. అయినా అలా చెప్పడంలో మీ తార్కిక వాజ్ఞైపుణ్యమే గెలిచిందేమో అనిపిస్తుంది. నాకింకా ఇలాంటి పారిభాషిక పదాల పట్ల అనుమానాల దొంతర్లెన్నో ఉన్నాయి. 
మీ పరిశోధన గ్రంథం ‘తెలుగు సంస్కృతి శాసనాలు: చారిత్రక పరిణామాలు’ నాకిస్తూ మీరు రాసిన మాటలు నాలో కొత్త శక్తినీ, చేయాల్సిన కృషినీ ప్రబోధిస్తూ చైతన్య పరుస్తున్నాయి. 
పెట్టినవాళ్ళనీ, కొట్టిన వాళ్ళనీ మరిచిపోలేమన్నట్లు ఎంతో ఆత్మీయంగా మీ పుస్తకానికి మీరు ‘ముందోమాట’ రాశారు. 
ప్రపంచీకరణ వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక ‘ప్రభావాలు’ కనిపిస్తున్నా, కొన్ని దేశాలు తమ సంస్కృతే గొప్పదని చాటుకునే ఛాందస భావనను చర్చకు పెట్టింది. పరిశోధనల గురించి వచ్చిన పుస్తకాల గురించి కొన్ని సందేహాల్ని వ్యక్తం చేసినప్పుడు- మీరు మాట్లాడుతూ ‘ఇలాంటి ప్రజాస్వామిక వాతావరణం రావడం వల్ల పరిశోధనలో ఒకవైపు ఆలోచనలే శాసించే ధోరణి’ క్రమేపీ తగ్గిందన్నారు. ఈ పరిస్థితుల్లో మీ పుస్తకం అచ్చయి రావడం సందర్భోచితం అనుకుంటున్నాను. 
మాలాంటివారు మాట్లాడ్డానికి ఒక ఆధారంగా ఉపకరిస్తుంది.
నేను మా ఇంటికి బయలుదేరేముందు, కారు దగ్గర మిమ్మల్ని అడిగిన (విమర్శ, పరిశోధనలకు సంబందించి) కొన్ని అనుమానాలు, వాటికి మీరిచ్చిన వివరణలు నాలుగైదు క్లాసుల పెట్టు. ముఖ్యంగా  Richard's Practical Criticism గురించి మీరు మేఘాల్లో ఒకవైపు తెల్ల ఏనుగులు, మరొకవైపు నల్లఏనుగుల చిత్రపటాలను తరగతి గదిలో విద్యార్ధులకు చూపి పాఠం చెప్తామంటూ చెప్పిన వివరణ నా తరగతికి ఎంతో సహకరిస్తుంది; నా అవగాహనను మరింత పెంచింది.
ఆధునిక సాహిత్య విమర్శ సిద్ధాంతాల గురించి మరోసారెప్పుడన్నా మీరు అనుమతిస్తే కొన్ని క్లాసులు చెప్పించుకోవాలనిపిస్తుంది.
ఈరోజు ‘సాక్షి’లో  నిన్న ఉదయం  నాతో  ఫోనులో మాట్లాడిన గంగిశెట్టి సాహితీకిశోర్ గారి వ్యాసం వచ్చింది. వి.రాజారామమోహనరావు గారి ‘నవలాహృదయం-2’ పుస్తకం గురించిన ఒక విమర్శనాత్మక పరిచయ వ్యాసమది. ‘ఒక మహాకావ్యానికీ, ఒక ఎపిక్ కూ ఆధునిక యుగం ఇచ్చిన ప్రత్యామ్నాయ కానుక, నవల’ అని చెప్పిన మాట, రాజారామమోహనరావుగారి ‘హిత-మితవైఖరి’ని గుర్తించేలా చేసిందా వ్యాసం.
నాకు మీ పుస్తకాన్నివ్వడంతో పాటు,
మీ అనుభవజ్ఞానాన్ని పుస్తకంగా అందిస్తున్నందుకూ
నమస్సులతో
మీ
దార్ల 
13.3.2017
...

....

గురుతుల్యులు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గార్కినమస్కారం,
సార్. రాత్రి మీతో మాట్లాడ్డం ద్వారా పరిశోధనకు సంబందించిన అనేకాంశాలు తెలిశాయి. ఆ సందర్భంలోనే నేను గతంలో ఒక ప్రసంగం కోసం PPT తయారు చేసుకున్నానని చెప్పాను. దాన్ని ఇప్పుడు రాస్తే చాలా మార్పులు చేయవచ్చునని అనిపించింది. అయితే, దాన్ని అప్పుడెలా రాసుకున్నానో, దాన్నే మీ పరిశీలన కోసం పంపిస్తున్నాను. 
మీ సమయాన్ని బట్టి, వీలువెంబడి ఒకసారి చూడగలరు.
నమస్సులతో
మీ 
దార్ల 
9.2.2017

Dear Darla! The file is not opening. It reports"problem to open" . Even retrying has become futile. ..

సారీ సర్...
మీ సిస్టమ్ లో ppt సాప్టవేర్ ఉందనుకొని, ఆ ఫార్మేట్ లో పంపాను. బహుశా మీరు డెస్కటాప్ లో కాకుండా టాబ్ లో చూసి ఉంటారు. దానిలో అటువంటివి చూడాలనుకుంటే play store/google play store లో ppt ఏప్ డౌన్ లోడ్ చేసుకొని, దాన్ని ఇన్ స్టాల్ చేసిన తర్వాత సిస్టమ్ ని రీ స్టార్ట్ చేస్తే ఆ సాప్ట్ వేర్ పనిచేస్తుంది. 
ఈ సమస్య లేకుండా మీకు నేను పిడిఎఫ్ లో దాన్ని పంపిస్తున్నాను.
నమస్సులతో
మీ
దార్ల 
10.2.2017
...

సార్ ... నమస్కారం,
మీరు రాసిన కవితలో అమెరికా జీవితంలోని బహుళ సాంస్కృతిక వైవిధ్యాన్ని చక్కగా కవిత్వీకరించారనిపించింది. కొంచెం నగిషీలు చెక్కాల్సిందనీ అనిపించింది.
ఈ కవితను మీ అనుమతి ఉంటుందని భావిస్తూ మా విద్యార్థుల సౌలభ్యం కోసం నా బ్లాగులో పున: ప్రచురించాను. లింక్ : https://vrdarla.blogspot.in/2017/02/blog-post_5.html
నమస్సులతో
మీ
దార్ల 
6.2.2017
....

సార్... నమస్కారం
నిన్న మీరు మాట్లాడిన తర్వాత, మీరు రాయబోయే విమర్శ, పరిశోధనలకు సంబంధించిన ఒక అబ్బాయిని చూశాను. 
మహాభారతం రాయడానికి విఘ్నేశ్వరుడు అవసరమయ్యాడని చదువుకుంటాం. ఆధునిక కాలంలో విశ్వనాథ సత్యనారాయణ గారికి జువ్వాడగౌతమరావు గారు రాసేవారని విన్నాను. 
అలాంటి భాగ్యాన్ని ఒక అబ్బాయికి మీ నుండి కలగబోతుందని చెప్పాను. అతను సంతోషంతో అంగీకరించాడు.
ఆ అబ్బాయి మీరు ఫోనులో చెప్తుంటే డైరెక్ట్ గా టైపు కూడా చేయగలడు. మీ రచనలంటే చాలా ఇష్టపడుతుంటాడు. అతడు మా యూనివర్సిటి తెలుగుశాఖలో అధ్యాపకుడుగా పనిచేస్తున్నాడు. అతడు పొద్దున్నే క్లాసుకి ప్రిపేర్ అయి పదిగంటలకు వెళతాడు. సాయంత్రం ఐదు గంటలకు వస్తాడు. ఆ తర్వాత మీకెప్పుడు సమయం చిక్కినా ఆ సమయంలో అతను మీకు అందుబాటులో ఉంటాడు. అతని పేరు డా.దార్ల వెంకటేశ్వరరావు.
ఈ అబ్బాయి మీకు అందుబాటులో ఉంటానని చెప్పాడు.
నమస్కారాలతో
మీ 
దార్ల 
5.2.2017
....

ప్రియమైన దార్లా! నిన్నో మెయిల్ పంపా! చూశావా? కౌముది.నెట్ లో ఈనెల తాజా కౌముది ఈ పత్రికలో చిటెన్రాజు వ్యాసం చూడండి.
లనా
5.6.2016.
....

సర్, నమస్కారం,
ఎలా ఉన్నారు? బాగున్నారని భావిస్తూ...
అక్కడున్నా మ్యాగజైన్స్ చదువుతున్నారని అర్థమయ్యింది. మీ మెయిల్ ఇదే చూశాను. పాత మెయిల్స్ లో మరో మెయిల్ ఏమీ కనిపించలేదు. 
ఇక,
మొన్ననే గీతగారు నడుపుతున్న ఒక వెబ్ కి మీరు కూడా సలహాదారులుగా ఉన్నట్లు చదివి, సంతోషించాను. రచయితల వివరాలన్నీ ఆ వెబ్ లో పెడుతున్నారనుకుంటున్నాను.
జూన్, 2016 కౌముది.నెట్  ఇప్పుడే చూశాను. మా యూనివర్సిటీ లో నేను ప్రతిపాదించిన ప్రవాసాంధ్రసాహిత్యం కోర్సులో ఆయన కథ, మిగతా వారి కథలను ప్రస్తావించారు. 
అయితే, గొర్తి సాయిబ్రహ్మానందం గారు కూడా ఫోను చేశారు. అమెరికాలో ఉంటూ తెలుగు సాహిత్యం రాస్తున్నవాళ్ళు చాలా మంది ఆసక్తిగా గమనిస్తున్నారని అనుకుంటున్నాను. 
ప్రస్తుతం ఏమి చేస్తున్నారు సర్, 
ప్రస్తుతం మా యూనివర్సిటీ లో ప్రవేశపరీక్షలు జరుగుతున్నాయి.
నా దగ్గర ఈ నెలలో రెండు పిహెచ్.డిలు, ఒక ఎం.ఫిల్ ఈ నెలాఖరుకి సబ్మిట్ చేస్తున్నారు.  ఆ పనిలో ఉన్నాను.
అలాగే, ఈ నెలాఖరుకి నా పుస్తకం ( వివిధ పుస్తకాలకు రాసిన ముందుమాటలు, అభిప్రాయాలు, సమీక్షలు కలిపి) తీసుకురావాలనుకుంటున్నాను. 
మరిన్ని విషయాలతో 
మీ 
మెయిల్ కోసం ఎదురు చూస్తూ...
మీ
దార్ల 
5.2.2016

....

గౌరవనీయులు ఆచార్య లక్ష్మీనారాయణగార్కి నమస్కారం,
మీరు అమెరికా (సుమర్ణభూమి) జాగ్రత్తగా చేరుకున్నారని భావిస్తున్నాను. 
నాకు మీరు పంపిన పుస్తకం నిన్న చదివాను. అయ్యో.. ఈ పుస్తకం ముందే చూసి ఉంటే నా వ్యాసానికి క్లాసికల్ మీద మరింత మంచి సమాచారం లభించి ఉండేదనిపించింది.  మీరు దీన్ని పాశ్చాత్యదేశాల్లో క్లాసిక్, క్లాసికల్, క్లాసిసిజమ్ లను ఏ దృష్టితో అర్ధం చేసుకున్నారో, దాన్ని భారతయులెలా అర్థం చేసుకోవాలో తులనాత్మకదృష్టితో చక్కగా చెప్పారు. క్లాసికల్ ని శాస్త్రీయంగా అవగాహనచేసుకోవడానికి  కొన్ని సూత్రాలను ప్రతిపాదించి సైద్ధాంతీకరించే ప్రయత్నం మీలాంటి అనుభవజ్ఞులు చేస్తేనే బాగుంటుందని ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత అనిపించింది. నాకు కొంత ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగించింది. నా అభిప్రాయాలు కూడా మీ అభిప్రాయాల్ని కొన్నయినా అందుకోగలిగినందుకు. ముఖ్యంగా క్లాసిక్ అంటే ప్రాచీనం అని రాస్తున్నవాళ్ళను చూసి నాకు చాలా బాధ అనిపించేది. అది తీరిపోయింది మీ వ్యాసం చదివిన తర్వాత.   ప్రాచీన భాషాను వివరించడంలో రాయలసీమలోని సామెతల్ని కూడా సందర్భోచితంగా ఉపయోగించుకున్నారు. ఏకబిగిని చదివాను. చాలా బాగుంది. తెలుగుకి ప్రాచీన హోదా రావడంలో మీ కృషి ఇంత ఉందని, వీరప్పమొయిలీదగ్గరకు కూడా వెళ్ళిందనీ నాకు తెలియదు. నాకే కాదు ఈ కృషిని చాలామంది ప్రచారంలోకి రానివ్వలేదేమోననిపిస్తుంది. మండలివారు రాసిన ముందుమాట వారే రాసారా? అనిపిస్తుంది. ఆయన రాయలేరని కాదు...  మరిన్ని విషయాలను తర్వాత రాస్తాను. అమెరికా క్షేమంగా చేరారో లేదోననే మీ శ్రేయోభిలాషిగా మీ కోసం ఆలోచించే వాళ్లలో ఒకడిగా మీ గురించి ఆలోచిస్తూ, మీ గురించి రాస్తూ కూడా మీ పుస్తకం గురించే రాసేస్తున్నాను. మరో మెయిల్ లో ఆ విషయాలు రాస్తాను. అన్నట్లు మీ చేత తెలుగులో మెయిల్ టైపు చేయించేశాను. అది చూసి నాకెందుకో చాలా ఆత్మీయంగా అనిపించింది. 
ముందు అమెరికా వాతావరణానికి మీరు మరలా కుదుట పడిన తర్వాతనే రిప్లై ఇవ్వండి.మీరెలా చేరారనే ఆరాటమేదో తొందరగా రాయమంటే వెంటనే మెయిల్ రాసేశా... నమస్కారాలతో
మీ 
దార్ల 
23.4.2016

ప్రియమైన దార్లా!
క్షేమంగా చేరాను.
పుస్తకం చదివుతున్నందుకు ధన్యవాదాలు,
అందులో కొత్తమాట మొదటి అధ్యాయంలో ఉంది.
కాల్డ్వెల్ తెలుగుకు చేసిన దురాగతాన్ని తెలపడంలో ఉంది.
కొత్త తరం దాన్ని గుర్తిస్తే నా రాత ధన్యమవుతుంది.

చెప్పానుగా! ఇద్దరిలో సమాన భావధర్మమేదో ఉందని.
నక్షత్రమేదో కలిసింది,అందుకే ఒక్కలా ఆలోచిస్తామేమో!
నేనాపిన చోటునుంచి, నువ్వు మరికొంత ముందుకెళ్లాలి,
ఇంతకీ ఇందులో నీ ఆలోచనలేమిటో రాతలో ఉంటే పంపవా?

అమెరికా వాతావరణానికి కుదుటపడ్డమంటే
రాత్రిళ్లు కన్నారా నిద్రపోవడం,
అది అక్కడా లేదు, ఇక్కడా లేదని సరిపెట్టుకోవడం
కళ్లల్లో కలల్తో కలిసి జీవించడం!

ఉంటామరి,
లనా

గౌరవనీయులు ఆచార్య లక్ష్మీనారాయణగార్కి నమస్కారం,
ఆత్మీయమైన మీ ఈ మెయిల్ మోసుకొచ్చిన మీ క్షేమసమాచారంతో పాటు, నేను చదవాల్సిన దాన్ని కూడా సూచించింది. మీరెలా వెళ్ళారు? క్షేమంగా చేరారుకదా? ఇలాంటివన్నీ అడగాల్సింది పోయి పుస్తకాల గురించి రాసేస్తున్నావేమిటని నన్నెవరో అడిగినట్లనిపిస్తే, ఆ విషయాలన్నీ రాయకుండా ఆపేశాను. మీరు ముందుమాట రాసిన ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి పుస్తకం ( అరుణాచలం గారి గురించి) నిన్ననే  చూసిన తర్వాత, నా కొకటి అనిపించింది. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకీ ఎవరికి ఏ స్థాయిలో చెప్పాలో అనుభవాన్ని రంగరించి చెప్తున్నారనిపించింది. పండినఖర్జూరం చూడ్డానికి మడతలు పడిపోయి బాగుండకపోయినా, దాన్ని తినేటప్పుడు దాని తీయదనం చాలా బాగుంటుంది. మీరింత మృదువుగా మనసుల్ని తట్టేలా మాట్లాడగలగడంలోను, రాయడంలోను మీలో ఉన్న ఫిలసాఫికల్ లోతులే వాటికి  కారణమనిపించింది.మనిషిని ప్రేమించేతత్త్వమే కారణమనీ అనిపించింది. దీని గురించి తెలియక అమాకంగానే ఏదీ దాచుకోకుండానే ‘ సార్ మీరు కవిత్వం రాశారా? ఇప్పుడు రాస్తున్నారా?’ అని అడిగాను. జీవితాన్ని స్పర్శిస్తున్నారని ఈ పుస్తకానికి రాసిన ముందుమాటను బట్టి అనిపించింది. Life, Before Life, After Life ల గురించిన చర్చ చేస్తూనే, ఉపనిషత్తుల సారాంశాన్ని ఆయన నామానికి apply చేసిన తీరు నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కొప్పున్నమన్న ఎలా కట్టుకున్నా అందమే అనే సామెత గుర్తొచ్చింది. జ్ఞానం ఉంటే దాన్ని ఎలాగైనా అనువర్తించవచ్చనిపించింది.మీ పుస్తకాలు, మీ వ్యాసాలు ఇంతకాలం ఎలా మిస్సయ్యానా అని అనిపిస్తుంది. 
మీరిచ్చిన పుస్తకంపై మీరు రాసిన వాక్యం నాకెంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉంది. ధన్యవాదాలు. 
ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. నా పరీక్ష రేపు జరుగుతుంది. మరలా వెంటనే ఫలితాలు ఇచ్చేయాలి. దీనితో పాటు ఒక యూనివర్సిటీ వాళ్లు ఎం.ఏ. ప్రవేశపరీక్షకు పశ్నాపత్రాన్ని తయారుచేయమన్నారు. ఈ పనుల్లో ఉన్నా, మీ లేఖ నాకేదో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. 
మీరిచ్చిన పుస్తకం గురించి నా అభిప్రాయాల్ని త్వరలోనే రాస్తాను. 
మీరు అమెరికానుండి అందమైన తెలుగు అక్షరాల దండల్ని పంపిస్తుంటే, నేను ఆస్వాదించాలని ఎదురు చూస్తూ...
మీ
దార్ల 
24.4.2016

( ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారితో నా సంభాషణ)

కామెంట్‌లు లేవు: